టి ఇస్తాం, రిజైన్ చేసుకోవచ్చు!: సీమాంధ్రకు డిగ్గీ షాక్!!!కాంగ్రెస్ **నాకిపోద్ది,సీమాంధ్రులిచ్చే షాక్!!


తెలివి తక్కువ పనులు చేసి యూపీ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ మళ్ళీ తలెత్తు కోలేకపోయింది !
మళ్ళీ పార్టీని అక్కడ నిలబెట్టలేని   సంకట స్థితిలో పడిపోయింది..

అహంకారం వదలి ఆలోచించకపోతే కాంగ్రెస్ కు ఆంధ్రాలో సమాధి కట్టుకున్నట్టే,
షిండే వంటి వారు చేస్తున్న ప్రకటనల్లో,,నిర్లక్ష్యం ,అహంకార దోరణీ కనబడుతూనే ఉన్నది
సమస్యను అర్ధం చేసుకునే దోరణి కనబడటం లేదు వాళ్ళ ప్రకటనల్లో.
అందరి అవస రాలను గుర్తించి,అందుకు తగ్గ పరిష్కారం వైపు అలోచన చేయాల్సిన అవసరమ్ ఉంది తప్పా,
తమకు తోచినది చేసుకుపోతే,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ అసంతృప్తి కి గురవుతారు..

సమైక్య వాదుల మూర్ఖపు,పిచ్చి ఆలోచన్లు కూడా మన షిండేలానే ఉన్నాయ్…రాజీనామాలు,రాజీనామాలు…?కేసీఆర్ ను చూసి వీళ్ళకు ఈ పిచ్చి పట్టింది.రాజీనామాలు చెస్తే ఏమిటవుద్ది.కేంద్ర నిర్ణయాలు ఆగిపోతాయా?ఇదో వేలం వెర్రి డిమాండ్ తప్ప?రాజీనామాలు చేస్తే ఏం అధ్బుతాలు జరిగిపోతాయో?వివరిస్తే ఎమ్మెల్యేలూ.ఎంపీలూ అప్పుడు రాజీనామాలు సమర్పిస్తారేమో కానీ..అదో జపం లా ఎందుకు రాజీనామాలు చేయమంటున్నారొ సామాన్యులకయితే అర్ధం కావడంలేదు.కాబట్టి తమ మూర్ఖపు డిమాండ్ ఎంతవరకూ అవసరమో…సమైక్య వాదులు ఆలోచించాలి..అదే పనిగా రాజీనామాలు అడగడం కాకుండా..రాజీనామాల వల్ల ఉడ్యమానికి మైలేజీ ఏమయినా వస్తుందా?ఆలోచించి డిమాండ్ చేయండి.

టి ఇస్తాం, రిజైన్ చేసుకోవచ్చు!: సీమాంధ్రకు డిగ్గీ షాక్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని, రాజీనామాలపై ఒత్తిడి వస్తే చేసుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం సీమాంధ్ర నేతలతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురు సీమాంధ్ర నేతలు విభజన అంశంపై డిగ్గీని కలిశారు. విభజన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారు కోరారు. దానికి ఆయన వారితో కాస్త కటవుగానే మారినట్లుగా సమాచారం.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని, ఆంటోని కమిటీ నివేది వచ్చేదాకా నోట్ పైన ముందుకు వెళ్లవద్దని తాను హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు చెబుతానని, ఆ తర్వా వెనక్కి వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టారట. తెలంగాణ విషయంలో వేరే ఆలోచనకు ఆస్కారమే లేదని, విభజన అంశంపై మాట్లాడక పోవడమే మంచిదని చెప్పారట. హైదరాబాదు విషయంపై ఏమైనా ఉంటే చెప్పాలని సూచించారట.

తమపై రాజీనామాల ఒత్తిడి వస్తుందని వారు డిగ్గీ దృష్టికి తీసుకు వస్తే… రాజీనామాలు చేయాలనుకుంటే చేయవచ్చునని, తనతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని వారికి తేల్చి చెప్పారట. దాదాపు గంటకు పైగా సీమాంధ్ర నేతలు డిగ్గీతో భేటీ అయ్యారు. ఆయన ఏ సమయంలోను వారికి అనుకూలంగా మాట్లాడలేదట.

అహ్మద్ పటేల్ వ్యాఖ్యలపై కెవిపి వివరణ

కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను ఇటీవల కలిసినప్పుడు తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకున్నామన్నారని వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దానిపై కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు స్పందించారు. పటేల్‌తో జరిగిన భేటీకి తాను హాజరయ్యానని, తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకున్నట్లు అనలేదని, ఆయన ఉన్నత వ్యక్తిత్వం గల నాయకుడని, పార్టీకి, పార్టీ అధ్యక్షురాలికి విధేయుడని, పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయంపై కానీ, చర్యలపై కానీ ఆయన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని తెలిపా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s