డాక్టర్లూ యాపారస్తులే…2..


డాక్టర్లు చేస్తున్న సర్వీస్ అంతా…డబ్బు చేసుకోవడంలోనే ఉంటుంది..
ముందుగా డాక్టరు గారు చాలా మంచి వారు అన్న ముద్ర పడి… తే. చాలు..
జనాలు తండొప తండాలుగా వచ్చి పడతారు..
ఇక కాష్ చేసుకోవడం మొదలవుతుంది…చిన్న ఉదాహరణ…

నెలసరి వచ్చినపుడు మూ నాలుగు రోజులూ…కడుపు నొప్పి పెడుతుందంటూ వచ్చింది ఒకమ్మాయ్..పెద్ద వాళ్ళతో…
సర్వ సాధారణంగా ఈ కంప్లెయింట్ ఉండేదే..
ఎనిమిది వందల రూపాయల మందులు వ్రాసి ఇచ్చాడు ఆ గైనకాలజిస్ట్..
ఓ వంద రూపాయలు మాత్రం..ఆ జబ్బుకు సంబందించిన మందులు…మిగతా అంతా…విటమిన్లూ…ఆకలి సిరప్ లే..
డాక్టర్లు రాత్రీ,పగలూ ఆసుపత్రి లో పడి చస్తూంది …ప్రజల్ని ఉద్దరించేయడానికి కాదు..
జోబు నిండా డబ్బు పట్టుకు పోడానికే…
కోటీ…రెండు కోట్ల రూపాయలతో…స్పెషలిస్ట్ సీటు కొనుక్కుని..ప్రజా సేవ చేస్తాడా?ఎవడయినా??

ఎథిక్స్ డాక్టర్లకేనా?మిగతా వృత్తుల వారికి అక్కరలేదంటారా? అన్నారొకరు…
మమ్మల్ని కించపరుస్తున్నారు..అవమానిస్తున్నారంటూ అరచి గీ పెడుతున్నది డాక్టర్లే…
అందువల్లనే వాళ్ళది ఎథిక్స్ పాటించక తప్పని పరిస్థితి అంటూ…చెప్పుకొచ్చారు ఆయన…
మనకున్న సూపర్ ..కార్పరెట్ హాస్పటళ్ళు కేవలం ఓ పది శాతం మాత్రమే….
మిగతా తొంభయ్ శాతం హాస్పటల్లు….ఇరవై బెడ్ల లోపూ ఆపైనా ఉండి…ఒకరో..ఇద్దరో డాక్టర్ల చేతిలో సొంతమై ఉంటాయ్…
మొత్తం….వైద్యుల పై నీచ మైన అభిప్రాయం ఏర్పడ్డానికి…ఈ ఆసుపత్రులే కారణం…
ఊరికి ఇరవై..ముప్పై నుండి..పెద్ద ఊళ్లల్లో అయితే వంద వరకూ ఈ ఒక్క డాక్టరు గారు మాత్రమె నడిపే ఆసుపత్రులుంటాయ్…

ఇక్కడ అంతా వైద్యమే…అనుకుంటున్నారా?కాదు అంతా వ్యాపారమే…
మెడికల్ షాపు…లాబ్…డాక్టరు గారి ఆద్వర్యం లో నడుస్తూ ఉంటాయ్..
ఒక స్కాన్ కూడా ఉంటుంది…
సత్యమేవ జయతే లాంటి…కార్యక్రమాలు..పెద్ద పెద్ద స్పెషలిస్ట్ లను టార్గెట్ చేస్తూ ఉంటాయ్…
సరయిన అవగహన లేని అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు…ప్రెజెంట్ చేసే కార్యక్రమంలో…బుర్ర ఉన్న వాడు ఎవడూ…అవి తప్పులని ఒప్పడు..
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ లో పెద్ద అవకతవకలు జరిగాయని ప్రెజెంట్ చేసిన ఆ కార్యక్రమం….అమీర్ ఖాన్ అవగాహనా లేమికి అద్దం పడుతుంది…
ఎప్పుడు డోనార్ దొరికితే అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషను చెసి కిడ్నీ అమరుస్తామని..మీరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారనీ…ఏ ఆక్సిడెంట్ లోనో చనిపొయిన వ్యక్తి కిడ్నీని…వారి కుటుంబ సభ్యులు, దానమివ్వడానికి ముందుకు వస్తే…నిమషాల్లో మీకు ఆపరేషనుకు ఏర్పాట్లు చేయబడ తాయని కూడా రోగి బందువులకు చెప్పబడింది..ఆ విధంగానే కిడ్నీని…పాన్క్రియాస్ ని కూడా…ట్రాన్స్ ప్లాంట్ చేసారు…ఎందుకంటే…అప్పటికే పాంక్రియాస్ చెడిన ఆపేషంట్…షుగరు పేషంటుగా తయారయ్యింది…షుగరు పేషంటుకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయడం వల్ల …ఆ కిడ్నీ మళ్ళీ డయాబిటిస్ వల్ల పాడై పోవడం ఖాయం …కాబట్టి…పాన్క్రియాస్ ని కూడా…ట్రాన్స్ ప్లాంట్ చేసారు…అయితే…వివిధ రకాలయిన ఆపరేషను అనంతర సమస్యలు తలెత్తి ( సదరు రోగి డిక్ తో..Disseminated intravascular coagulation (DIC)) … మరణించడం తొ…మొత్తం జరిగిన దాన్ని…ఓ పెద్ద తప్పుగా చిత్రీకరించాడు… ఈ మూర్ఖుడు…
LAW లా ..కానీ…మెడికల్ సబ్జెక్ట్ కానీయండి…చాలా కాంప్లికేటేడ్ సబ్జెక్ట్ లు..దాన్ని బయటి వాళ్ళు అర్ధం చేసుకుని…విశ్లేషించడం…అనేది అంత సులభం కాదు….
వైద్యంలొని వ్యాపార పరమయిన తప్పుల్ని గుర్తించ వచ్చు కానీ…సబ్జెక్ట్ పరమయిన తప్పుల్ని అంత తేలికగా అంచనా వేసేయలేయము..అమీర్ ఖాన్లా…

దాంతొ….డాక్టర్ల వరకూ ఆ కార్యక్రమం ఎంత తప్పో…ఒక వైద్యుణ్ణి…ఎంత గా హింస పెట్టారో…అర్ధం అయింది…
అయితే…ఈ సొంత ఆసుపత్రుల డాక్టర్ల ధన దాహం…ఇప్పుడు జనానికి శాపమయి కుర్చుంది…
లాబ్ లో పరీక్షలు.. క్వాలిటీ తక్కువ రేటేక్కువ ఉన్న మందులు… జేబు నిండా డబ్బులు….మిమ్మల్ని ఉద్దరిస్తున్నాం అన్నట్టు బిల్డప్పులు..

మానవుడే మహానీయుడు…ఆసుపత్రే….కామధేనువు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s