పిచ్చి కుక్కల్లా తయారైన ఆంధ్రా టీవీ మీడియా!


  మీడియా…మనం ఎవరిని హైలైట్ చేస్తున్నాం?ఎవరిని వీరులుగా చూపిస్తున్నాం?ప్రజల్లోకి ఇవి ఎలాంటి సందేశాన్ని తీసుకు వెళ్తాయి?ఈ ఆలోచనలు ఏమీ ఈ రోజు ఈ టీవీల వాళ్ళకు స్పురిస్తున్నట్టు లేదు!వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందనీ,అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించారనీ ,ఆ పార్టీ మద్దతు దారులతో సహా,అందరికీ తెలుసు!అలాంటి వ్యక్తులు బెయిలు పై జైలు నుంచి ,అదీ షరతులతో కూడిన బెయిలు పై వస్తుంటే ,మన మీడియా వాళ్ళను భగత్ సింగ్ లెవెల్లో ప్రచారమ్ కల్పించి..జైలు ముందు కెమెరాలు పెట్టుకు కూర్చున్నారంటే…వీళ్ళ గురించి ఏమనుకోవాలి?

ప్రజలు కూడా ఇక నోర్మూసుకు కూర్చుంటే మంచిది…బీద అరుపులు అరుస్తూ,తాము దరిద్రం అనుభవిస్తున్నామనీ,ప్రభుత్వాలు తమకు సహాయం చేయడాం లేదనీ అడిగే హక్కు వీళ్ళకు లేదు…ప్రభుత్వాల పెరుతో అధికారం లో కూర్చుని ప్రజా ధనాన్ని లూటీ చేసే బందిపోట్లకు,గజ దొంగలకు జై కొడుతూ,వాళ్ళను నెత్తిన పెట్టుకుని,ఊరేగించుకుంటూ హారతులిస్తుంటె,వీళ్ళ దరిద్రం ఎప్పుడు తీరుతుంది?అవినీతి పరోక్షపు పన్ను అన్న విషయం మనకు తెలియదా?

రేపు మర్డర్లు,మాన భంగాలు చేసిన వాళ్లను ఈ దేశంలో ఘనంగా ఊరేగించినా మనం ఆశ్చర్య పొనక్కరలేదు…చదువుకున్న వాళ్ళు కూడా ఇంగితం మర్చిపోయి,అవినీతి పరులను వెనకేసుకు వస్తున్న ఈ తరుణంలో…అవునూ…అవినీతి పరులని, గత ప్రభుత్వాన్ని ఎలక్షన్లలొ గద్దె దింపి..మరింత అవినీతి పరులకు అవకాశమివ్వడానికేనా ఎలక్షన్లు ఈ దేశంలో?

సమయం లేక ఈ రోజు జరిగిన చర్చలు మరి కొన్ని  వివరించలేకున్నాను…ఒక్కటి మాత్రం నిజం…ఇలాంటి దారుణాలను,గమనిస్తున్న వాళ్ళు,అసహ్యించుకుంటున్న వాళ్ళు మన సమాజం లో ఉన్నారు…అదే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని నమ్ముదాం!

ప్రకటనలు

6 Comments

 1. ఇది పెద్ద చర్చనీయాంశమండి. మీడియా ఒక్కదాన్నే నిందించలేము. ప్రజల పల్స్ ను బట్టి మీడియా స్పందిస్తుంటుంది. అతనికి జేజేలు పలుకుతున్న జనంకూడా భారీగానే ఉండటంతో మీడియాలోని ప్రతిఒక్కరూ ఆ దృశ్యాలను చూపించక తప్పటంలేదు. విచిత్రమేమిటంటే, అతనిని సమర్ధిస్తున్నవారిలో విద్యావంతులుకూడా ఉండటం.

 2. అయితే, సంతోషించవలసిన విషయమేమిటంతే, ఇదే విషయమై వరసగా ముగ్గురు బ్లాగర్లు(మీరు, ఫణిబాబుగారు, నాగరాజ్ గారు) తమ ఆవేదనను బ్లాగ్ రూపంలో వ్యక్తంచేయటం.

  మీలాంటివారయినా ఇలా గుర్తు చేయకపోతే సగటు మనుషులకు అసలు ఏది మంచి, ఏది చెడు అనే సందేహం వస్తుంది. మీకు అభినందనలు.

 3. చాలా బాగా వ్రాసారండి. జనాలు ఇంత వెర్రివాళ్ళేం! వాళ్ళకి తోడు ఈ మీడియా వాళ్ళు…మరీ ఇంత అవివేకమా! అసలు వీళ్ళకి సమాజం పట్ల ఏ మాత్రం అయినా బాధ్యత ఉందా!

  “ఒక్కటి మాత్రం నిజం…ఇలాంటి దారుణాలను గమనిస్తున్న వాళ్ళు,అసహ్యించుకుంటున్న వాళ్ళు మన సమాజం లో ఉన్నారు” ఉన్నాఆ శాతం తక్కువ కాబట్టి ప్రజాస్వామ్యం కాపాడబడుతుందంటూ మనం కలలు కంటూ కూర్చోవటమే చెయ్యకలిగింది!

 4. వేమన చెప్పిన ఆముదపు వృక్షాలు ఇవ్వే కావచ్చు….
  కానీ. ఈ క్రింది లింక్ చూడండి……

  http://manakakinadalo.blogspot.in/2013/09/allurisitaramaraju.html

  వీళ్ళు…వీళ్ళ కాలి ధూళి మన శిరస్సున ధరించాలి…..
  అంతే కానీ సభ్య సమాజం సిగ్గు పడేలా బొక్కేసిన వాళ్ళను కాదు నెత్తిన పెట్టుకుని ఊరేగించాల్సింది….
  అవును మనిషన్న వాడు సిగ్గు పడాల్సిన రోజిది…

  ఇటలీ మాఫియా ఈ దేశాన్ని పాలించడం అసలైన విషాదం…దౌర్బాగ్యం!!

 5. ప్రసాద్ గారు, టపా చాలా బాగా రాసారండి. ఎన్ని అనుకున్నా, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మెదళ్ళు పని చెయ్యడం మానేసాయేమో అని నాకు ఒక సందేహం. జాలి కూడా కలగటం లేదు. May be if he wins elections in future, then we cannot deny that is majority opinion in Andhra. Looking at his popularity, I have no doubts about his victory in elections. Well if that is what people wished, then they deserve an administrator like Jagan. Who is worried about future? if he throws few more goodies to people, that is it!! He can continue to win elections every term and continue his looting .

 6. అవునండీ..ఈ దేశ ప్రజలకు ఒక నమస్కారం…ప్రపంచం అంతా చూసి నవ్వుతుందన్న సిగ్గు కూడా లేకుండా ,వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన మనిషిని,అదీ, ఆస్తులు,ఆడంబరాలు కళ్ళెదురుగా కనబడుతున్నా,నెత్తికెక్కించుకుంటున్నారంటే..మనం ఏ యుగాల్లో ఉన్నామో కాస్తాంత ఇంగితం ఉన్నవాళ్ళు ఆలోచించుకోవాల్సిందే!సగటు భారతీయుడు మానసికంగా అవినీతి మనస్తత్త్వం ఉన్న వాడు కనకనె,వీళ్ళకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు..పోలీస్ స్టేషన్ కు వెళ్ళడమనేదే తలకొట్టేసేంత గా భాదపడే మనం ,ఆరోపణల్లో కూరుకుపోయి అనేక సార్లు బెయిల్ కూడా తిరస్కరింపబడ్ద వాళ్ళను నిస్సిగ్గుగా ఊరేగించుకుంటున్నాం..ఇలాంటి పోకడలు పోతున్న ఈ జాతిని చరిత్ర ఎన్నటికీ క్షమించదు కాక క్షమించదు…చేస్తున్న తప్పులన్నిటికీ ఈ వొటరు అనబడే సామాన్యుడు బలి కాక తప్పదు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s