ఓ పసిమొగ్గ రాలిపోయింది…


విశాఖపట్నం, సెప్టెంబర్‌ 25 : వర్షం పడుతున్నప్పుడు చిన్నకాలువ దాటబోతూ అందులో పడి కొట్టుకుపోయింది ఓ చిన్నారి. కారు నుంచి దిగి రెండు అడుగులు వేయగానే..కాలువలో పడిపోయిన మనుమరాలిని చూసి ఆ తాత అచేతనంగా మారిపోయాడు. విశాఖపట్నం వీఎస్‌ కృష్ణా కళాశాల రోడ్డులో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రమణమూర్తి ఆర్‌ అండ్‌ బిలో సూపరింటెండెంట్‌గా చేసి పదవీ విరమణ చేసి, సీతమ్మధారలో స్థిరపడ్డారు. కుమారుడు శ్రీనివాస్‌, కోడలు రాధిక ఉద్యోగ రీత్యా బెంగళూరులో వుంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్బాయిలు తల్లిదండ్రుల వద్ద బెంగళూరులో వుంటుండగా, ఐదేళ్ల వయస్సున్న అమ్మాయి అదితి ఇక్కడ తాతయ్య రమణమూర్తి దగ్గరే పెరుగుతోంది. ఆ పాప టింపనీ స్కూల్‌లో ఫస్ట్‌ స్టాండర్ట్‌ చదువుతోంది. సాయంత్రం వేళ రోజూ కృష్ణా కళాశాల రోడ్డులో స్టేట్‌ బ్యాంక్‌ ఎదురుగా వున్న ఐఓఎస్‌ ట్యూషన్‌ సెంటర్‌కు వెళుతుంది. తాత రమణమూర్తే తన కారులో దిగబెడుతుంటూరు.

గురువారం సాయంత్రం ఇంటి నుంచి ట్యూషన్‌కి బయలుదేరేసరికి చిన్నగా వర్షం మొదలైంది. కొద్దిసేపటిలోనే పెద్దదిగా మారింది. ఐదు నిమిషాల్లో ట్యూషన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. రోడ్డు పక్కనే ట్యూషన్‌ సెంటర్‌ వుంది. వర్షంలో తడవకుండా ఆ రోడ్డు పక్కనే రమణమూర్తి కారు ఆపారు. అదితి కారు దిగి రెండు అడుగులు వేసి ట్యూషన్‌ సెంటర్‌ మెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. రోడ్డుకు ట్యూషన్‌సెంటర్‌కు మధ్య చిన్న కాలువ వుంది. వర్షం పడుతుండడంతో అందులో నీరు వేగంగా ప్రవహిస్తోంది. అదితి కాలు పట్టు తప్పి కాలువలో పడిపోయింది. నీటితో పాటు కొట్టుకుపోయింది. కళ్ల ముందే మనుమరాలు కొట్టుకుపోవడంతో రమణమూర్తి అచేతనులయ్యారు. ఇదంతా చూస్తున్న అక్కడివారు వెంటనే అప్రమత్తమై పాపను పట్టుకునే ప్రయత్నం చేశారు.

కానీ అక్కడ అన్నీ షాపులే కావడంతో కాలువ మొత్తం కాంక్రీట్‌తో కప్పబడి వుంది. కొద్దిదూరం ముందుకు వెళ్లి అక్కడ వెదికారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ చిన్నకాలువ 20 మీటర్ల దూరం వెళ్లగానే పెద్దగెడ్డలో కలుస్తుంది. దాంతో జీవీఎంసీ సిబ్బంది గజ ఈతగాళ్లను తీసుకొచ్చి వెదికించింది. అయినా ఫలితం కనిపించలేదు. కాలువలో కొట్టుకుపోయిన పాప గెడ్డ ద్వారా బీచ్‌కు చేరుతుందని అంతా అక్కడికి వెళ్లి వెదకడం ప్రారంభించారు. రాత్రి తొమ్మిది గంటల వరకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. తాత రమణమూర్తి మనుమరాలినే తలుచుకుంటూ బీచ్‌లో పిచ్చిచూపులు చూస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనుమరాలు ఇలా అయిపోతుందని కలలో కూడా ఊహించలేదని ఆయన గుండెలవిసేలా రోదిస్తున్నారు. తిరిగి శుక్రవారం కూడా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.( andhra jyothi daily news paper.26/09/2015)

ఈ రోజు వార్త…

విశాఖపట్నం : రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో గల్లంతైన చిన్నారి అదితి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆర్మీ, నేవీ సిబ్బందితో పాటు స్థానికులు, పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అదితి జాడ తెలియలేదు. చిన్నారి అదృ శ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్‌తో పాటు సంఘటన సమయంలో వెంట ఉన్న చిన్నారులను పోలీసులు ప్రశ్నిస్తు న్నారు. అదితి డ్రెయినేజిలో పడిపోవడం వాస్తవమని కారు డ్రైవర్‌ గురునాథరావు చెబుతున్నారు.

డియర్ బ్లాగర్స్..
ఈ  చిన్నారి పాప, ట్యూషన్ కోసం కారు నుండి దిగి నడూస్తూ…ప్రమాద వశాత్తూ డ్రెయినేజీ లో పడిపోయింది ..
ఇప్పటికీ  ఏ మాత్రం అచూకీ లభించడం లేదు…
దయ చేసి పెద్దగా వర్షాలు పడుతున్నపుడు…మాంచి ఎండలతో భీతిల్లే సమయం లో నూ పిల్లల్ని బయటకు పంపకండి…చదువు…సంధ్యలు ముఖ్యమే…అంత కంటే…ఆరోగ్యం, ప్రాణం ముఖ్యం కదా?
ఒక పూట పిల్లలు స్కూల్ కానీ ట్యూషన్ కానీ మిస్ అయితే….తెగ తిడతాం…
నేనూ అలాఅంటి వాణ్ణే…కానీ…
ఈ పాప ఆ వర్షం లో ట్యూషన్ కు వెళుతూ …డ్రెయినేజీ లో పడి కొట్టుకు పోవడం…. నా మనసుని తీవ్రంగా కలచి వేసింది…
వర్షం కురిసే సాయంత్రాలు …కాగితపు పడవలు చేసి వర్షపు నీళ్ళ లో వదిలి…కేరింతలు కొట్టే వాళ్ళం ఒకప్పుడు…

వీలయినంత వరకూ బాల్యాన్ని,ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేట్టు చేయండి…

వారి కుటుంబ సభ్యులకు బ్లాగ్ లోకం తరఫున ప్రగాడ సానుభూతి ని తెలియచేసుకుంటున్నాను…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s