ఎవడికి ఉపయోగం మీ విశ్వసనీయత?


చంద్రబాబు కు విశ్వసతనీయత లేదు,మాకే ఉందంటావ్??
ఎమయ్యా మేం అడిగేవి మీకు వినబడవ్ గానీ…విశ్వసతనీయత అంటే…
మీ తండ్రి గారిలా…మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలూ..మంత్రులూ..ఎన్ని కుంభకోణాలు చేసినా.. ఏ వెధవ పనులు చేసినా…వెనకేసుకు రావడమేనా?
వాళ్ళు నానా  గడ్డీ కరిచినా, వాళ్ళను రక్షిస్తారు?అదే నా విశ్వసతనీయత?అది బాబు గారికి చేత కాదంటావ్?
ఓ మీడియా పెట్టి…చెత్తను జనం మీదకు వదులుతూ…
ఎల్లో మీడియా అంటూ మరొకళ్ళను వెక్కిరించే అర్హత మీకుందా?
వాళ్ళ మీడియా భజనే చేస్తుంది…మరి మీ మీడియా కూడా అదే చేస్తుందిగా?
ఏమిటి నీ గొప్పతనం?పైగా మీరు చేసిన ప్రపంచ ప్రఖ్యాత మైన అవినీతిని…సమర్ధించుకుంటూ…
పుంఖాను పుంఖానులుగా వ్యాసాలు వ్రాయిస్తూ…
తమరిని స్వాతి ముత్యం లా భ్రమింపచేయడానికి విశ్వ ప్రయత్నం చెస్తుంది మీ మీడియా
…తమరు అత్యంత అవినీతి మయమయిన వ్యక్తి అని మీకూ…మీ మీడియాకు…తమ తల్లి గారికీ….తమను సమర్ధించే…ప్రతీ చోటా మోటా నాయకులకీ తెలుసు…
మరి మీడియా ద్వారా.. టీవీ ద్వారా మీ బృందం మొత్తం, నిజాల్ని వక్రీకరిస్తున్నందుకు.. జనాన్ని వెర్రి దద్దమ్మల్ని చేస్తున్నందుకు మీరే మాత్రమయినా సిగ్గు పడుతున్నారా?లేదే??
ఈ రాష్ట్రం … మీ తండ్రీ కొడుకుల్ని …వల్ల సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్న విషయం మీకు అసలు అర్ధమయిందా?అర్ధమయ్యే ఉంటుంది లెండి…
హైద్రాబాదు నుండి డెల్లీ వెళ్ళకుండా బెంగుళూరు ద్వారా ఢెల్లీ వెళ్ళి పనులు చక్క పెట్టుకునే పరిస్థితి వచ్చి నప్పుడే…
మీరు ఎలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల ఇలాంటి దొంగ ప్రయాణాలు చేయాల్సి వచ్చిందో…అని ఆలోచించే ఉంటారు??
జైలన్న కి బెయిల్ రావాలీ అని చచ్చు వార్తలూ…పిల్లలు చిచ్చు పోయడం లేదు…జైలన్న కు బెయిల్ రాక..అంటూ వ్రాసినట్టు?మరిఅవన్నీ మీ పేపర్ లో వ్రాయరేం?
అన్ని కోర్టుల గుమ్మమెక్కావే?
బెయిలో ..బెయిలో..అని?
మీ మీడియా చెపుతున్నట్టు అవన్నీ తప్పుడు కేసులైతే…జడ్జీలందరూ …గుడ్డి వాళ్ళంటావా?
తప్పుడు కేసుల్లో,అరెస్ట్ అయిన వ్యక్తిని..నిర్బంధం లొ ఉంచే తప్పుడు వ్యవస్థ ప్రస్తుతానికైతే… మాత్రం,మన న్యాయ వ్యవస్థ లో లేదు!!
బహుశ తమ తండ్రి గారి కబంద హస్తాలకు అది అంది ఉండదు!!తన పరిధిలో ఉంటే దాన్ని కూడా బ్రష్టు పట్టించే వాడే…ఆ మహనుభావుడు…
స్వయంగా ఆ భగవంతుడే కలుగు చేసుకుని…కలి యుగంలొ కూడా లోక కళ్యాణానికై ,మళ్లీ మీ తండ్రిగారి పుణ్యమా అని..భూమ్మీదకు …ఎండా ,వానా అని లెక్క చేయక రావాల్సి వచ్చింది..
అయ్యా…
ఈ రాష్ట్రం లో మీ కుటుంబం ఎక్కడ అధికారం లొకి వస్తూందో…అని కాస్త ఇంగిత  జ్ఞానం..ఉన్న ప్రతీ ఒక్కళ్ళూ…
ఈ రాష్ట్రం లో…నిద్ర లేని రాత్రుళ్ళు గడుపుతున్నారు!!తెలుసా?
అయ్యా…జగనూ…ఇంకా ఏం నాశనం చేయడానికి మిగ్ల్చారు…మీ తల్లీ కొడుకులు??

మీ మాఫియా విశ్వసనీయత ఈ రాష్ట్ర ప్రజలకు అక్కర్లెదు!!మీ ముఠా ని రక్షించుకోడానికి దాన్ని ఉపయోగించికోండీ!!!మీరు చేసేదీ అదే అనుకోండి!!!

4 Comments

 1. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మన మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
  ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత మనం మళ్ళీ అదే పరిస్థితికొచ్చాము.
  ఆనాడు మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి లాంటి వ్యక్తి కూర్చున్న కుర్చీలో ఈరోజు మొదటిసారి ఎవరిని కూర్చోపెట్టాలో ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి.

  • బొంగరి గారు…ఆలోచన చేస్తున్నారు జనం…కాకపోతే నాకు ఫించను ఇచ్చాడు,నెలకు ఐదొందలు ఫించను ఇచ్చాడు..ఆరోగ్య శ్రీ కార్డ్ ఇచ్చాడు…పధకాలు చేశాడు…వోటేసేద్దామ్….వాడు ఎంత దేశాన్ని దోచుకున్నా….నాకు నష్టం ఏమిటీ…నాకు చేశాడుగా..ఇదీ మన దేశ భక్తులైన ప్రజల ఆలోచన!!
   అవినీతి పన్ను వేయాలండీ …వీళ్ల పై…లక్ష కోట్లు తిన్నాడు…మీ వాటా గా పదివేలు కట్టండీ అని ప్రతీ ఇంటికీ నోటీస్ పంపితే…అఫ్ఫుడు…మన జనాలు…మేం ఎందుకు కడతాం…వాడు తింటే…అని రోడ్ల మీదకి వస్తారు…అంత వరకూ…ఎవడు తినలేదూ…అని ప్రసంగాలిస్తారు!!!బేవార్సు గాళ్ళని సమర్ధిస్తారు…

 2. వీళ్ళ విశ్వసనీయత తగలెయ్య!దొంగ నోట్లు పంచి వోటర్లనే మోసం చేస్తున్నారు.కల్తీ కల్లు పంచి ఇది తాగి మాకు వోటేసాక మీరు చచ్చినా మాకేం ఫర్వాలేదంటున్నారు, అయినా జనాలకి తెలియడం లేదు.మరీ కిం.ప.దొ.న విషయమేమిటంటే – ఒక చోట రెండు వోట్లకి చెరి 400/- చొప్పున బేరం కుదుర్చుకుని 1000/- ఇచ్చి 200/- చిల్లర తీసుకు పోయార్ట!ఆ పెద్ద నోటు దొంగ నోటు|:-P)

  • ఆంధ్ర ప్రజానీకం ఎంత విశాల హృదయులు అంటే…జగన్ ఎంత తిన్నా మాకూ.. కొంత ఇచ్చడుగా అని సంతోషపడిపోతున్నారు…వీళ్ళు గెలుస్తారేమో? అని( కొన్ని వర్గాల ) ప్రజలు వణికిపోయిన సందర్బం మాత్రం ఇదే మొదటి సారి చూడ్డం…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s