మంచితనం ఒక గతం!!సీతమ్మ వాకిట్లో…చివరలో…ప్రకాష్ రాజ్…అంటాడు..బహుశా…గణేష్ పాత్రో..
మనుష్యులందరూ మంచోళ్ళే రా..
అని…..డీవీడీ ? లో రెండుసార్లు చూసా….
నాకు సినిమా నచ్చినా….ఆ డైలాగ్ నచ్చలేదు..
మనుష్యులు…రోజు రోజుకీ..ఇంకా చెప్పాలంటే..క్షణ క్షణానికీ దిగ జారిపోతున్నారు…

నా పోస్ట్ గ్రాడ్యేషన్ పూర్తయ్యాక…వెరే చోట కొంత కాలం ఉండాల్సి వచ్చింది..చిన్నా చితకా కేసులకు వెళ్లే వాడిని….మరో రెండు నెల్లు తర్వాత……ప్రాక్టీసుకు వేరే చోటికి పోవాలి….
అప్పటికి సెల్ ఫోన్  చిన్న ఊళ్లలోనికి  రాలేదు..
కుర్రాడు.. ఆసుపత్రి నుండి వచ్చాడు కబురు మోసుకుని…..ఎమర్జెన్సీ ఆపరేషన్…పది నిమషాల్లో ఓటీ ముందున్నా..
సిజేరియన్..
డాక్టరమ్మ హడావిడిగా వచ్చింది…డాక్టరు గారు త్వరగా వాష్ అయి..ఎనస్థీషియా ముందు ఇచ్చేయండి..అన్నారు…
యుటిరస్    రప్చరు  (rupture) గట్రా అవలేదు కదా …అన్నా…అదే జరిగి వుంటే…స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వగానే..
నేను షాక్ లోకి వెళ్ళాల్సి వస్తుందని నా భయం….ఎందుకంటే ఒకసారి బేబీ బయట పడక…నొప్పులు ఎక్కువై……ప్రసవం జరక్క పోతే…గర్బ సంచీ బళ్ళున పగిలి…బ్లీడింగ్ తొ పెషేంట్…..ఒకోసారి ప్రాణాన్ని కోల్పో వలసి వస్తుంది..
(అహో…ఈ డాక్టర్లు ఎంత గొప్పవారు…మేము కూడా…)
డాక్టరమ్మ దగ్గరగా వచ్చారు..కాస్తాంత చెవికి దగ్గరగా….వచ్చి..చెప్పారు…

బేబీ హెడ్ డెలివరీ అయిపోయేట్టు ఉంది…ఎనస్థీషియా…ఇచ్చేయండి…
అవును ఎనస్థీషియా ఇవ్వగానే…నొప్పులు ఆగిపోతాయి…బిడ్డ లోపలే ఉండి పోతుంది…
అప్పుడు…మనం …వెంటనే సిజేరియన్ చేసేసి ….బిల్లు పిండేయడమే…చీర్స్!!
ఆ రోజు అలా మొదలయ్యింది…
కడుపులొ దేవెయ్యెడం…..ఈ పదమూడేళ్ళలొ రోజు రోజుకు మరింతగా ….రకరకాలుగా పెరుగుతూనే… ఉంది..
నరకం…అంటే ఎలా ఉంటుందో…కడుపులొ దేవెసినప్పుడే…తెలిసేది…..

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s