నానే గొప్ప..మీరు పనికి మాలినోల్లు…


కొన్ని విషయాల్లో మాత్రం నెట్ హేపీనే..కరెంట్ బిల్లూ..ఫోన్ బిల్లూ…సెల్ ఫోన్  రీచార్జ్ లూ హేపీగా ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు..
చిరాగ్గా ఉంటే ఓ అర గంట బ్లాగ్ లో ఫేస్ బుక్కో చూసుకుంటె సరి…రిక్క తగ్గుద్ది,,,అన్నాను నేను..
సార్ ఇప్పుడు సెల్ల్ నుంచి కూడా నెట్ లోకి వెళ్ళి రీచార్జులూ..బాంక్ బేలన్సులూ చూస్కోవచ్చు..గాస్ కూడా సెల్ నుంచే బుక్ చేసుకుంటున్నాం ఇప్పుడు.. అన్నాడు మా శంకర్రావు..
శాంసంగ్ గెలాక్సీ కొత్తది అయితే ..ఇంకా బావుంది..కొత్త కొత్త సాఫ్ట్వేర్ లతో…మార్కెట్ లో మంచి సెల్ల్ ఫోన్ లు వస్తున్నాయి కదా అన్నా నేను..
ఇది వింటున్న మా పెద్దరాయుడు లేస్తూ..అవన్నీ ఏ పని పాటా లెని వాళ్ళకండీ…కాళీగా కూర్చుని ఇలాంటి వన్నీ చూస్తుంటారు…అన్నాడు నిష్క్రమిస్తూ అక్కడి నుండి..
నాకు మామూలుగానే తిక్క …
నాకంటే మా శంకర్రావుకి తిక్క మరీ ఎక్కువ….
దాంతో చిరాగ్గా..
“ఏమిటో ఈయన పెద్ద బిజీ మనిషిననుకుంటాడు…పదిహేనేళ్ళ నుండీ చూస్తున్నా…ఉదయం ఏడుకి బయలు దేరి అర్ధ రాత్రి ఒంటి గంటకో రెండుకో వెళ్తాడు ఇంటికి…
ఆరేడు గంటల్లో అయ్యే పనిని …రోజంతా సాగతీస్తూ పద్దెనిమిది గంటలు పాటు చేస్తూ…నేను చాలా బిజీ అనుకుంటూ మురిసిపోతాడు.
ఈయన తో చేస్తున్న మిగతా టీం అంతా నరకం చూస్తున్నారు..నిజంగా వర్క్ ఉంటె కాదనరు ఎవరూ..కానీ రెండు గంటల్లో అయ్యే పనిని నాలుగ్గంటలు సాగతీసి అందరినీ చావ దొబ్బుతాడు..
ఈయన ఇంటికి వెళ్ళడు..మిగతా వాళ్ళనీ వెళ్ళనివ్వడు..
బాంక్ నుంచి వచ్చిన మెసేజ్ ని కూడా సెల్లో చూడ్డం రాదు..ఓ మెసేజ్ పెట్టటం రాదూ..
నూతిలో కప్పలా తనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటాడు…
నెట్ చూసే వాళ్లందరూ పనీ పాటా లేనోళ్ళనీ..కష్ట పడరనీ..సోమరిపోతులన్నట్లు మాట్లాడుతాడు…
ఆయనకు చేత కాక పోతే గమ్మున ఉండాలి కానీ మిగతా వాళ్ళందర్నీ పనికి మాలినోళ్ళు అనుకో వడం తప్పు కదండీ  సార్..ఈయన పద్ధతుల్తో ఇంట్లో వాళ్లు ఎప్పుడొ పిచ్చాళ్ళు అయిపోయారట.. నేనే పెద్ద పుడింగిని అనుకుంటాడు ఈయన….“అన్నాడు..
“చూడు శంకర్రావు ..మనోళ్ళకు ఈ..గోలు ఎక్కువయ్యా..మనకు   చేత కానిది..  అవతలి వాడికి వచ్చు అన్న ఫీలింగ్ బరించలెక..వాళ్లందరూ పనికి మాలిన వాళ్ళు..పని పాటా లేని వాళ్ళు అనేసి.. ఓదార్చు కుంటారు….ఊర్కో“..అన్నా నెను..

ప్రకటనలు

3 Comments

  1. :)..”మనకు చేత కానిది.. అవతలి వాడికి వచ్చు అన్న ఫీలింగ్ బరించలెక..వాళ్లందరూ పనికి మాలిన వాళ్ళు..పని పాటా లేని వాళ్ళు అనేసి.. ఓదార్చు కుంటారు” yep!! అంతే అంతే!

  2. @ అనామకం శాయి గారూ.. అంత సీన్ లేదు కాబట్టే మా వాళ్లకు అంత మంట..రెండోది ఈ రోజు పేపర్ చదివారా సార్ అంటే..ఆ మన కంత కాళీ ఎక్కడండీ అంటాడు…పేపర్ చదివే వాళ్లంతా పని పాటా లేని వాళ్ళు తానే పెద్ద బిజీ స్టార్ అన్నట్టూ..బిజీ గా ఉన్నానని కని పించడానికి ప్రతీ పనీ గంటలు గంటలు సాగ తీస్తాడు ఆయన…అర్ధరాత్రి వరకూ ఆయనకు కాళీ ఉండదు..అని అందరూ అనుకోవాలన్నది ఆయన తపన..
    అయితే వచ్చిన చిక్కల్లా..మిగతా వాళ్ళను వెక్కిరించిన పుడే వస్తుంది..కనీసం మెసేజ్ పెట్ట లేని ఆయన గారు..అన్ని విషయాల్లో మహా తెలివైన వాడిని అనుకుంటూ…పదే పదే.. స్మార్ట్ ఫోన్ల ను కొత్త టెక్నాలజీ వాడే వాళ్ళను విమర్శించడం…
    ఏమీ పనీ పాటా లేని వాళ్ళే అలాంటి వన్నీ వాడతారు అనడం..చిరాకు అనిపిస్తుంది…ఇది ప్రతీ రోజూ మాకు మామూలే..కాక పోతె ఆయన పక్కకి వెళ్లి నవ్వు కుంటారు టీమ్ వాళ్ళు.. ఆ కామెంట్లు వ్రాస్తే పెద్ద జోక్స్ బుక్ అవుతుంది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s