పనికిమాలిన సీమాంధ్ర నాయకులు!!


తమ ప్రాంతం వారి పై ఆరోపణలు వెల్లువెత్తినపుడు, పలు  సందేహాలు తలెత్తినపుడూ..వాటిలోని నిజా నిజాలు వెలికి తీసి,ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది…ప్రజా జీవితం లో ఉన్న వారి కనీస భాద్యత అది..వ్యాపారాలు చేసుకుంటూ,తమ హోదాలు చూపించి, దర్జా వెళ్ళబెట్టే సీమాంధ్ర నాయకులకు,ప్రజా జీవితంలో ఉండే హక్కు ముమ్మాటికీ లేదు…

మీకు..అశోక్ బాబు చెప్పేది రుచించక పోవచ్చు…ఎందుకంటే ఇప్పటికే  సీమాధ్రుంలూ,వారి  రిప్రసెంటేషన్ పై  వ్యతిరేకను గూడు కట్టుకుని ఉన్నారు కాబట్టి..

ఓపెన్ హార్ట్ …చదవండి…

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ లో అశోక్‌బాబు

తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంత ఉద్యోగాలను ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు తీసుకెళ్లిపోతున్నారన్నది! రెండోది… అభివృద్ధి జరగలేదన్నది. దీనిపై నేనేమీ చెప్పక్కర్లేదు.

అంతా కళ్లముందే కనిపిస్తోంది. డీఆర్‌డీఏ నుంచి సమాచారం తెచ్చుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. అయితే ఉద్యోగాల విషయంలో… ఆ రోజుల్లో కొన్ని ఉల్లంఘనలు నిజమే… 610 జీవో ఉల్లంఘన జరగలేదని నేనట్లేదు. అదెందుకు జరిగిందంటే.. హైదరాబాద్‌కు రావాలనే ఉద్యోగుల తపనవల్ల. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో… 1975 నాటికి ఇంట్లో ఒకరికే ఉద్యోగం ఉండేది. ఎక్కడికి బదిలీ అయినా కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయేవారు. 1985 నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. 1995 నాటికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైనవారి సంఖ్య పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకేచోట ఉండాలనుకునేవారికి హైదరాబాద్ గమ్యంగా ఉండేది. ఎందుకంటే అలాంటివారికి ఇక్కడ అవకాశాలు అధికం. దీంతో ఉల్లంఘనలు జరిగాయి. భర్త అనంతపురంలోనో, మెదక్‌లోనోఉండి భార్య ఇక్కడ ఉంటే ట్రాన్స్‌ఫర్ మీద తెచ్చుకునేవాళ్లు.

ప్రభుత్వాలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకున్నాయి. అదే సమస్యగా మారింది. దీనికి సంబంధించి గిర్‌గ్లానీ రిపోర్టే తుది నివేదిక. ఆయన 58 వేల మందిని 610 జీవో ఉల్లంఘనగా చూపారు. జోన్-1లో 5 వేలమంది ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అంటే.. అందులో మిగతా ఐదు జోన్లవాళ్లు ఐదువేల మంది ఉన్నారన్నమాట. ఇలా మొత్తం 58 వేల మంది ఎక్కువగా ఉన్నారని తేల్చారు. దీన్ని ఇక్కడ వీళ్లు ఎలా చెబుతున్నారంటే.. ‘తెలంగాణ వాళ్ల 58 వేల ఉద్యోగాలనూ ఆంధ్రావాళ్లు తీసుకుపోయారు’ అని చెబుతున్నారు. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే.. “ఇది తప్పు.. ఇలా కాదు” అని ఇటువైపు నుంచి ఎవరూ చెప్పలేదు. ఉద్యోగులూ సీరియస్‌గా తీసుకోలేదు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టి 610 మీద ఉద్యమం చేసిన తర్వాత సీరియస్‌గా తీసుకుని 2008లో వారివారి జోన్‌లకు పంపారు.

ఇక్కడ మరుగున పడ్డ విషయం ఏంటంటే.. 5, 6 ఏరియా అంటే తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ 9 శాతం కంటే ఎక్కువలేరని చాలా స్పష్టంగా చెప్పా రు. ఈ 9 శాతంలో 5లో 6 వాళ్లు, 1, 2, 3 వాళ్లూ ఉన్నారు. కానీ ఇక్కడ పొలిటికల్‌గా చెప్పే వాదన ఏంటంటే.. 5లో ఉన్న 1, 2, 3 వాళ్లు పోవాలి! కానీ 5లో ఉన్న 6 వాళ్లు ఉండొచ్చు. అంటే తెలంగాణవాళ్లు తెలంగాణలో ఉండొచ్చు, ఆంధ్రావాళ్లు పోవాలి అన్నారు. రెండోది అభివృద్ధి.. ఇందులోనూ కొన్ని అబద్ధాలు చెప్పారు.. ‘మా నీళ్లు పోయాయి. మా బొగ్గు పోయింది..’ అని! ఇదంతా కన్విన్సింగ్.. అక్కడ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. నిజాలు చెప్పి కాదు. ఆ రోజు తెలంగాణ విషయంలో చెప్పిన అంకెలు, గణాంకాలు ఇప్పుడెక్కడా చెప్పట్లేదు.

ఆత్మగౌరవం, స్వీయపాలన అంటున్నారు. కానీ, ఆరోజు ఉద్యమాన్ని నిర్మించడానికి అది పనికొచ్చింది. మిగిలింది 14ఎఫ్. దీనిపై మేం సీఎంను స్పష్టంగా అడిగాం. ‘సార్ 14ఎఫ్ తీసేస్తే మాకన్నా తెలంగాణకే ఎక్కువ నష్టం అని చెప్పాం’. దీనికి ఆయన.. ‘మరి మీరెందుకు మాట్లాడుతున్నారు’ అని అడిగారు. వాళ్ల డిమాండ్స్ 14ఎఫ్, 610 జీవో ఉల్లంఘనలు.. ఈ రెండిటినీ సెటిల్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితి కొంత చక్కబడుతుందని సీఎం చెప్పారు. మేమూ కాదనలేకపోయాం. 14ఎఫ్ తీసేశారు. 610 ఉల్లంఘనలను చక్కబరిచారు. ఇక ఆర్థికాభివృద్ధి ఏంటనేది శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. ఉద్యమానికి పాయింట్ ఏం లేదు….

http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=52044&category=read_this_now

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s