The Haunting ..


2003   భోగి .మధ్యాహ్నం కావస్తుంది. 11.30 a.m.
తాళం తీసి ఇంట్లోకి వచ్చా..పండక్కి బాసూ,పిల్లలూ వెళ్ళిపోయారు.ఒంటి పిల్లి రాకాసిలా నేను ఒక్కణ్ణే  ..
ఎబ్రాసోడికి పనేక్కువనేది మా అమ్మ..పండగ రోజూ పని తప్పలా..ముగించి వచ్చినప్పటికీ ఈ టైం అయింది.
ఒక్క మంచి అలవాటూ లేదుగా మనకి…టిఫిన్ అలవాటు లేదు…రావటం రావటం డ్రెస్ మార్చి..మొహం కడుక్కుని..కంచంలో ఇంత పడేసుకుని..పది నిమషాల్లో కంచం కడిగి పారేసి..ఎందుకంటే సాయంత్రం పనిమనిషి వస్తుందన్న గ్యారంటీలేదు కాబట్టి..బయట కు వచ్చి రోడ్డు మీదకు చూసా..భోగి మంటలు వేసారు…బూడిదా..కొంచెం పొగ..మనం చచ్చినా అంతే..అదేగా మిగిలేది..
పిట్ట మనిషి లేడు..ఎదురిళ్ళు తాళం పెట్టి ఉన్నాయ్..పెద్ద పల్లె టూరు నుంచి చిన్న పల్లెటూరుకు పోయారు..పుట్టినిళ్ళ కు..మెయిన్ తలుపు గెడ పెట్టేసా ..హాల్లోకి వచ్చాక..ఎక్కడ పాడుకుందాం??రాత్రి నాలుగైదు గంటలకంటే ఎక్కువ పడుకోక పోవడం చినప్పటి నుండీ అలవాటు..ఎక్సామ్స్  లేకపోతె…వాక్ మెన్..నవలలూ..రాత్రి రెండు వరకూనూ…
అందుకే మధ్యాహ్నం భోజనం మొదలు పెట్టగానే భలే ఉంటుంది…నాలుగైదు నిమషాలకల్లా రెండు పెగ్గులేసి నట్టు…కను రెప్పలు బరువుగా వాలిపోతుంటే.. భోజనం పూర్తవ గానే చేతులు తుడుచుకుంటూ బెడ్డే క్కెయడమే..ఫాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేసుకుని…
వెనక నుంచి తినడం పడుకోవడం ఇదే పని అని కీర్తిస్తారు మా బాస్..
మొదటి రూమ్లో పడుకుందామని..వెళ్ళా..ఎడం వైపు గొడకు ఆనుకుని ఉంది మంచం…పైన సీలింగ్ ఫాన్ గాలి తగిలేట్టు కుడి వైపు తిరిగి ఓ పక్కకి పడుకున్నా..తల కింద చేయి మడిఛి పెట్టుకుని…
వెంటనే మగత లోకి వెళ్ళిపోయా…
ఏడెనిమిది నిమషాలు..అయి ఉంటుంది…ఎప్పుడు వెల్లికిలా తిరి గానో తేలియదు..కళ్ళు మూసుకునే ఉన్నా ..గదంతా కన బడుతుంది..కాకపొతే కర్టెన్ వేసి ఉండడం వల్లా..చలికాలం అవడం వల్లా..కొంచెం చీకటి..కళ్ళు మూసుకునే ఉన్నా…
నా ఎడం ప్రక్క నుంచి నాలుగైదు బియ్యం బస్తాలంత మాస్ నీలం గా.. పెద్ద జేల్లీలా ఉంది..ఎడం వైపు గోడ మీదకేక్కేసి..సీలింగ్ మీద దొర్లుకుంటూ..కుడి గోడ మీదుగా దిగి నాకు కుడి వైపు నుంచి స్పీడుగా వచ్చి మీద పడింది…

తల దగ్గర నుండీ పాదాల వరకూ వెచ్చటి ఫీలింగ్…పై నుంచి కింది వరకు పూర్తిగా నా శరీరం మొత్తం అది మీద పడి ఉంది..ఒక్క ఇంచి కూడా మరెక్కడా లేదు…మొత్తం పై నుంచి క్రింది వరకూ  నా మీదే….   ఆ లేత నీలం గా ఉన్న jelly  ముద్ద నాకు ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకూ సన్నటి అలలా కదులుతుంది..వెచ్చగా ఉంది…గుండె కొట్టుకోవడం…ఎక్కువై…కాళ్ళూ చేతులూ కదపటానికి ట్రై చేస్తున్నా…ఊహూ కదలటం లె..పరిగెడదాం అని ప్రయత్నిస్తున్నా…

ఒక్క సారి బలం అంతా ఉపయోగించి ఎంత ట్రై చేసినా ..కళ్ళు తెరుద్దామని ఎంత ప్రయత్నించినా తెరుచుకోవే..నాకు తెలుస్తుంది నా ప్రయత్నం..నోరు ఆరిపోయి…అరుద్డా మంటే ..విశ్వ ప్రయత్నం చేస్తున్నా నోరు పెగలదు…అరుపు బయటకు రాదు…అంత జెల్లీ ముద్దకూడా తేలిగ్గా ఉంది…వెచ్చగా కదులుతుంది…నాకు భయంతో గుండె పేలిపోయే దేమో…నాలుగైదు మిమషాలు గింజుకు చచ్చా…ఒక్క సారి బలం అంతా ఉపయోగించి … గింజుకుని, కళ్ళు తెరిచా…లేచి అలా మంచం మీద ఒక్క క్షణం కూర్చున్నా..చమటలు పట్టేసా..గుండె విపరీతంగా కొట్టుకుంటుంది…నోరు అంటుకు పోయింది…గబా గబా..వీది తలుపు తీసి రోడ్డు మీదకు చూసా..సైలెంట్ గా అలానే ఉంది..నిశ్శబ్దం గా..హాల్లోకి వెళ్ళడానికి కూడా భయంవేసింది…రెండు నిమషాలు అల్లా నిలబడ్డా.. అయినా మర్చిపోలేక పోతున్నా విపరీతంగా పట్ట పగలే భయం వేస్తుంది..
మళ్ళీ హాల్లోకి వచ్చా వీది తలుపు వేయకుండా దివాణం కాట్ మీద కూర్చున్నా..దొంగల భయం ఎక్కువ..కానీ తలుపు వేయడానికి  ధైర్యం చాల లేదు..రూం లోకి ..?సమస్యే లేదు…బాత్ రూమ్ కి వెళ్ళాలన్నా భయం గా ఉంది..క్రింద అఫీసు సెలవవడం వల్ల.. క్రింద పోర్షన్ లో ఎవరూ లేరు..ఇక రూమ్లోకి వెళ్ళలే..  హాల్లోనే పడుకున్నా…

అలా నిద్రపోతూ లేగుస్తూ మూడున్నరవరకూ దొర్లా..పూర్తి నిద్రలోకి వెళ్ళడానికి భయం వేస్తుంది..అప్పుడు వచ్చాడు చాకలి..
విషయం చెప్పా….అమ్మగారికి ఫోన్ చేయమన్నాడు…..అక్కడే నిలబడమని వాణ్ని…గది లోకెళ్ళి ఫోన్ చేసి..చెప్పా..సెల్ ఫోన్లు లేవు అప్పటికి..ఇక్కడ……

మా బాస్ ఇక మొదలెట్టాడు..నాకు తెలుసు ఏ దో ఒకటి తెస్తావ్…
నేను వెళ్లనని ముందే చెప్పా…ఆ గాలి నిన్ను వదలలే…నే రెపుదయం బయలుదేరుతా…రాత్రికి  హాస్పటల్  కుర్రాణ్ణి తోడు పడుకో పెట్టుకో మని చెప్పింది…
నిద్రలో నేను  భయంకరంగా అరవడం..వీళ్ళు పరిగెత్తుకు రావడం..

(1994 లో మొదలయ్యింది…ఘోషా ఆసుపత్రి లో మొదటిసారి  స్పెషల్ రూమ్ తీసుకున్న మొదటి రోజు రాత్రి ఏదో మీద  ఏదో  మీద పడ్డట్టయ్యి..మరుసటి రోజు ఉదయం స్వీపర్ ని ఎంక్వయరీ చేయగా తెలిసినది ఏమిటంటే.. ఆ రూమ్ లో పచ్చ కామెర్ల తో జాయినయిన నిండు గర్బిణీ …డెలివరీ అవక  ముందే చనిపోవడం జరిగింది…అప్పటి నుండీ ఈ రూమ్ లో జాయినయిన  ప్రతీ ఒక్కళ్ళ కంప్లెయింట్ ఇదే !!!

పెద్దగా ఇంపార్టేంట్ ఇవ్వలా అప్పట్లో ఆ విష్యానికి..(ఆ రాత్రి అదో పెద్ద ఎపిసోడ్..తర్వాత వివరిస్తా..షార్ట్ కట్ లో చెప్పా ఇప్పు డు…

పగలూ రాత్రి..ఎప్పుడయినా సరే…మంచి నిద్రలో ఉండగా…విచిత్రమైన ద్వని..ఆగ…గ్.gggrrrrrrrrrrrr……నేను అరుస్తూనే ఉంటా..భయంకరంగా నాకు విన బడుతూనే ఉంటుంది..ఆ శబ్దానికి నేనూ భయపడిపోతూ ఉంటా…మిగతా అంతా మామూలే…కళ్ళు తెరవలేం…కాళ్ళూ  చేతులూ ఎంత ప్రయత్నించినా కదలవు ..పరిగెడదాం అంటే…..నొరు తెరచి అరుద్దామంటే….శబ్దం బయటకు  రాదు..గింజికుంటూ ఉంటా…ఒంట్లో ఒణుకు…అది వింటూనే నేను మరింత…అప్పటికే గుండె విపరీతం గా కొట్టుకో వడం వల్ల…భయపడిపోతూ.. ఉంటా…అసలు నన్ను ఒంటరిగా వదలి వెళ్లారు…వెళ్ళినా..
ఎవరో ఒకళ్ళను నాకు తోడుగా   పడుకో బెట్టి వెళ్తారు..పగలయితే నాకు దగ్గరగా ఒకళ్ళు నా అరుపులు విన బడే  రేంజ్ లో ఉంటారు…గమ్మత్తు ఏమిటంటే నాకు తెలియ కుండా ఈ జాగ్రత్త లన్నీ తీసుకుంటారు…మా బాస్…తను చెప్తే నాకు తెలిసింది.. ఆ తరువాత నిజమే…నే అరవగానే ఎవరో ఒకళ్ళు రావడం…లేపడం…ఆ తర్వాత…నేను మరచిపోతా గానీ వీళ్ళు మరవలేక పోతున్నారు…

నే నిద్రలో అరిచిన అరపు చాలా భయంకరంగా..అసలు ఇలా అని చెప్పలేని…భయంతో కూడుకుని…చెమటలు పట్టించే ట్టు ఉంటుంది…స్వాతి ముత్యం లో కమల్ రాధిక కు సంగీతం నేర్పిస్తా అంటూ…అలా కాదు…అంటూ….ఆఆఆఆ…గ్గ్..గ్గ్… ..గొంతు కొంచెం సన్నగా  గర గర వచ్చే వైబ్రేషన్ ఉంటుంది…ఆ వైబ్రేషనే….పెద్దగా…భయంకరంగా…బహుశా…చావుకు బయి పడిపోతూ…రొదిస్తున్నట్టు…భీకరమయిన రోదన…భయపెట్టే…విధమ్…ఆఆఆ..గ్..గ్.గ్..గ్..,,,గీ..గీ..ఘీ…పూరి జగన్నాధ్ చెప్పినట్టు.. ** పోయాల్సిందే ఎలాంటి వాళ్ళయినా….నిజం ఇంట్లో వాలూ ..నేనూ హడలిపోతాం….విచిత్రంగా నిద్రలోంచి లేచాక ఆ విషయం నే మర్చి పోతా…మా వాళ్ళూ మరచి పోతారు…… అనుకున్నా…కాదు…బుర్రలు బాదుకుంటున్నారని తర్వాత..తెలిసింది…

రెండు రోజుల క్రితం రాత్రి మళ్ళీ మా బాస్ లేపి కూర్చో బెట్టి, నాగుండె హడాలిపోయింది..ఏమిటి చిన్నీ…చాలా భయమెసింది తెలుసా??……పక్కకి తిరిగి పడుకో…తెల్లటి ఒళ్ళు ఉన్న వాళ్ళు వెల్లకిల్లా పడుకోకూడదు..గాలి పడుతుంది అని ఎన్ని సార్లు చెప్పా??….షర్ట్ వేసుకుని పడుకోమంటే వినవు…?చంపుతున్నావ్..ఎప్పుడు ఏం తెస్తావో అని…అదేం అరుపు బాబోయ్,,ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా…నీకు కాపలా తొనే సరిపోతుంది…అంటూ…క్లాస్ పీకారు ఆ అర్ధరాత్రి రెండప్పుడు..మా బాస్..
పూజలు ఎక్కువగా చెసే..ముందే జరగబోయెవి చెప్పే ఈవిడ కూడా…   భయపడి నట్టు చెప్పడం తో మరో సారి ఈ సమస్య సీరియస్ గా తీసుకోవటం మొదలు పెట్టా…

నే పడుకునేప్పుడు ఓ పక్కకి తిరిగే పడుకుంటా…నే పడుకునేప్పుడు ఓ పక్కకి తిరిగే పడుకుంటా…

౩౦ గంటలు పైన అయ్యింది..ఇది పోస్ట్  చేయడం కుదరడం లేదు…అందుకే పంతం పట్టి….మార్పులూ చేర్పులూ లెకుండా…పోస్ట్ చేస్తున్నా!! ఎప్పుడూ ఇలా కాలేదు…

(ఇంకా ఉంది…)

ప్రకటనలు

2 Comments

 1. ఘోషాసుపత్రి అనగానే అనుమానం వచ్చింది సుమ మీది విశాఖ అని.. , మాది విశాఖే ..
  పైగా.. కొసమెరుపేంటంటె.. ఆ ఆసుపత్రి పక్క వీధిలొనే మా ఇల్లు(చాట్రజువారి వీధి ఒక వేళ మీకు తెలిసి ఉంటే ) … మీ రచన రొమంచితంగ ఉన్నది…

  • 🙂 మాది దూడా వారి వీది.పురిపండా అప్పల స్వామి గారు ఆ వీధిలోనే ఉండే వారు..
   పప్పుల వీధి అంటారు గా…ఆ లైన్ లో,వెనుక న పాత తాలూకాఫీసు ఉండేది..అక్కడి నుండి ఇటు వస్తే టౌన్ హాల్..అక్కడ కొంచెం కాలక్షేపం చేసాక..ఇటు కంచర వీది…మీ వీది…కొలుస్తూ…అటు వైపు నుండి బీచ్ రోడ్ లోకి దిగి పాత మినర్వా టాకీసు? మీదుగా….కోస్టల్ బాటరీ డౌన్ కి అటునుండి…ఆర్కే బీచ్…ఇది డైలీ రౌండ్స్….
   1965 లో పుట్టా…ఘోషా లోనే.. 2001 వరకూ అక్కడే ఉన్నా…మద్యలో మెడికల్ కాలేజీ హాస్టల్ లో 87-91 వరకూ..ఉన్నా….
   మీకు మైల్ చేస్తాను…మిగతా విషయాలు..మీ పోస్ట్ లోని పాటలు చూశాక ..నాకు ఎందుకొ తెలీదు…రెండు మూడు సార్లు మీ బ్లాగ్ కి వచ్చి మళ్లీ మళ్ళీ వెతికా…ఈ దెయ్యం పడ్డప్పిటి నుండీ…:)…కొన్ని విషయాల్లో ..చెప్పలేని హింట్ అంటూ ఒకటి తెలుస్తూ ఉంటుంది…నాకు..:)))

   .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s