2×2=22 : కాదంటారేమిటీ?


2×2=22   కాదంటారేమిటీ?    4 అంటారా??ఇక్కడున్నవన్నీ    రెళ్ళే  గా   4 ఎ క్క  డి   నుండి వచ్చింది…కాబట్టి నేనే రైట్    మీరే     తప్పు  అనంటే    మీరేం చేయగలరు??

ఒకో అంకం పూర్తి చేయడానికి గంట నుండి మూడు గంటల వరకూ పడుతుంది..ఈ సమయంలో షుమారుగా ఎనిమిది నుంచి పది మంది ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తూ వార్తలూ విశేషాలు చర్చించడం జరుగు తుంది…ఇలాంటి అంకాలు రోజుకు నలౌగైదు చోట్ల మొత్తంగా కలిపి ఎనిమిది ఒకోసారి పది వరకూ ఉంటాయి…
అప్పుడు చర్చ్గల్లో వచ్చే అభిప్రాయాలను బ్లాగ్లో నలుగురికీ చెప్పాలనిపించి వాటిని అలానే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది….
ఈ వ్యక్తులందరూ దగ్గరైలో ఉన్న వేర్వేరు మండలాల నుండి వచ్చి షిఫ్టుల వారీగా వర్క్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుంటారు…
వాళ్ళ ఊళ్ళో జనాల అభిప్రాయాన్ని ఈ మాటల్లో చెపుతూ ఉంటారు…
నేను నా బ్లాగ్ లో ఎప్పుడూ చెప్తూంటాను ….
నలుగురూ మాట్లాడుకుంటున్న విషయాలనే మీతో పంచుకుంటూన్నాని…అంటే బయట టాక్ ఇలా ఉంది అని ..బ్లాగ్ లో పెడుతున్నానని…

మేం మాట్లాడేది…వంద రూపాయలు…బిర్యానీ పేకెట్ చేతిలో పెడితే లారీ ఎక్కి ఆ పూటకి ఆపార్టీకి జై కొట్టే టైపు వాళ్ళ తో…అన్నదానికి   కొంత  మంది భాద పడ్డారు…. ఇలా…..
మీతో బాతాఖానీ వేసినందుకు పాపం ఆ ప్రజలెవరొ 100 రూపాయలు ,బీరు ,బిర్యానికి అమ్ముడుపోయే రకం అని మాట అనిపించుకున్నందుకు వాళ్ళ గురించి చాలా గర్విస్తున్నాను …
అవును మా దగ్గరకొచ్చే వాళ్ళు 100 %…మంది చెప్పేది అదే…ఏమయ్యా…మీ ఎమ్మెల్యే ఏం ఊడబొడిచాడని మీటింగు పెడితే పొలో మని పరిగెడతారూ….
అన్న దానికి..పనులు ఆపుకుని ఎవరైనా వెళ్తారా సార్…మందూ.బిర్యానీ..లేదా ఓ రెండొందలిస్తేనే… పోతాం గానీ…ఎవడు లారీ పంపించినా పోతరు సార్…జనం ఆపూటకి మందు   పడేస్తే చాలు..అని జవాబిస్తారు…
జనాలోనికి  రండి ..వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడండి…విషయాఅలు అర్ధ మవుతాయి…

ఇంతటి అవినీతి కాంగ్రెస్స్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ లో కాపాడిన చంద్రబాబు ఇంకెంత అవినీతి పరుడు అంటారు…అన్నారొకాయన…

జైల్లో ఇరుక్కుని బయట పడలేక…
ఓపక్క జనాల్లో సానుభూతీ…ఆకర్షణ తగ్గిపోతున్నాయని….ప్రభుత్వాన్ని కూల్చి ఎలక్షన్లు ఎలాగయినా వచ్చేట్టు చేసుకుంటే,…
ఇప్పుడున్న ఓట్ బాంక్ క్షీణించి పోక ముందే అధికారం లోకి వచ్చి లేదా ఎక్కువ సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ తొ ఒక సెటిల్మెంట్ కు రావటం ద్వారా….
కేసుల్నుండీ…జైలు నుంచీ బయట పడవచ్చన్న ఆదుర్దా తో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మా    మద్దతివ్వలేం అని టీడీపీ నే తేల్చి చెప్పింది……
అవిశ్వాసానికి  మద్దతివ్వలేదు కాబట్టి కాంగ్రెస్ అవినీతిని టీడీపీ సమర్ధించినట్లేననీ…భాష్యం చెప్పుకుంటే ఇక ఎవరూ జవాబు చెప్పేది లేదు…
తమకు పూర్తిగా వాతావరణం అనుకూలంగా ఉన్నట్టనిపిస్తే,ఎలక్షన్లు జరిగి అధికారం లోకి రాగలమనుకుంటే టీడీపీ నే అవిశ్వాసం పెట్టి ఎలాగోలా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది గానీ…..
జైలు పార్టీ వాళ్లకు చాన్స్ ఇస్తుందా??అయినా పీక లోతు ఆరోపణలతో ఉన్న పార్టీ…ఐఏఎస్ లనూ మంత్రులనూ జైల్ పాల్చేసిన నాయకులు ..
కాంగ్రెస్ అవినీతి పై అవిశ్వాసం పెట్టటమేమిటీ?టీడీపీ సపోర్ట్ చేయలేదని టీడీపీ అవినీతిని.అవినీతి ప్రభుత్వాన్ని సమర్ధిస్తుందన్నట్టు మాట్లాడ్దమేమిటీ…
కనీసమైన ఆలోచన కూడాలోపిస్తుందా మనలో ?? వ్యక్తుల ను వ్యతిరేకించినా…పూజించినా దానికి కనీసమైన …..విశ్లేషాణ చేసుకో కుండా….
గుడ్డిగా వాదన చేయడం ఏ సమాజం లోనయినా ఉంటుందేమో??
టీడీపీ ని గానీ కాంగ్రెస్ ని కానీ మరో పార్టీని కానీ గుడ్డిగా వ్యతిరేకించనూ  లెదూ…సమర్ధించనూ లేదు…
టీడీపీ లోటు పాట్లన్నీ… జనాల్లో ఉన్న అభిప్రాయాన్ని గతంలో చాలా సార్లు ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పదం జరిగింది…
నా పాత కామెంట్లు..పోస్టులూ చూస్తే అర్ధమవుతుంది…టీడీపీ మొదలు పెట్టిన అవినీతిని extra లార్జ్ లో చూపించాడు..దేముడు!!!
బాబు నా మేనమామ కాబట్టీ…జగం నా బామ్మర్ధి కాబట్టీ ఆళ్ళు దేముళ్ళు అని సపోర్ట్ చేసుకుంటూ పోలేము…

ఏసీ రూముల్లోనో.. కులమోళ్ళంతా పిక్నిక్ పెట్టుకుని శభాష్ అని బుజాలు తడుము కోవడం ……మన పెర్ఫార్మెన్స్ సూపరో అనుకోవడం కాదు..
ప్రభుత్వాల అవినీతి వల్ల ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలుసుకుని……
వాటినన్నిటినీ అక్రమ ఆరోపణలూ…కక్ష సాధింపు చర్యలు అని …
నేను జగన్ పల్లకీ మోస్తా నువ్వు బాబు కి ఎత్తిపెడుతున్నవుగా అని కాకుండా స్థూలంగా ఏం జరిగిందో…
ఒక సగటు జీవిగా జరుగుతున్న వాటి గురించి ఆలోచించాలి…
ఇంకో బాంబ్ పేలింది….జగన్ పై బురద జల్లు తున్నారట….ఈ శతాబ్దపు బెస్ట్ జోక్గా జగన్ అభిమానులతో సహో ఏకగ్రీవం గా ఏకీభవిస్తారనుకుంటా…..
మా వాడికి మరీ ఇంత ఆకలెక్కువేమిటండీ…బాబు చూడండి తడి గుడ్డ తో పీకలు కోసినా ఎక్కడా దొరక్కుండా ఉన్నాడంటారు…  జగం పార్టీ   అసంతృప్త నాయకులే..

ఆంధ్ర ప్రదేశ్ లో మీ వాళ్ళు ఎవరైనా వ్యాపారాలూ గట్రా చెస్తూ ఉంటే…. గత నాలుగు నెలలుగా మార్కెట్ ఎలా ఉందీ??ఎందువల్ల అని ఎంక్వయరీ చేయండి..
అవినీతి…దాన్ని దృష్టి తప్పించుకోడానికి పెట్టే సంక్షేమ పధకాలూ రాష్ట్రాన్ని ఎంత అధోపాతా ళానికి తీసుకు పోతాయో తెలుస్తుంది…

:))  జగం…. అవును…. జగన్ ను మావైపు వాళ్ళు నోరు తిరక్క అలానె పిలూస్తుంటారు..జగం పార్టీ అనీ

1 Comment

  1. వర్తమాన విషయాల పై బిన్నాభిప్రాయాలు ఉండొచ్చు… లోకో భిన్న రుచి అంటారు…అలాగె వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉండటం జరుగుతుంది..ఇక్కడి పై మాటర్ ను ప్రతీ ఒక్కరు వేర్వేరు గా ఆలోచించ వచ్చు …ఏ బ్లాగర్ పై వ్యక్తి గతం గా తీసుకో రాదనీ…వర్త మాన విషయాల పై భిన్నభిప్రాయాలు ఉండడం సహజమని …తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు క్రొట్టినట్టు చెప్ప వచ్చనీ మనవి చేసుకుంటున్నాను…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s