నేను నిన్ను ప్రేమిస్తున్నాను… లారీ ఎస్ చెంగెజ్, అమెరికను


అనువాదలహరి

.

నువ్వు నువ్వయినందుకే కాదు,

నీ సమక్షంలో

నేను నేనయినందుకు

నిన్ను ప్రేమిస్తున్నాను.

ప్రేమలో నిన్ను నువ్వు 

మలుచుకున్న తీరుకే కాదు

నన్ను నువ్వు మలుచుతున్న తీరుకికూడా

నిన్ను ప్రేమిస్తున్నాను.

నాలోని ఒకపార్శ్వాన్ని

బయటకి రప్పిస్తున్నందుకు

నిన్ను ప్రేమిస్తున్నా

పోగుపడ్డ నా హృదయం మీద

నీ చెయ్యి వేసి

అక్కడ కనిపించిన

బలహీనమైనవీ,

తెలివితక్కువవీ గుర్తించి

సరిదిద్దలేనివి అలా వదిలేసి

ఇంతవరకూ ఎవ్వరూ

చూడడానికి ప్రయత్నించని

సుందరమైన విషయాలు చూసి

పనిగట్టుకుని వెలుగులోకి

తీసుకువచ్చినందుకు

నిన్ను ప్రేమిస్తున్నాను.

ఇంతవరకూ

ఏ విశ్వాసమూ చెయ్యలేకపోయిన…

మంచి వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దినందుకూ

ఏ విధీ ఉంచలేకపోయినంత

ఆనందంగా నన్నుంచగలిగినందుకూ

నిన్ను ప్రేమిస్తున్నాను.

ఇదంతా కేవలం 

నన్ను తాకకుండానే

ఒక్క మాట మాటాడకుండానే

ఒక సంకేతమూ ఇవ్వకుండానే

నువ్వు సాధించగలిగేవు.

ఇది నువ్వు నువ్వుగా ఉంటూ సాధించావు.

బహుశా,

స్నేహితుడుగా ఉండడమంటే అదేనేమో!

ఏమో!

.

లారీ ఎస్ చెంగెజ్

(ఇంత మంచి కవి గురించి ఏ సమాచారమూ అందించలేనందుకు విచారిస్తున్నాను)

.

.

I Love You

.

I love you,

Not only for what you are,

But for what I am

When I am with you.

I love you,

Not only for what

You have made of yourself,

But for what

You are making of me.

I…

అసలు టపాను చూడండి 139 more words

ప్రకటనలు

5 Comments

 1. మనసులోనికి వెళ్ళి..తడిమి..పిండి..గుర్తు చేసి..కళ్ళు చేమర్చేలా చేసిన….
  కొంత మందే ఉంటారు…
  మనల్ని..
  “జీవించాలీ“ అనిపించే వాళ్ళు..

 2. డాక్టర్ ప్రసాద్ గారూ, మీ సౌహార్ద్రతకి కృతజ్ఞతలు.

  నిజమే. మీరు చెప్పిన ఈ కొందరికి జీవితాన్ని జీవించడం, జీవింపజెయ్యడం ఎలాగో తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ప్రకృతిలో నలుచెరగులా కనిపించే ప్రేమకి నిలువెత్తు నిదర్శనాలు వాళ్ళు. స్నేహానికీ, పరిపూర్ణమైన మానవత్వానికీ నిర్వచనాలు వాళ్ళు. అలాంటి వాళ్ళు మనజీవితంలో ఒక్కరు తారసపడినా, మన అంచనాలకు మించి మనల్ని మనం మలుచుకోగలం.

  అభివాదములతో

  మూర్తి.

 3. 1992 నుండి 1997 దాకా చాలా పరిణామాలు చోటు చేసుకున్నయి. నా జీవితంలో, నేను ఊపిరిగా పీల్చిన ఉద్యమాల్లో , నేను ప్రాణంగా కన్న మిన్నగా భావించిన స్నేహ సంబంధాల్లో చాలా మార్పులొచ్చినయి. కొన్ని నేను తట్టుకోలేక పోయాను – కొత్తగా వస్తున్నఆలంబనలని బలంగా స్వీకరించి స్వంతం చేసుకోలేకపోయాను. యేదో కోల్పోయిన అనుభూతి. ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ పద్యాలు రాసాను – కానీ అవి ఎక్కడో పారేసుకున్నాను. 1998 లో కేవలం మూడే మూడు పుస్తకాలతో అమెరికా వచ్చాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం, అజంతా స్వప్నలిపి, తిలక్ అమృతం కురిసిన రాత్రి. అంతే. నా కల్లోల కలల మేఘం కూడా వెంట తెచ్చుకోలేదు. అమెరికా లో నా ప్రతి వంటరి క్షణంలోనూ ఈ మూడు పుస్తకాలే తోడుగా నిలిచాయి. ఇక్కడికొచ్చాక, ఇక్కడ తెలంగాణ కోసం కృషి చేస్తున్న వారితో పరిచయాలు –. రచ్చబండ మీద మిత్రులతో సాహిత్య రాజకీయ సంభాషణలు – ఆయా సంభాషణల్లో నా గొంతు వినిపించాను. అడపా దడపా ఒకటో అరో పద్యాలు – నన్నట్లా సజీవంగా ఉంచినయి. అయితే 1999 మే లో మారోజు వీరన్న బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడయ్యాడన్న వార్త అశనిపాతం లా తాకింది. పెద్ద షాక్ . యెడతెగని దుఃఖం – ఇప్పటికీ – బహుశా ఎప్పుడూ పొంగి పొర్లుతూనే ఉంటుందనుకుంటా. మళ్ళీ కవిత్వం రాయాలి అన్న తపన ఎక్కువైంది. 2001 లో శివారెడ్డి నవీన్ శివశంకర్ గార్లు తానా సభ ల కొచ్చి మా యింటికొచ్చారు. నా పద్యాలు చూసి శివారెడ్డి సార్ కౌగలించుకుని ” నాన్నా నువ్వింకా బతికే ఉన్నావు” అన్నారు. “అమెరికా జీవితం గురించి రాయి” అన్నారు. కానీ అదేమిటో, ఇక్కడికి వచ్చి 14 యేండ్లయినా ఈ జీవితం నాది కాదనే అనిపిస్తుంది. నా ప్రాణమంతా అక్కడ నా తెలంగాణ పల్లె మీదే తొక్కులాడుతుంది. యెప్పుడూ ఈ జీవితంతో నేను identify కాలేనేమో?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s