ఎర్రగడ్డ కు పంపండి కాంగ్రెస్ నాయకుల్ని…


విభజన హామీలపై కేంద్రం ఆమోదం తీసుకోండి

సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేసిన రఘువీరా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తున్నామని ఢిల్లీ నేతలతో ప్రకటన చేయించాకే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి తిరిగి రావాలనీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటిపైనా కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవాలని, ఈ విషయంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని, అందుకే కోటి సంతకాల సేకరణ చేపట్టామని చెప్పారు. విభజన చట్టం హామీల అమలు, పోలవరం సాధన కోసం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లాలోని అనకాపల్లి, చింతపల్లి ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించారు. తొలుత అనకాపల్లి నెహ్రూచౌక్‌లో పలువురి నుంచి సంతకాలు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలంతా నినాదాలు చేస్తూ.. రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలోనూ, తర్వాత తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో విలేకరులతోను రఘువీరా మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ముందుకు సాగాలనీ, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 23న పార్లమెంట్‌ ఉభయ సభల కాంగ్రెస్‌ ముఖ్యులతో కలిసి ప్రధాని మోదీకి వాటిని అందించి, ఒత్తిడి తెస్తామన్నారు.

అదీ సంగతండీ….

పిచ్చెక్కినట్టు,రాహూల్ ని ప్రధాని చేసేయాలన్న తాపత్రయం తొ…బీజేపీని బ్రతిమాలి…
ఆఖరు నిమిషంలో బెదిరించి….విభజన బిల్లుని పెట్టించి….
రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పనికిమాలిన బ** లు…
ఇప్పుడు బాబు…విభజన బిల్లులోని అంశాలన్నీ కేంద్రం తొ ఒప్పించాలట…
బాబు ఒప్పించి అమలు చేయిస్తాడనే…ఈ వెధవాయిలు విభజన బిల్లు తెచ్చారా?
మీరు డాష్ అయితే…మీ పార్టీ వాళ్ల తోనే డెల్లీ లో పట్టు పట్టించండి…
బిల్లు పెట్టాం….కొత్త రాష్ట్రానికి హామీలున్నాయ్…నెరవేర్ఛాల్సిన భాద్యత మా కాంగ్రెస్ దే అని?
మీరు చండాలం చేసి,ఇప్పుడు బాబు అవన్నీ సాధించాలంటారేమిటీ?
జనం కొట్టిన దెబ్బకు…కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారొ కూడా…వాళ్లకు అర్ధం అవుతున్నట్టు లేదు!!
పొండి…పోయి బీజేపీ నో మరొక పార్టీ నో వెతుక్కోండి…జాయినవ్వండి!!
మీ కాంగ్రెస్ నాయకుల ప్రకతనలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు!!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s