తల్లీ!!భారతీ! మీ వాళ్ళు భగత్ సింగ్ లు కాదు??


అక్కలూ..చేల్లీళ్ళూ..అమ్మలూ…అందరకీ పెడుతున్నా నమస్కారం అని…ఆంధ్రా అంతా తిరిగి అధికారం లోకి రాగానే **కొక్కుల్లా దోచుకుని…ఈ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా అందరితో …సొంత పార్టీ వాళ్ళ తోనే>>.ముద్రపడ్డ…పాత రికార్డులను చెరిపి…బ్రేక్ చేసి పారేసిన వైఎస్సార్…

ఆయన కోడలు…ప్రవర్తించిన తీరు…చూస్తె దొంగలు తమ తప్పు  గుర్తించ రేమో…
తాము అమాయకులమనే అనుకుంటారేమో…
కరడు కట్టిన ఉన్మాదులూ…హత్యా కాండ  చేసే వారు…పా శ్చాతా ప్పడ కపోవడం…
సాదారణమేమో??అనిపించింది!!
లేదా వాళ్ళ మీడియా..(దాన్ని మీడియా అనాల్సి రావడం మనం చేసుకున్న ధౌర్భాగ్యం)
వేసిన ప్లాన్ అయినా ఉండాలి…ఇలాంటి కుళ్ళు ప్లాన్లు వేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య..అసలు ఆ మీడియా పుట్టుకే..తెలియనిది కాదు..
బహుశా ఈ రోజు… పేపర్లో హైలయిట్ చేసి ఉంటారు…భారతమ్మ అమాయకత్వాన్ని…
అమ్మా భారతీ…ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని…బ్రష్టు పట్టించారు తల్లీ… నీ మామా …భర్తా సామాన్యులు కాదు తల్లీ…నువ్వు తింటూ…బ్రతుకు తున్న విలాసం అంతా రక్తపు కూడు…ఈ దేశ ప్రజల…సంపదను…గజ దొంగల్లా…దోచుకున్న…ఇంకా నిరూపించ బడని…పక్కా డేకాయిట్ లు తల్లీ… గజ దొంగలు తల్లీ…

ఇదే మా ఇళ్ళలో అయితే మా ఆడాళ్ళు…పుస్తులు తెంపి విసిరేయడమో….ఉరేసుకుని చావడమో చేసే వాళ్ళు..నువ్వు అమాయకురాలివా…నటిస్తున్నావా తల్లీ?అమాయకమయితే పరవా లేదు…

నటిస్తే మాత్రం… నిన్ను…ఈ జాతి క్షమించలేని…పక్కా దోషివి…

 

ప్రకటనలు

10 Comments

 1. మైండ్ గేమ్ లా ఉందండీ!!అయ్యో !ఆడ కూతురు ఎంత భాద పడిపోతుంది..ఎంత అన్యాయంగా జైల్లో పెట్టీసేరూ…ఓట్లేసి గెలిపించేయాలి..అనిపించాలి…జనానికి…నిజంగా తెలుసా ?తెలీదా?/వీళ్ళ అక్రమాల్ని …సరయినవే అనుకుంటున్నారా?ఒకాయన కూతురు పెల్లంటాడూ…ఇంకో ఆయన శభారిమలై …షిర్డీ అంటాడు…దోచుకున్న విషయం తప్ప…అన్నీ మాట్లాడతారు…ఆ పేపరయితే నవ్విపోనేల నాకేటి సిగ్గు అన్నట్టు…అన్ని వ్యవస్తల్నీ తిట్టి పోస్తూనే ఉంటుంది..అవినీతి సొమ్ముతో జనించి జగతిని తిమ్మిని బమ్మిని చేయాలనే ప్రయత్నం..ఎప్పుడూ…గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం అంటే ఏమిటో వీళ్ళను చూస్తె అర్దం అవుద్ది..
  మొన్నకాయన అంటాడు…ఆయన జైల్లో ఉన్నా…అమ్మ సి.ఎం..అయిపోద్దనీ…
  అదేమిటయ్యా…సి.ఎం..అంటే..ఒక రాష్ట్రాన్ని…ఆ రాష్ట్ర భవి ష్యత్తు నిర్దేశించే పదవి అంటే…
  షర్మిల సి>ఎం.అయి పోద్ది..అంటాడు…ఇవేమయిన క్లర్క్..పోస్ట్లా..సినిమా హా ల్లో టికెట్లు కొట్టే పోస్ట్లా…

 2. ఒక వ్యక్తి తప్పు చేసాడా లేదా అనేది ముందుగా అతని అంతరాత్మకి తెలుస్తుంది . జగన్ తప్పు చేసినట్లయితే అసలు అధికార పార్టీ నుండి బయటికి వచ్చే వాడు కాదు . చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడం , విచారణ లమీద కావాల్సిన బెంచికి మార్చుకోవడం ,అధికార పక్షం తో అంట కాగుతూ ఉండే తప్పుడు వ్యక్తులు నిప్పులమంటూ నీతులు చెప్తున్న సమాజం ఇది . మీ లాంటి వాళ్ళు మీ ఆక్రోశాన్ని వెళ్లగక్కడం లో పెద్ద ఆశ్చర్యం లేదు . జగన్ ని ఏ కోర్ట్ దోషి అని తీర్పు చెప్పలేదు . ఎవరు మంచో, ఎవరు చెడో కాలం తీర్పు చెప్తుంది . కోర్టులు చెప్తాయి . పిల్లి శాపాలకి ఉట్లు తెగవు. సిబిఐ దర్యాప్తు ఎలా ఉంటుందో ఇవాలే అత్యున్నత కోర్ట్ గడ్డి పెట్టింది . పాపం నిప్పులకి వాటి మీద మాట్లాడే ధైర్యం లేదు . సత్య మేవ జయతే .

 3. @Sridhar..గారూ..
  ఏమయినా సరే వర్తమాన విషయాల పై మనం సమాజంలో భాగంగా స్పందించా లన్నది మా థియరీ…ఎందు కంటే ఈ రోజు రాజకీయ నాయకులు గద్దెనెక్కి తీసుకునే నిర్ణయాలు మన జీవితాలనే కదా ప్రభావితం చేసేది?రేపు మన పిల్లలే కదా అనుభవించేది..మంచయినా చెడయినా?స్పందించినందుకు థాంక్సండీ…

 4. ఈ శ్రీధర్ గారు ఎవరో జగన్ అంతరాత్మ లా ఉన్నారే! ఆయనకు తప్పు చేశాడో లేదో తెలిసిపోయింది! నాయన “ఆత్మ” గారు దిల్-కుశా చుట్టూ తిరుగుతుంటే, ఈ అంతరాత్మ గారు చీకటి గదుల్లో జరిగే విషయాలను సొంత కళ్ళ తో చూసినట్లుగా చెబుతున్నారు.
  “జగన్ తప్పు చేసినట్లయితే అసలు అధికార పార్టీ నుండి బయటికి వచ్చే వాడు కాదు.”..బయటికి రావటం కోసం కొన్ని నెలల పాటు ఆగ బళ్ళే, వెంటనే బయటికి వచ్చేయవచ్చు. చిన్నపాటి రాజకీయ నాయకుడు కూడా తన తప్పులని వెనుక పెట్టుకొని, ఎదుటి వాడి మీద ఎదురుదాడి చేసే కాలం ఇది.
  ఎదురుదాడి లో పేరెన్నికగన్న వారు , “అయ్యో నేను తప్పులు చేశాను, బయటికి రావటం సరి కాదు”, అని ఆలోచిస్తూ కూర్చోరు. అందులోనూ అధినేత్రి కి కూడా అంతకు ముందు చేసిన అవినీతి లో భాగం ఉంటే, బయటికి వచ్చినా…”ఆమె జుట్టు నా చేతి లోనే ఉంది. ఏమి చేస్తుంది లే అన్న భరోసా ఉంటుంది.”. వచ్చే రెండు సంవత్సరం కాలం లో జగన్ పార్టీ కాంగ్రెస్ తో కలిసిపోదనే గారంటీ ఎంత? డీల్ కుదిరితే, మాల్ OK
  kvsv గారు మీ రెండో కామెంట్ కీ మొదటి కామెంత్ కీ అంత తేడా ఏమిటండీ..? 🙂
  దేవుడు

 5. జగన్ తప్పుచేశాడా లేదా అన్నది తరువాతి విషయం. అతని అంతరాత్మ కి తెలవటం, తెలవకపోవటం అతని వ్యక్తిగత విషయం. అసలు జగన్ కాంగ్రెస్ నుంచీ బయటకి వ్యక్తిగత కారణాల వలన బయటికి వచ్చాడా? లేక ప్రజల సమస్యలగురించి బయటికి వచ్చాడా? ప్రజల సమస్యల తో సంబంధం లేని విషయాల గురించి జనాలు ఎందుకు పట్టించుకోవాలి?
  ఆమె ఏదో ఏడ్చిందని జనాలు ఓట్లు వేయాలా? లెక తమ సమస్యల ఆధారం గా ఓట్లు వేయాలా?

 6. @kvsv గారు మీ రెండో కామెంట్ కీ మొదటి కామెంత్ కీ అంత తేడా ఏమిటండీ..?

  రిలయన్స్ కి గాసిచ్చారన్న విషయానికి మేం నిరసిస్తాం..నిరశన తెలియచేసాం..
  మూడు వందల పరిశ్రమలు హైదరాబాద్ లో కరెంట్ లేక మూత పడ్డాయ్…పని లేక రోడ్డు మీద తిరుగుతున్నారు..పైసా సంపాదన లేక..ప్రజలు…
  ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడ్డానికి ఎవరూ రావటంలేదు…కరెంట్ లేక పోవడమే కాదు…సర్వ నాశనం చేసిపోయాడు దేవుడు…ఈ రొచ్చు లోకి మమ్మల్ని లాగేస్తారని పారిశ్రామిక వేత్తలు ఈ రాష్ట్రం వైపు చూడ్డం మానేశారు…..రేపు పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా??కనీసం హైదరాబాద్ మొహం కూడా చూడ్డానికి ఇండస్త్రియలిస్ట్ లు ఇష్ట పడ్డం లేదు…ఐఏఎస్ లూ…మంత్రులూ..అందరూ అవినీతిలో నిండా ములిగి రాష్ట్రాన్ని దివాలా తీయించారు…ఈ దరిద్రం అంతా తండ్రీ కొడుకు ల పుణ్యమే…
  అవినీతి మన తర్వాతి తరానికి భవిష్యత్తు లేకుండా చేస్తుంది…చేసింది..అందుకే అదే వాదన మళ్ళీ మళ్ళీ వినిపిస్తాం…

 7. సానుభూతి ఆధారంగానే ఒట్లే యాలని చరిత్ర “పక్కా“గా చెపుతుందిగా…మీరు వినలేదా??ఇక తప్పా ??కాదా??
  ఇలాంటి విషయాల్లో మన కన్నా సామాన్య జనం..బెటర్..జగం … తిన్నాడు, గానీ ఎవరు తినలేదో??..అని నిజాయితీగా బల్ల గుద్ది చెప్తారు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s