శస్త్ర చికిత్స నొప్పి గానే ఉంటుంది…


black_money_2802560aApril 6, 2016..Return to frontpage

నేను మళ్ళీ బాదడం…సారీ…బ్లాగడం మొదలు పెట్ట గానే…మా శంకరం గాడు ఠపీ మని ప్రత్యక్షమయ్యాడు..
నెను విషయం చెప్తే దాన్ని  బ్లాగేవాడు ఒకప్పుడు…
వాడు చెప్పిన సారాంశం….రోజుకు పదహారు గంటల పని….ఆరువేల జీతం..నెలకి!!
ఎంత మంది శ్రమని దోచుకుని…బ్లాక్ మనీ గుట్టలు పోసుకుంటార్రా మీరు?
మీ మీద ఏమయినా చర్యలు తీసుకుంటే…దేశమంతా గగ్గోలు పెట్టేస్తుంది!!
అయిదు వందల కాయితం ఇచ్చి…యాబై రూపాయల పెట్రోల్ పోయమంటాడు ఒకడు..??
ఇంత కాలం పాటు పాత నోట్లు చెల్లుతాయ్..అన్నా కూడా…తీసుకోరేమి?
వ్యాపార లావా దేవీలన్నీ క్లియర్ గా ఐటీ కి చూపెడతారుగా..??
అది వ్యాపార రీత్యా మీ చేతిలోనికి వచ్చినపుడు…బ్లాక్ కాదుగా??
అంటే…మీరు చేస్తున్న వన్నీ తప్పుడు వ్యాపారాలేనన్న మాట…మీరు బ్లాక్ మనీ పోగేస్తున్నారన్న మాట!
ఈ పాత కాయితాలు తీస్కో మని భీష్మించుకుని కూర్చోవడం వల్లనె సమస్య…
మరింత ఉదృతమయ్యింది..(పెట్రోల్ బంకులూ…రైల్ వే స్టేషన్ల దగ్గరా)..
ఎన్ని సంవత్సరాలు ?అవినీతి పరుల దగ్గర గుట్టలు గా పడి ఉన్న వేల కోట్ల రూపాయల్ని తిడుతూ కూర్చున్నారే?మరిప్పుడు ఈ మూలుగులు దేనికో?
పాకిస్తాన్ మీద యుద్ధం చేయమన్నారు?తెగ ఎగిరారు?
అప్పుడు ఎలా తట్టుకో గలం అనుకున్నారు…జరిగే పరిణామాల్ని…?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెదడు కుళ్ళిన మీడియానే…మనకూ…ఉంది…
జనాల్లో ఆందోళన…గుబులు రేపి…ఇరవై నాలుగు గంటలూ…చానెళ్ళకు అతుక్కుపోయేట్టు చేసి…
వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం….
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం నింపాల్సిన మీడియా…
ఖాళీ ఏటీఎం లను చూపిస్తూ..పొడవాటి క్యూలను చూపిస్తూ…తానొక పనికి మాలిన మీడియా నని నిరూపించుకుంది…
ఒక చానెల్లో….సూటూ..బూటూ…వేస్కున్నాయన…
నల్ల డబ్బున్న వాళ్ళు వేరే మార్గాలు చూసుకుంటారంటాడు …అవేమిటో …ఒక్కటయినా చెప్పడు…
సామాన్యులే…ఇబ్బంది పడుతున్నారని హైలైట్ చేసి…ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న తాపత్రయం తప్ప…
అవినీతిని పెద్దాయన నిర్మూలించేయాలి…
మనం మాత్రం సమ్మగా మన పనులు పూర్తి చేసుకుని…
పనిక మాలిన టీవీ ప్రోగ్రాం లు పొద్దస్తమానం చూస్తూ కూర్చోవాలి…అవినీతినీ….నల్ల డబ్బునీ తిడుతూ…
సశేషం..

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s