అమెరికన్లూ …వట్టి వెధవాయిలేనోయ్…


demo

మెజారిటీ ని గౌరవించాలి…
వైఎస్.రజశేఖర్ రెడ్డి…అయినా..చంద్రబాబయినా..జగన్ అయినా..
ఎవరికి ప్రజలు పట్టం కడితే…
వాళ్ళని మనం స్వాగతించాలి
ప్రాజా తీర్పు వెనుక….ఎంతో..ఆలోచన ఉంటుంది..
అమెరికా లాంటి దేశాల్లో మరీనూ..
మన తోటి వారి తీర్పును మనం హేళన చేస్తే..??
అవతలి వాళ్ళూ మన పట్ల అలానే స్పందిస్తారు!!
ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకోండి…
ప్రజల తీర్పుని అవహేళన చేయకండీ…

ప్రకటనలు

6 Comments

 1. అవహేళనకూ‌ అసహనానికీ గురి అవుతున్నది అక్కడి ప్రజలతీర్పు కాదు. ప్రజలు ఎక్కువ మంది ఫలాని వారికి ఓటు వేసినా ఆవలి వ్యక్తిని విజేతను చేసినట్టి, విజ్ఞత లోపించిన ఎన్నికల విధానాన్ని జనం నిరసిస్తున్నారని అనుకుంటున్నాను. ఇదే రకం‌ తింగర నిర్ణయం లోగడ గోర్ విషయంలో కూడా జరిగింది. లోపాన్ని గుర్తించమనీ సరిచేయమనీ‌ బాధితప్రజానీకం నిరసన వ్యక్తం చేయటంలో పొరపాటు ఉందని మనం‌ భావించ నక్కరలేదు. మా పద్ధతి మాది అన్నంత మాత్రాన తప్పు ఒప్పుగా మారదు. పొరపాటు విధానాలకు ఫలితం అనుభవించక తప్పదు. అక్కడైనా ఇక్కడైనా సరే. మరెక్కడైనా సరే. అది మాత్రం‌ ముమ్మాటికీ సత్యం.

  • శ్యామల రావు గారు,
   ఆవిడకి ఎక్కువ ఓట్లు వచ్చిన వాస్తవమే కానీ ఎప్పటినించో వస్తున్న విధానం ఈ రోజు మార్చమనడం లో అర్ధం లేదు. కొన్ని రాష్ట్రాలలో పార్టీలు తారుమారు అవటం , ఓట్ల లోచాలా తేడా ఉండటం జరిగింది

   • చంద్రిక గారూ, నేను ఇప్పటి ఎన్నికలే కాక అంతకు ముందొకసారి జరిగిన ఎన్నికలలో కూడా ఇలాంటి పరిస్థితిని ప్రస్తావించాను. ఎప్పటినుండో వస్తున్న విధానం ఐనా అందులో దోషాలుంటే సవరించుకొనటం సబబైన పనే కదా. పురాణ మిత్యేవ ససాధు సర్వం. ఐనా అది ఆదేశం వారికి సమ్మతం కాని సందర్భాల్లో నిరసనగళాలు మిన్నుముట్టుతాయి. అవి సర్వవ్యాప్తం ఐనప్పుడు చర్చించికొని తగు మార్పులు చేసుకొనటం అన్నది ఎలాగో లేదా ఆరునూరైనా మారకుండా ఉండటం ఏలాగో అన్నది ఆదేశవాసులే నిర్ణయించుకుంటారు. కాని ప్రపంచంలో ఇతర ప్రాంతాలవారు తమతమ పరిశీలనలను అమోదయోగ్యం ఐన విధానంలో వెలిబుచ్చటంలో ఇబ్బంది ఉండకూడదు కదా.

 2. ,@విజ్ఞత లోపించిన ఎన్నికల విధానాన్ని జనం నిరసిస్తున్నారని అనుకుంటున్నాను. ….

  ఏమిటీ..ఇంత లోప భూయిష్టమయిన అమెరికా ప్రజాస్వామయమా??మా క్లాస్లో ఇరవై మందిమి ఉన్నాం….పన్నేండు మంది ఓటేసిన తిరుమలరావు మా క్లాస్ లీడర్ గా ప్రకటించారు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s