ఎవడు తినలేదంటారా??అయితే, మీరు కక్కండి!!!


ఎవడు తినలేదండీ? తిన్నా… మాకు కొంత చేసాడు కదా…!!
ప్రతీ మేధావీ ఆంధ్రాలో ఇదే డైలాగ్ చెప్తుంటాడు..
అవును ఎవరెంత తిన్నా…మాకు ఓ రెండొందలో..అయిదు వందలొ నెలకి పారేస్తున్నాడు గా…(వాళ్ళు తినేసిన సొమ్ము మా జోబులోనిది కాదు)అన్నది…ఇక్కడి పాయింట్..
మా శంకరం దీనికి ఒక ఉపాయం చెప్పాడు…ఎంత అవినీతి జరిగిందో….వదిలేద్దాం….
ఈ మొత్తాన్ని రాష్ట్రం లో ప్రతీ ఒక్కరి నుండీ ఓ వెయ్యి లేదా ఓ ఐదు వేల రూపాయల వరకూ వసూలు చేయాలి…..
ఇప్పుడు సీన్ ఎలా ఉంటుందంటే…
వాళ్ళు తినేస్తే ..మేం ఎందుకు కట్టాలీ??
ఎవడి బాబు సొమ్ము తినేస్తారూ వాళ్ళు??కక్కించండీ..అని మన జనాలు ఉద్యమం చేసేస్తారా?చేస్తారు!!
చిల్లర లేక ఒక్క రూపాయి తక్కువిచ్చిన .. ఒక్క రూపాయి తక్కువిచ్చిన… బస్ కండక్టర్ కి గంట సేపు చుక్కలు చూపిచే జనాలు…(ఎందు కంటే ఆ రూపాయి మన జోబులోనిది కదా అన్న భాద)
తమ సొమ్ము కాదు అనుకుని ఎవడు తినలేదూ అని దబాయిస్తారేమో గానీ….
వాడు తిన్న దానికి మన జోబులో సొమ్ము కట్టాలీ అంటే…విప్లవాలు తీసుకురారూ??

కాబట్టి జరిగిన అవినీతిని లెక్క కట్టి …తిన్న వాడికి ఓటేసేసుకోమనీ.. …గవర్నమెంటుకు ఓ పదివేలు అవినీతి టాక్స్ గా… ప్రతీ ఒక్కరి నుంచీ…
ప్రతీ ఒక్కరి నుంచీ…అంటున్నాం ..
కట్టే ఏర్పాటు చేయాలనీ…
ఎందుకంటే….
ఎవడో… అవినీతి చేసి ఎంత బొక్కేసినా… మన పైసా కాదు కదా… అని …ఎవడు తినలేదూ అని సమర్ధించే వారి కోసం…
అప్పుడు ఎవడు తినలేదూ లాంటి పదాలు మాయమై పోతాయనీ మా శంకరం గాడి లెక్క…
ఎందు కంటే ఇప్పుడు వాడు తినేసిన ఆ రూపాయి మన జోబులోనిది కదా అన్న భాద …

(టాక్స్ పే చేసిన వాడికే అవినీతి జరిగినప్పుడు మన సొమ్ము తినేసారన్న భాద ఉంటుంది కాబట్టి..)
ఏ పార్టీ వాళ్ళు తిన్నాఇందులో మినహాయింపు లేదు!!!

ప్రకటనలు

4 Comments

 1. మంచి ఐడియా!

  “(వాళ్ళు తినేసిన సొమ్ము మా జోబులోనిది కాదు)”

  ఇది మాత్రం కొంతమంది ప్రజల అజ్ఞానమే. ఆదాయపు పన్ను కట్టేవాళ్ళు కొంతమందే అయినా, excise duty, VAT, service tax లాంటి అనేకానేక పన్నులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని వర్గాల ప్రజలూ కట్టాల్సిందే. మరి ఇది ఎవడి జేబులో సొమ్ము?

  మనం చేయగలిగింది ఒక్కటే. ఎవడు తక్కువ తిని, ఎక్కువ పని చేస్తాడో వాడికి ఓటు వెయ్యడం.

 2. అదర గొట్టేసారు బోనగిరీ…ఇక్కడ ఒక్క సవరణ..ఎక్కువ పని అన్నది…సంక్షేమ పధకాలు ఎక్కువ అని కాకుండా… ప్రొడక్టివ్ వర్క్ …ఎక్కువ చేసిన వాళ్ళకి..అని పెడదాం..
  ప్రజలకు మరింత ఆదాయం వచ్చే మార్గాలూ… పనులూ క్రియేట్ చేయాలి.. కానీ ముష్టి వేసే పధకాలు కాదు…ప్రతీ వాడూ నాలుగు డబ్బులు… ప్రభుత్వ ఖజానావే….పంచేసి దేముడయి పోతాడు అలా అయితే…
  @అనేకానేక పన్నులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని వర్గాల ప్రజలూ కట్టాల్సిందే.
  మీరు చెప్పింది ముమ్మాటికి నిజం….ప్రతీ వస్తువ పై టాక్స్ కడుతున్నాం అన్న స్పృహ జనాలకి లేదు మరి….ఎవడి సోమ్మో ..ఎవడో తినేస్తే మనకేంటి అనుకుంటున్నారు మరి..

 3. వెన్నెల గారూ… గందరగోళం గా వ్రాస్తానన్నారెవరో 🙂 స్పష్టం గా వ్రాయలేకపోయానా??
  ప్రజలకు అవినీతి గురించి తెలయదూ..అనటం లేదు నేను…కానీ దాని ఆమోదిస్తున్నరన్నదే మింగుడు పడని అంశం..అరవై నుంచి లక్ష కోట్లు మింగేసారన్నా, ఎవరు తినలేదూ అంటున్నారు.అంటే ప్రజా ధనాన్ని విచ్చల విడిగా దోచుకు తిన్నా …నాలుగు సంక్షేమ పధకాల వల్ల నాలుగు రూపాయలు మన కొచ్చాయి కదా …వాళ్ళు ఎంతయినా తిననీ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…
  ఒక ప్రక్క ఈ దారుణమైన దోపిడీ,మరో ప్రక్క సంక్షేమ పధకాలు ఈ రాష్ట్రాన్ని రెండవ స్థానం నుంచి ఎనిమిదో,తొమ్మిదో…ఆ స్థానం లోకి నెట్టాయంటున్నారు
  @ as long as he is given his share of goodies… ఈ పధకాలు లేకుంటే ఈ పాటికి చీల్చి చెండాడేద్దురు మన జనాలు ఈ అవినీతి పరుల్ని….

  అయితే ఏమిటి తినేస్తే నష్టం?..మరో టపాలో వివరిస్తా..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s