నుదిటి వ్రాతను ఎవ్వరూ మార్చలేరు!!


జీవితం లో జరిగే కొన్నిటికి కదలిపోతాం..మనసు సంతోషం తో నిండిపోవచ్చు..
ఈ జీవితాన్ని ముగించేయాలీ అనిపించవచ్చు…ఎన్నో జరుగుతాయి…కానీ అవన్నీ ముందుగా నిర్ణయించబడి ఉంటాయ్..అవును నుదిటి మీద రాయబడి ఉంటాయ్…
నా ప్రియమైన ఫ్రెండ్ అనుకోండి…  ఎక్స్..ఒకే ఎక్స్…ఇంట్లో అన్న దమ్ములు అక్క చెళ్ళెళ్ళూ అందరూ ఉన్నా…
మగ పిల్లలకెవరి కీ ఒడుగు చేయలేదు… మా ఎక్స్ కి అక్క ఉంది..పెళ్ళయింది..పిల్ల లేరు..ఒడుగు చేయలెదు..
మా ఎక్స్ కి పెళ్ళయింది..ఇద్దరబ్బాయిలూ…తాతా…అక్క బావా కూడా సంతోష పడ్డారు…..
తల కొరివి పెట్టే మగ పిల్లలున్నారూ..కావలిస్తే తామే పెంచి పెద్ద చేస్తాం..
ఒడుగు చేయించాలి..తల కొరివి పెట్టే మగ పిల్లడికి ఒడుగై ఉండాలి…
మా ఎక్స్ ఒప్పుకోలేదు..ఒడుగూ గిడుగూ లెదు..
పనికిమాలిన నస పెట్టొ ద్దన్నాడు..
ఏ జన్మ పాపమో ఎవరికీ ఒడుగు చేయలా??ఇంటి పెద్దన్నకే ఒడుగు కాలే!!
ఏడెనిమిది ఏళ్ళ క్రితం మా ఎక్స్ అమ్మ చనిపోవడం జరిగింది…
కొన్ని కొన్ని కారణాల వల్లా సమస్యల వల్లా మా ఎక్స్ ముందుండి కార్యం కానిచ్చాడు,,,
కొన్నాళ్ల తర్వాత…అస్థికలతో రాజమండ్రి ప్రయాణం  అయ్యాడు ….భార్యా పిల్లలతో మా ఎక్స్…
అక్కడ గోదారొడ్డున కార్యం మొదలు పెట్టారు…
గోత్ర నామాలు అడిగిన పంతులు గారు జంధ్యమేదయ్యా అన్నాడు…అప్పుడు..కుటుంబంలో పరిస్థితులు వివరించి…
ఎవరికీ ఒడుగు కాలేదు…జంధ్యం..వేయలేదూ…చెప్పుకొచ్చాడు మాఎక్స్,,,

పంతులు గారు పేచీ పెట్టాడు…
బ్రాహ్మణ బిడ్డవి…ఒడుగు కాకుండా..తల్లికి ఎలా పిండం పెడతావు?అస్థికలెలా గంగ లో కలుపుతావు అంటూ మొత్తం

కధ చెప్పుకు వచ్చి…ఇకనయినా కార్యాలు ఒడుగు చేయించుకుని..చేయమని…
అప్పుడే  కర్మ కాండలు కనీసమయిన ధర్మం తో చెసినట్టు  అవుతుందని చెప్పి…
ఆ గోదాటి ఒడ్డున ఒడుగు చేసాడు…అదంతా పూర్తయి జంధ్యం వేసి..మూడు గంటల తర్వాత అస్థికలు కలిపే కార్యక్రమం చేపట్టాడు,,,,

పరిస్థితులో మరొకటో చక్కగా ఇంట్లో ఒడుగు కాక పోవటమేమిటీ?
ఆ ఆలోచనే లేని మనిషికి జంధ్యం మెళ్ళో ప్రత్యక్షమవడమేమిటీ?
ఒడుగులూ,జంధ్యాలూ అంటే పెద్దగా పట్టింపు లేని మనిషికి…
పిచ్చి పనులు అని కొట్టి పారేసే మనిషికి ..
గోదారి ఒడ్డున అదీ గోదాటి ఒడ్డున…
వినాయక పూజతో మొదలు పెట్టి… ?గాయత్రీ మంత్రం చెప్పించి…జంధ్యం వేసి…మొత్తం ఒడుగు కార్యాన్ని యధా తధం గా ఎక్కడా తగ్గకుండా

పట్టు పట్టి మరీ చేసారు ఆ పంతులుగారు…
అసలు ఒడుగూ గిడుగూ నైజానా అనే మనిషికి నుదిటిపై రాసి పెట్ట  ఉండక పోతే..ఇలా జరిగేదా…
లేదు..తల రాత అంటారే…అదే..ముప్పై అయిదేళ్ళ వయసులో నువ్వు సంప్రదాయాన్ని కాదన్నా…
బ్రహ్మ రాసిన నుదిటి రాత ప్రకారం అప్పుడు జరగాలని రాసి ఉంది..కాబట్టి అప్పుడే జరిగింది…
ఏది జరిగినా మనకు ఇలా రాసి పెట్టి ఉంది అందుకే ఇలా జరిగింది…
అన్నిటికీ…పైన ఒకడున్నాడు…ఆయన నిర్ణయించినట్తు జరుగుతాయి…
మన చెతుల్లో ఏమీ లేదు అని అప్పటి నుంచి ఏం జరిగినా…….
మంచయినా… చెడయినా… జరగాలని రాసి ఉంది..అంతే అనుకోవడం అలవాటయి పోయింది నాకు…
………
ఎందుకంటే …..ఆ ఎక్స్ నేనే కాబట్టి….

ప్రకటనలు

6 Comments

  1. నేను కూడా చాలాసార్లు – మానసికంగా బలహీనమయినప్పుడు – మారి …మళ్ళీ వెనక్కి వస్తుంటాను. మీరు విధి రాత అంటారేమో కానీ నేను మన బలహీనత అంటాను. ఆ బలహీనత ఆ సమయంలో విధి నిర్ణయించిందంటారా? సరే, విధి ఎలా నిర్ణయిస్తే అలా మీచేత పలికిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s