జనాలూ- భాతాఖానీ కబుర్లు!!


ఈ రోజు వేర్వేరు చోట్ల జనాలతో హస్కు వేసినప్పుడు తెలిసిన విషయాలు..
జనానికి జగన్ పై మోజు తగ్గింది…పూర్వమున్న ఊపు లెదు….
అప్పుడు ఏం చూసి ఎట్రాక్ట్ అయ్యారో?ఇప్పుడు ఎందుకు ఇంట్రస్ట్ తగ్గిందో అంటే…వెర్రి నవ్వులే సమాధనం…
టీడీపీ కి అనుకూల వాతావతా వరణం ఉన్నట్టు చెబుతున్నారు….
అయితే ఇప్పటి వరకూ ఉన్న టీడీపీ నాయకులు వేరే పార్టీల్లోకి మైగ్రేట్ అయిపోయారన్నది డిస్కష్న్…
జనాల్లో ఉన్న ఫేవరబుల్ వాతావరణం మండల స్థాయిలో గట్టి పరచగలిగాలి…హైకమాండ్ ఇది పట్టించుకుంటే..
టీడీపీకి అనుకూలంగా వాతావరణం పూర్తిగా మారే చాన్స్లు ఎక్కువంటున్నారు పల్లెల్లో జనం..
శ్రీలక్ష్మి గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు చదువుకున్న జనాల్లో ఆమె సానుభూతి కోల్పోయారన్నది స్పష్టం గా తెలుస్తుంది..
ఏరి కోరి చిత్తూరుకు ఎపాయింట్ మెంట్ ఇచ్చారట బాబు గారు..చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా టీడీపీ మంత్రుల మాట సిఫార్సుల్ని కూడా ఆమె తిరగ్గొట్టే వారట..
“దేముడు‘‘ ఆమెని మార్చాడనే అంటున్నారు…అదే సమయం లో దేముడు అప్పట్లో నవ్వే నవ్వులని ఇప్పుడు ఎనలైస్ చెసి ఎంత విషపూరితమైన నవ్వులవీ??అని చీకొట్టడం కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ నుంచి వినపడుతుంది..
ఆరోగ్య శ్రీ లో బాగా డబ్బున్న బాబులు కూడా సర్జరీలు చేయించుకోవడం టాక్సులు ఎక్కువ కట్టే జనాలు జీర్ణించ్కోలేక పోతున్నారు…
రోజుకు లక్షరూపాయ టర్నోవరున్న మూడు హోటళ్ల యజమాని పదకొండు లక్షల రూపాయాల కారులో వెళ్ళి…..
స్టార్ హాస్పటల్లో ఆరోగ్య శ్రీ కార్డుతో మేజర్ సర్జరీ ఫ్రీగా చేయించుకు రావడం ఒక ఉదాహరణ…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయో ఇలా?
రోడ్లు లేవు..కరంటు లేదు..నీళ్ళు లేవు…ప్రభుత్వ ఆసుపత్రులు పారాసిటిమాల్ బిళ్ళలు పంచే షాపుల్లా మారాయి…
సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రజా ధనం అంతా బూడిలో పోసిన పన్నీరు అవుతుందన్నది చాలా మందిని బాధిస్తున్న అంశం..

కొంతలో కొంత నయం ఏమిటంటే…మన ప్రక్క నున్న దేశాలు ఎంత అభివృద్ది చెందాయన్నది చాలా మందికి కనీసం కూడా తెలియకపోవడం..
టూరిస్టులుగా .. దుబాయ్..చైనా లాంటి దేశాలకెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం….మన నాయకుల మాట చెప్తే చాలు ఉమ్మేసేస్తున్నారు….ఈ దేశ రాజకీయ నాయకులు పనికి మాలిన వెధవలన్నది.. …ఆడా మగా … స్ట్రాంగ్ ఒపీనియన్ …

4 Comments

 1. నైస్ , చంద్రబాబు గారు ఇక తలక పోసుకొని రెడీ గా ఉంటే పోతుందేమో? ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి !!!!
  కింద లింక్ లో ఇండియా టుడే వాళ్ళు అసలు చంద్రబాబు పేరే మెన్షన్ చెయ్యలేదు. ఒక సారి వాళ్లకి కూడా ఈ విషయం చెప్పొచ్చుగా ,మీరు మరీ మొహమాటస్తులు. వాళ్ళు మళ్ళీ తిప్పి రాసుకుంటారు. గుడ్ జాబ్ అండీ ,కీప్ ఇట్ అప్ .

  http://indiatoday.intoday.in/story/the-great-ally-bazaar-upas-allies-for-assembly-elections-2014/1/260881.html

 2. @sridhar ….హా.హ్హా..హ్హా…మీరు సాక్షి చూడక పోవడం వల్ల లోకం లో ఏం జరుగుతుందో తెలియడం లేదు…సాక్షి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి…మేం కలిసేది పక్కా మాస్…ఎనిమిది నుంచి పది మండలాల నుండి వచ్చే జనాలన్తో పిచ్చా పాటీ ఉంటుంది ప్రతీ రోజూ…..
  మేం మాట్లాడేది…వంద రూపాయలు…బిర్యానీ పేకెట్ చేతిలో పెడితే లారీ ఎక్కి ఆ పూటకి ఆపార్టీకి జై కొట్టే టైపు వాళ్ళ తో…వీళ్ళు అన్ని పార్టీల సభలకి ఎటెండ్ అవుతారు…వీళ్ళకి నేషనల్ మీడియా అంత
  నాలెడ్జ్ ఉండదు…మాకు లానే..🙂
  పీపుల్ పల్స్ పై వాళ్ళకి ఐడియా ఉంటుంది….వేవ్ ని ఓట్ల గా మార్చుకోవడం అధిష్టానం దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకూ పకడ్బందీ గా చేసుకోవలసిన వ్యవహారం…..

  ముఖ్యం గా పల్లెల్లో జనం ఎటు మొగ్గు చూపుతున్నారన్న విషయం అయోమయం గా ఉంది అన్ని పార్టీలకీ..అన్నది వాళ్ళ విశ్లేణష..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s