ఉప్పు పుకార్లూ కూడా సీఎం గారు చూడాలా??


 • దొరకదనే వదంతులు.. తెలుగు రాష్ట్రాల్లో వేలం వెర్రి
 • కిలో రూ.30 నుంచి వంద దాకా పలికిన ధర
 • వ్యాపారుల బ్లాక్‌ మార్కెట్‌ దందా
 • పెద్ద నోట్ల రద్దు పేరుతో దోపిడీ పర్వం
 • దుకాణాల వద్ద బారులు తీరిన జనం
 • పురుషులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద,
 • మహిళలు కిరాణా దుకాణాల వద్ద క్యూ
 • ఉన్న చిన్న నోట్లు కాస్త ఉప్పునకు ఖర్చు
 • హైదరాబాద్‌లో పలువురు అదుపులోకి
 • కొరత లేదు: పౌరసరఫరాలు
 • ఉత్పత్తి బాగానే ఉంది: జైట్లీ, నిర్మల
హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరుగుతుందని డాక్టర్లు చెబుతారు. కానీ, ఉప్పు తక్కువైందంటూ తెలుగు ప్రజల బీపీని పెంచేశారు! ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీల్లో మొదలైన వదంతులకు తెలుగు రాష్ట్రాల్లో వేలం వెర్రిగా స్పందించారు. పురుషులు నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కడితే, మహిళలు ఉప్పు కోసం దుకాణాలు, సూపర్‌ మార్కెట్ల వద్ద ఎగబడ్డారు. పదులు, వందల సంఖ్య ఉప్పు బస్తాలు, ప్యాకెట్లు కొనుగోలు చేసేశారు. కొన్ని పట్టణాల్లో ఏడాదిలో విక్రయించే ఉప్పును కేవలం ఒక్క రోజులోనే అమ్మేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజల వేలం వెర్రిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. పది రూపాయల ఉప్పు ధరను 50 నుంచి 100 వరకూ పెంచేశారు. ఉప్పు ధర 300 నుంచి 500 వరకూ పెరుగుతుందని ప్రచారం చేయడంతో ఆందోళన పడ్డారు. మరికొన్నిచోట్ల ప్రజల వద్ద మిగిలిన చిల్లరను రాబట్టుకోవడానికి వ్యాపారులు కొత్త ఎత్తు వేశారు. ఉప్పునకు కృత్రిమ కొరత సృష్టించారు. దాంతో, బ్యాంకుల వద్ద పడిగాపులు కాసి తీసుకొచ్చిన చిన్న నోట్లను వ్యాపారులకు ఇచ్చి ఉప్పును కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కిలో ఉప్పును 30 నుంచి 200 వరకూ విక్రయించారు. హోల్‌సేల్‌ షాపుల్లోనూ ఒక్కో బ్యాగుపై 400-600 అదనంగా వసూలు చేశారు. మలక్‌పేటలోని హోల్‌సేల్‌ షాపుల వద్ద జనం ఎగబడ్డారు. కాగా, పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌ ప్రాంతంలో కిలో ఉప్పును రూ.200కు విక్రయిస్తున్న షాగంజ్‌ ప్రాంతవాసి మహ్మద్‌ సిరాజుద్దీన్‌ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. షాపూర్‌ నగర్‌లో ఉప్పును బ్లాక్‌లో విక్రయిస్తున్న ఘన్‌ శ్యాం ట్రేడర్స్‌ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ ట్రేడర్స్‌కు చెందిన రాధేశ్యాం, సావర్‌, నగేశ్‌లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బోరబండ పరిసర ప్రాంతాల్లో ఉప్పును అధిక ధరకు విక్రయించిన వ్యాపారులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌లు మందలించారు.
పాత బస్తీలో కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్ల వద్ద ప్రజలు బారులు తీరారు. చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వెళ్లే మార్గంలో ఉప్పును అధిక ధరకు విక్రయిస్తున్న ఆటోవాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో కిలో రూ.10 ఉన్న టాప్‌, నిర్మా కంపెనీల ఉప్పును రూ.30-50 వరకూ; రూ.18 ఉన్న టాటా, ఆశీర్వాద్‌, అన్నపూర్ణ వంటి కంపెనీల ఉప్పు ప్యాకెట్లను రూ.50 నుంచి 70 వరకూ విక్రయించారు. భువనగిరిలో ఒక్కొక్కరూ బస్తాలు, వందలు, పదుల కిలోల లెక్కన కొన్నారు. గ్రామాల్లో రిటైల్‌ వ్యాపారులు ఉప్పును ఆటో ట్రాలీల్లో తరలించారు. మరికొంతమంది ఏకంగా ఆటోలను తీసుకొచ్చి హోల్‌సేల్‌ దుకాణాల ముందు బారులు తీరారు. భువనగిరి గంజ్‌లోని హోల్‌సేల్‌ డీలర్‌ ఒకరు ఏడాది మొత్తం విక్రయించే ఉప్పును శనివారం ఒక్కరోజే అమ్మేశానని చెప్పారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలవ్యాప్తంగా ఉప్పు నిల్వలు లేకుండాపోయాయి. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో కిలో ఉప్పును రూ.50కి పెంచేశారు. సోమవారం నాటికి కిలో 300 కానుందనే ప్రచారం జరగడంతో నారాయణఖేడ్‌ ప్రాంతం, అల్లాదుర్గం, పుల్‌కల్‌, హత్నూర తదితర మండలాల్లోని కిరాణా షాపుల వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుక్కెళ్లారు. 150 రూపాయల 30 కిలోల దొడ్డు ఉప్పు బస్తాను మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో 500 నుంచి 600కు విక్రయించారు.
అయోడైజ్డ్‌ ఉప్పును 50-60కి అమ్ముతున్నారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉప్పు కోసం జనం క్యూ కట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వ్యాపారులు ముందే అప్రమత్తమై ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టారు. పక్క రాష్ట్రాల్లో ఉప్పు కొరత ఏర్పడిందని, తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప్పు దొరకదనే వదంతులతో బైకులు, ఆటోల్లో వచ్చి మరీ కొనుగోలు చేశారు. దాంతో ఖమ్మంలోని గాంధీ చౌక్‌లో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఉప్పు నిల్వలు మొత్తం అయిపోవడంతో అప్పటికప్పుడు మళ్లీ లోడు తెప్పించారు. ఇక, కడప జిల్లా రాయచోటి, సుండుపల్లె, చిన్నమండెం, ప్రొద్దుటూరు, ముద్దనూరు, జమ్మలమడుగు, బద్వేల్‌, పులివెందుల తదితర ప్రాంతాల్లో ఉప్పును పది రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. సముద్రం ఒడ్డునే ఉన్న.. ఉప్పు పండించే నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 160 రూపాయల ఉప్పు బస్తా రూ.500 పలికింది. నంద్యాల, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున ఉప్పు కొనుగోలు చేశారు. అధిక ధరకు విక్రయిస్తుండడంతో బుచ్చిరెడ్డిపాలెంలో శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. ‘‘నిత్యం అందుబాటులో ఉండే ఉప్పు ఇప్పుడు బంగారం ధర కంటే భగ్గుమంటోంది. ఓవైపు నగదుకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు ఉప్పు భగ్గుమంటోంది’’ అని వేమసాని రాజగోపాలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో 30 నుంచి 100 వరకూ వివిధ ప్రాంతాల్లో వివిధ ధరలకు విక్రయించారు. విజయనగరం, విశాఖల్లో ఉప్పును బ్లాక్‌ చేశారు. కాగా,దీనిపై పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత అన్ని జిల్లాల జేసీలు, పౌర సరఫరాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యూపీ వంటి రాష్ట్రాల్లో ఉప్పు కొరత ఏర్పడిందని తెలుసుకున్న ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన బేగం బజార్‌లో వ్యాపారులు అమ్మకాలు నిలిపి వేశారు. తెలిసిన వారికి మాత్రమే అమ్మకాలు చేశారు.

మొరాదాబాద్‌లో మొదలు
న్యూఢిల్లీ, నవంబరు 12: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉప్పు కొరతకు కారణమైంది. ఉప్పునకు కొరత లేదని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదు. ఇంతకీ, ఉప్పు వదంతులు పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో! ఉప్పు కొనుక్కోవడానికి కొంతమంది షాపులకు వెళ్లారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చిన్ననోట్ల కొరత వచ్చింది. అంతా రూ.500 నోట్లనే తీసుకెళ్లి ఉప్పు తదితర నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు. దాంతో, వారికి చిల్లర ఇవ్వడం వ్యాపారులకు సమస్యగా మారింది. దాంతో, మూడో కిలోల ఉప్పునకు రూ.500 ఇవ్వాలని కొంతమంది వ్యాపారులు డిమాండ్‌ చేశారు. దాంతో, ఉప్పు కొరత కారణంగానే ఇలా చేస్తున్నారనే అపోహ ప్రబలింది. శుక్రవారం సాయంత్రానికే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో, వ్యాపారులు కూడా ఉప్పు ధరను పెంచేశారు. ఇక, ఉప్పుపైనే మరో కథనంవినిపిస్తోంది. చైనాలో కిలో ఉప్పు రూ.100 అయిపోయిందని, ఎక్కువ జనాభా కనక ఎక్కువ ఉప్పు వినియోగం కూడా అక్కడేనని, దాంతో మన దేశంలోనూ కొరత వస్తుందనే ప్రచారాన్ని ఢిల్లీలోని దర్యాగంజ్‌ ప్రాంతంలో కావాలనే సృష్టించారని అంటున్నారు.

‘చిల్లర’ ఎత్తుగడ

మార్కెట్‌లో చిల్లర నోట్లకు ఉన్న డిమాండ్‌ దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఉప్పు ధర పెరుగుతుందనే ప్రచారానికి తెర లేపారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో నాలుగు రోజులుగా పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలనే తేడా లేకుండా చిల్లర కోసం బ్యాంక్‌ల వద్ద క్యూలు కడుతున్నారు. పెద్ద ఎత్తున చిల్లర రాబట్టుకునేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ఉప్పును అమ్మకానికి పెట్టాలని కొందరు వ్యాపారులు వ్యూహాత్మకంగా ఉప్పు ధర పెరుగుతుందంటూ ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో పల్లెల్లో ఎక్కువగా ఉప్పుకు డిమాండ్‌ పెరిగింది. ప్రతి ఇంటా ఉప్పు అవసరం కచ్చితంగా ఉంటుంది. దాంతో, రెండు రోజులుగా బ్యాంకుల వద్ద పడిగాపులు కాసి తెచ్చుకున్న రూ.50, 100 నోట్లతో ఉప్పు ప్యాకెట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారులకు ఉప్పు అమ్మకాలతో లాభం చేకూరడంతోపాటు పెద్ద ఎత్తున చిల్లర పోగైనట్లయింది. దీనికితోడు చాలా కాలంగా గోదాముల్లో నిల్వ ఉన్న ఉప్పు బస్తాలు ఖాళీ అయ్యాయి.
పది ప్యాకెట్లు కొన్నా..
ఉప్పు ధర పెరుగుతుందని అందరూ అంటున్నారు. చుట్టుపక్కల వారు ఒక్కొక్కరు ఐదారు ప్యాకెట్లు కొన్నారు. ఉప్పు ధర రూ.200, రూ.300 పెరిగితే కష్టం కదా. పొద్దున్నే బ్యాంక్‌కు వెళ్లి తెచ్చుకున్న చిల్లర డబ్బులతో 10 ప్యాకెట్ల ఉప్పు కొన్నా. వ్యాపారులు కూడా ముందుగా ఉప్పు లేదని ఎక్కువ ధరకు విక్రయించారు.
ప్రకటనలు

అమెరికన్లూ …వట్టి వెధవాయిలేనోయ్…


demo

మెజారిటీ ని గౌరవించాలి…
వైఎస్.రజశేఖర్ రెడ్డి…అయినా..చంద్రబాబయినా..జగన్ అయినా..
ఎవరికి ప్రజలు పట్టం కడితే…
వాళ్ళని మనం స్వాగతించాలి
ప్రాజా తీర్పు వెనుక….ఎంతో..ఆలోచన ఉంటుంది..
అమెరికా లాంటి దేశాల్లో మరీనూ..
మన తోటి వారి తీర్పును మనం హేళన చేస్తే..??
అవతలి వాళ్ళూ మన పట్ల అలానే స్పందిస్తారు!!
ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకోండి…
ప్రజల తీర్పుని అవహేళన చేయకండీ…

డబ్బే నాకు ముఖ్యం…సిగ్గూ,లజ్జా !!


అయితే విచిత్రమేమిటంటే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినా పాత్రికేయులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నా డీఎఫ్‌వో రమణమూర్తి మాత్రం అసలేమీ జరగనట్లు, తనకేమీ తెలియనట్లు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గతంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో ఆయన ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం….

అవినీతి ‘కొండ’
రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఎఫ్‌వో
బడిదేవర కొండపై అనుకూలంగా నివేదికిచ్చేందుకు డిమాండ్‌
దాదాపు పది రోజులుగా సాగుతున్న బేరసారాలు
సహనం నశించి పట్టిచ్చిన ఎంఎస్‌ఎన్‌ గ్రానైట్స్‌ యజమాని
viz-top1a

ఏం జరిగింది: విజయవాడకు చెందిన సెంట్రల్‌ విజిలెన్స్‌ బృందం దాడులు చేసింది.
పట్టుబడిందెవరు: జిల్లా అటవీశాఖాధికారి రమణమూర్తి
ఏం దొరికింది : రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఎప్పుడు: గురువారం సాయంత్రం 6 గంటలకు
ఎక్కడ: విజయనగరం పట్టణంలోని ఎస్‌వీఎన్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని రమణమూర్తి ఇంట్లోనే
లంచం దేనికి: బడిదేవరకొండపై అనుకూల నివేదిక ఇవ్వడానికి ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ యజమాని పళనివేల్‌ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. తొలివిడతగా వెంటనే రూ.5 లక్షలు ఇచ్చి తీరాలన్నారు.

డిదేవరకొండ.. చాలా కాలంగా జిల్లావాసులందరి నోట్లోనూ నానుతున్న పేరు. ఇదే కొండపై గ్రానైట్‌ క్వారీకి అనుకూల నివేదిక ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా అటవీశాఖాధికారి రమణమూర్తి గురువారం సాయంత్రం విజయనగరం పట్టణంలోని ఎస్‌వీఎన్‌ నగర్‌లోని తన ఇంట్లో ఏసీబీకి దొరికిపోయారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్‌ విజిలెన్స్‌ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో దాడులు జరిగాయి. బాధితుడు పళనివేల్‌ రూ.5 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐలు వి.సతీష్‌కుమార్‌, వి.సుదర్శన్‌రావు, గఫూర్‌, ఎస్‌ఐ విష్ణు దాడుల్లో పాల్గొన్నారు. అయితే విచిత్రమేమిటంటే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినా పాత్రికేయులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నా డీఎఫ్‌వో రమణమూర్తి మాత్రం అసలేమీ జరగనట్లు, తనకేమీ తెలియనట్లు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గతంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో ఆయన ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం. అప్పట్లో ఆ కేసు కారణంగా రెండేళ్ల పాటు పదోన్నతి సైతం దక్కలేదని తెలుస్తుంది. తరువాత కేసు కొట్టించేసుకుని తిరిగి ఉద్యోగంలో చేరినట్లుగా ఆరోపణలున్నాయి.తాజాగా ఏసీబీ దాడులకు కారణాల్లోకి వెళితే పార్వతీపురం మండలం కె.ములగ పంచాయతీకి చెందిన బడిదేవరకొండ సమీపంలోనే 16.56 ఎకరాల భూమిలో గ్రానైట్‌ తవ్వుకునేందుకు చెన్నైకి చెందిన ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ సంస్థ గతంలోనే అనుమతులు తెచ్చుకుంది. అయితే సదరు భూములన్నీ రిజర్వ్‌ ఫారెస్ట్‌కి చెందినవంటూ డీఎఫ్‌వో రమణమూర్తి చాలాకాలంగా అక్కడ పనుల్ని జరగనివ్వడం లేదు. అదే విషయాన్ని ఆయన మీడియాకు సైతం చెబుతున్నారు. అయితే తమకు సకల అనుమతులూ ఉన్నాయని, అవి అటవీ భూములు కాదంటూ ఎంఎస్‌పీ సంస్థ యాజమాన్యం వాదిస్తుంది. అక్కడ కొండపైకి వెళ్లేందుకు రహదారి నిర్మాణాన్ని సైతం ప్రారంభించింది. అయితే అటవీశాఖ సిబ్బంది నిత్యం వెళ్లడం, అక్కడ పనుల్ని నిలిపేయడం జరుగుతుంది. కనీసం అవి అటవీ భూములేనని రాతపూర్వకంగా కావాలని కోరినా డీఎఫ్‌వోని కోరినా ఇవ్వకపోవడంతో ఏదొకటి తేల్చాలంటూ ఆయన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను కోరారు.

జడ్పీ సమావేశంలోనే ఆదేశం
బడిదేవరకొండపై ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలోనూ రగడ జరిగింది.సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సైతం భూములెవరివో నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. దీంతో పార్వతీపురం ఆర్డీవో గోవిందరావు, గనులశాఖ ఏడీ సాయిరామ్‌, డీఎఫ్‌వో రమణమూర్తి, జిల్లా సర్వే శాఖ ఏడీ గోపాలరావులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని రీసర్వే చేయమని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. అవి అటవీశాఖ భూములా లేక రెవెన్యూ భూములా అన్నది తేల్చి నివేదిక ఇవ్వమన్నారు. గత నెల 29వ తేదీన బడిదేవర కొండపైకి వెళ్లి సదరు బృందం సర్వే చేశారు. కలెక్టరుకు ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో డీఎఫ్‌వో రమణమూర్తి తనకు రూ.25 లక్షలు లంచం ఇస్తే అనుకూలంగా నివేదిక ఇస్తానని, లేదంటూ అవి రిజర్వ్‌ఫారెస్ట్‌ భూములేనంటూ రాసేస్తానంటూ ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ యజమాని పళనివేల్‌ని బెదిరించడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు.

పది రోజులుగా డిమాండ్‌
బాధితుడు పళనివేల్‌ చెబుతున్న ప్రకారం చాలారోజులగా అటవీశాఖ సిబ్బంది వెళ్లి పనులు నిలిపేయడమే కాకుండా డీఎఫ్‌వో రమణమూర్తిని కలవాలంటూ పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయన డీఎఫ్‌వో రమణమూర్తిని కలిస్తే రూ.25 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని, ఇప్పటికే క్వారీ కోసం దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టేశానని ప్రాధేయపడ్డారు. అయినా రమణమూర్తి బేరసారాలు సాగిస్తూనే ఉన్నారు. ఇంతలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలతో రీసర్వే సైతం జరిగింది. దాంతో మరోసారి నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే కచ్చితంగా డబ్బులివ్వాల్సిందేననడంతో పళనివేల్‌ ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. దీంతో రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకోగా గురువారం ఎట్టి పరిస్థితుల్లోను ముందుగా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులిస్తే వెంటనే కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు అవి రెవెన్యూ భూములేనని నివేదిక ఇచ్చేస్తానని చెప్పారు. దీంతో విజయవాడ నుంచి వచ్చిన సెంట్రల్‌ ఏసీబీ అధికారులతో తీసుకుని ఆయన రమణమూర్తి ఇంటికి వెళ్లారు. పళనివేల్‌ నుంచి డీఎఫ్‌వో రమణమూర్తి డబ్బులు తీసుకుంటుండగా బయట మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలోని రమణమూర్తికి సంబంధించిన రికార్డుల్ని సైతం సీజ్‌ చేశారు.

ఫిర్యాదు మేరకే వచ్చాం
ఎంఎస్‌పీ గ్రానైట్‌ యాజమాని పళనివేల్‌ని రూ.25 లక్షలు లంచం కోరారన్న ఫిర్యాదు మేరకే మేము దాడులకు వచ్చాం. రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా డీఎఫ్‌వో రమణమూర్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.

– రమాదేవి, డిఎస్పీ, సెంట్రల్‌ విజిలెన్స్‌

రూ.25 లక్షలు అడిగారు
డీఎఫ్‌వో రమణమూర్తి కావాలనే వేధిస్తున్నారు. అవి రెవెన్యూ భూములేనని తనకు తెలుసని కాకపోతే రూ.25 లక్షలు ఇవ్వకపోతే అటవీశాఖ భూములేనంటూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చేస్తానంటూ బెదిరించారు. అందుకే సహనం నశించి ఏసీబీని ఆశ్రయించాను.

– పళనివేల్‌, ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ యజమాని

భారతీయులూ…బుర్ర ఉపయోగించండి…


corruption

అవినీతి విశ్వరూపం చూపిస్తుంది..
ఉన్నోడి దగ్గర డబ్బు మూటలు పెరిగిపోయి…
బస్తాల్లో కుక్కి ఎక్కడ దాచాలో తెలీక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు…
పేదవాణ్ణి పీల్చి పిప్పి చేసి….వాణ్ణి మరింత పేదరికంలో తోసేసి….వాడి బ్రతుకు మరింత నరకం చేస్తున్నారు…
ధన దాహాంతో…దేశాన్ని సర్వ నాసనమ్ చేసి…బ్లాక్ మనీ పోగేసి…మనీ సర్క్యులేషన్ లో లేకుండా చేస్తున్నారు..
అవినీతిని…వాళ్ళ అవినీతి సొమ్ము గుట్టు విప్పండి….
అని…
ప్రతీ రోజు…చెవికోసిన మేకల్లా అరుస్తారే…
ఇప్పుడు ..ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే…
రెండు రోజులు ఇబ్బందులు భరించలేరా?
పికినిక్ లకు సరుకు ఎలా కొంటాం??కార్యాలు ఎలా చేస్తాం??
పుట్టిన రోజు పండక్కి సరుకులు కొందాం అంటే…ఐదు వందల నోట్లు చెల్లక ఇబ్బంది పడి పోతున్నారా??
మరి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది బాబూ…
చెత్తని ఊడ్చేప్పుడు కొంచెం దుమ్ము గాల్లోకి లేస్తుంది…తప్పదు..ఆ మాత్రం ఓపిక లెకపోతే…
అవినీతి గురించి రోజూ చర్చలు పెట్టి…నస పెట్టకండి…
నోరు మూసుకుని…అవినీతి పరుల విలాసాలు చూస్తూ కూర్చోండి..