నాకు నచ్చింది ఈ పోస్ట్…


వనజ వనమాలి గారి బ్లాగ్ నుండి…
గురువారం 9 జూన్ 2011

మత మౌడ్యం,కుల మౌడ్యం,దురభిమానం..కళ్ళకు కమ్మిన మైకం.
అభిమానం అనేది వెర్రి తలలు వేస్తే మెదడు..ఆలోచించడం ఎందుకు మానేస్తుందో.. నాకు అర్ధమైన సందర్భం ఒకటి.. చెప్పదలచాను.. ఎక్కడైనా ఏమో..నాకు తెలియదు కానీ.. విజయవాడలో చదువుకునే పిల్లలకి చాల మందికి కమ్యూనిటీ పిచ్చి..బాగానే ఉంటుంది.. అది అంతా పిల్లలకి మనసు సరిగా వికశించని దశలో అయితే.. పెద్దలు అర్ధమయ్యే రీతిలో పిల్లలకి చెప్పి వారి మనసుకి కమ్మిన మబ్బుల ని పారద్రోలవచ్చు. కానీ వాళ్ళు..డిగ్రీ స్తాయిలో చదివే పిల్లలే! వారితో మనం వాదించగలమా ? నేను ఇలాగే ఒకసారి మా అబ్బాయి నుండి చాలా తీవ్రమైన..ఒత్తిడిని ఎదుర్కొన్నాను .

అసలు.. ఎనిమిది,తొమ్మిది తరగతులు..చదివేటప్పుడే.. పిల్లలు కమ్యూనిటీల వారిగా గ్రూప్లు కడతారని తెలిసి నేను ఆశ్చర్య పోయాను. మా అబ్బాయి.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివేటప్పుడే కొంతమంది పిల్లలతో కలసి గ్రూప్ గా ఉండేవారు. వీళ్ళది..”సి” కమ్యూనిటీ. అంటే..మీదికాదా?అని సందేహించకండి. నాకు అలాటివి నచ్చవు కనుక.. అలా అన్నాను. పిల్లలలో ఇలాటి గ్తూప్ లని ప్రోత్శ హించేది గురువులే అంటే ఆశ్చర్య పడనవసరం లేదు కూడా..!! ఈ..”సి” అనేవాళ్ళు..వేరేవాళ్ళతో గొడవపడి స్కూల్ బయట కొట్టుకున్నారు.విషయం తెలిసాకా.. తప్పు ఎవరిదైనా మా అబ్బాయి ఫ్రెండ్స్ తల్లిదండ్రులు.. మేము కలసి పిల్లలకి..తెలియకుండా మాట్లాడుకుని ఇంటర్మీడియట్ లో.. అందరిని కలవనీయకుండా వేరు వేరు కాలేజెస్ లో జాయిన్ చేసాం. అయినా అక్కడా.. అలాటి..గ్రూప్సే !

పిల్లలతో వాదిస్తే ఎడ్డెం అంటే తెడ్డం అంటారని.. ఎదిఎదగని వారి మనసులని కలుషితం కాకుండా ఉండాలని మౌనం వహించి ఊరుకున్నాం. అంటరానితనం నేరం అని పాట్య పుస్తకాలలో..వెనుక పేజీపై వేసి..మరీ.. చూపిస్తున్నారు.అది చూసి అయినా నేర్చుకోండి.. మనుషులు లో భేదాలు వద్దనే కదా.. అంటే..”అది..మీ కాలం అప్పుడు.. ఇప్పుడు కాదు.. ఎవరి కమ్యునిటీ వారికి కావాలి మీకేం తెలియదు..మీరు ఊర్కోండి.”.అని.. అనడం కద్దు . రోజు..ఇలాటి వాదనలతో..తల బొప్పికట్టడం అటుంచి ఏం గొడవలు కొని తెచ్చుకుంటారో..అని భయం. ఎలాగోలా ఇంటర్ మీడియట్ హాస్టల్ చదువు కనుక గొడవలు లేకుండా పూర్తి అయింది.కొంత మంది నాన్..సి.లతో..మా అబ్బాయి..ఫ్రెండ్ షిప్ చేశాక హమ్మయ్య అనుకున్నాను..

తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్ లో మళ్లీ మొదలు.
విజయవాడ లోనే.. “సి” గ్రూప్ కి..ప్రత్యేకమైన కళాశాలలో.. మా అబ్బాయి చదవడం మళ్ళీ..అక్కడా..కమ్యూనిటి ల పిచ్చి మొదలయింది. నేను అనుక్షణం భయపడుతూ..ఉండేదాన్ని. ఒక రోజు మా అబ్బాయికి గట్టిగా వార్నింగ్..ఇచ్చాను. బుద్ధిగా చదువుకునే వాళ్లకి ఇలాటివి పట్టవు..కాలక్షేపపు చదువులు,పనిపాట లేని వారికే..ఈ..పిచ్చి. అలాటి వాటిల్లో తలదూర్చావు అంటే..ఊరుకోను అన్నాక.. కొంచెం ఆలోచించడం మొదలెట్టాడు. క్లాస్ లో అందరితో..కలవడం, మాట్లాడటం,వాళ్ళ ప్రక్కన కూర్చుని..లంచ్..చేయడం,ఫ్రెండ్ షిప్ చేయడం ఇలాటివి చేస్తుండటం తో.. “సి” కమ్యూనిటీ వాళ్ళందరు.. మన కమ్యూనిటీ పరువు తీస్తున్నావు..అని మా అబ్బాయిని..వేలివేశారట. ఆ విషయం చెప్పి భాధపడినప్పుడు.. తనకి ఏది బాగుందో..ఆలోచించుకోమని చెప్పాను. కమ్యూనిటీ పేరిట అధికారం చలాయించడం..అహంకారం ప్రదర్శించడం.. మిస్ బిహేవియర్..ఆడపిల్లని ఏడిపించడం ఇవ్వన్నీ..గమనించి అవన్నీ నచ్చక తనే దూరం జరిగి తనకి నచ్చినవాళ్ళతో .. స్నేహం చేయడం ప్రాంభించాడు. అయితే అంతర్లీనంగా.. మా అబ్బాయికి.. కమ్యూనిటి పిచ్చి..ఉంది. “సి” పార్టీల పేరిట వేలకి వేలు తగలెయ్యడం, మళ్ళీ కమ్యూనిటిల్లోనే ..పేద, బైక్ ల,కార్ల కేటగిరీ లు.. బేదాలు,వాదాలు అన్నీఅక్కడే..!! వాటికి..సాక్ష్యాలు కళాశాలలే! .. ..

సిని హీరోల అభిమాన సంఘాలు.. వారి చిత్రాల విడుదలప్పుడు..చేసే హంగామా..కొన్ని అల్లాగే ఉన్నాయి..
మనిషి లో.. కుల మౌడ్యం అయితే మరీ పెరుకోలేదు కదా..అని ఊరుకునేదాన్ని నేను.. చిరంజీవి గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ ,కష్టపడి పట్టుదలతో ఒక రేంజ్ కి చేరుకోవడం,నటన ..డాన్స్ ..అన్నీ ఇష్టం. చిరంజీవి.పాటలు ఇంట్లో..వినవడితే టక్కున టి.వి.అయినా రేడియో..అయినా ఆఫ్..చేయడం, నాపై..చిర్రు బుర్రులాడటం.. “సిగ్గుండాలి.. మన వాళ్ళు కాని వారిని.. ఇష్టపడటానికి” అని అంటూ ఉండేవాడు.. నాకు..విపరీత మైన కోపం వచ్చేది.. అయినా..శాంతం శాంతం..అనుకుని..తమాయించుకునేదాన్ని.

ఒక రోజు..చాలా సీరియస్గా కాలేజి నుంచి..ఇంటికి వచ్చి.. “అమ్మా!..నువ్వు చిరంజీవి గురించి..పొగడటం ఆపేస్తావా..లేదా! “అన్నాడు.. “ఏమైంది.. నాన్నా..” అన్నాను లాలనగా.. నువ్వు రేడియోలో.. లైవ్ ప్రోగ్రాం లో.. చిరంజీవిని పోగుడుతున్నావ్.. అది.. విన్న మా ఫ్రెండ్స్..నన్ను హేళన చేస్తున్నారు.. నువ్వు..ఇక్కడ.. నందమూరి వంశస్తులని..మోసుకోస్తావు..అక్కడ మీ..మమ్మీ..చిరజీవి..ఫ్యాన్..అట ..అని గేలి చేస్తారు..అన్నాడు. “అయితే ” అన్నాను..చాలా కూల్ గా. నువ్వు వెంటనే అలా పొగడటం మానేయాలి అన్నాడు. నేను..మళ్ళీ మౌనం..అప్పటికి ఆ గొడవ సర్దుమణిగింది. చిరంజీవికి..పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు..ఎఫ్.ఎమ్..లైవ్ ..లో..మాట్లాడినప్పుడు గొడవ అది. అదేమిటో..!? మా అబ్బాయి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ అందరు..రేడియో వినడం.. నేను..ఏం మాట్లాడానో.. చెప్పడం.. ఎక్కువైపోయింది..అప్పట్లో.
అమ్మో.. !ఈ పిల్లలలో.. ఇదెక్కడ దురభిమానం.. అనుకునేదాన్ని.

ఒక రోజు..ఒక క్లిష్ట సమస్య రానే వచ్చింది.. టి.వి..లో చిరంజీవి.. నటించిన సినిమా వస్తుంది.. మంచి బీట్ సాంగ్ కాబట్టి….వాల్యూం పెంచి అందులో.. లీనమై..ఆనందంతో తలమునకలై..ఉన్నాను. మా అబ్బాయి బయట నుండి వచ్చి.. “అమ్మా”నీకు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా వెంటనే..టివి.కట్టేయి..అన్నాడు..నాకు కోపం నాషాలాకి.. అంటింది. నీ మీద ఇష్టానికి.. చిరంజీవి సినిమా చూడటానికి..పోలిక ఏమిటి నాన్నా? ఇష్టాలు-అభిరుచులు..అవి ఒకరి కోసం రావు మారవు.ఎవరి ఇష్టం వారిది..నువ్వు ఎప్పుడు..నన్ను ఈ విషయంలో బలవంతం చేయకు..అన్నాను.. అంతేనా ..?అన్నాడు..”అవును..అంతే.”. అన్నాను. తను విసురుగా వెళ్ళిపోయాడు. నా..ఆనందం అంతా..ఆవిరి అయిపోయింది. “ఏమిటి ఈ పిల్లాడు ఇలా తయారు అవుతున్నాడు..అచ్చు..వాళ్ళ నాన్నగారు..ఇంతే.. ఇంట్లోకి రాగానే టక్కున రేడియో..కట్టి పడేసేవారు.పేపర్ కానీ..పుస్తకం కానీ ఆయన లేనప్పుడే..చదవాలి.అంతా.. వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకొవాలంటే .ఎలా.? ఒకరు ఇష్ట పడినదాన్ని మనం ఇష్టపడాలి అంటే.. చచ్చేంత ప్రేమ అయినా..ఉండాలి.లేకపోతే.. మనకంటూ..ఒక సొంత ఇష్టం లేకుండా ఉండాలి,వ్యక్తిత్వం లేకుండా అయినా ఉండాలి..అని నా నిశ్చితాభిప్రాయం కూడా.
స్వతహాగా నేను.. మొండిదాన్ని కావడం మూలంగా.. ఆ అగ్ని అంత త్వరగా చల్లార లేదు. ఒక గంట తర్వాత మా అబ్బాయి దగ్గరకి..వెళ్లి కూర్చున్నాను. కదిలిస్తే కస్సు మంటున్నాడు. తను రెండు,మూడు సార్లు..కసురుకున్నా అక్కడే కూర్చుని.. తనకి..మంచిని..ఓపికగా భోదించడం ఎప్పుడూ..నా.పని.అలాగే ..కూర్చున్న నన్ను చూసి.. “చెప్పు” అన్నాడు. మళ్ళీ అడిగేదాక మాట్లాడ కూడదనుకుని బెట్టు చేశాను.” చెప్పమ్మా?” అన్నాడు..” ఏం చెప్పాలి?”నా ప్రశ్న.. “ఏదో..చెప్పాలనేగా వచ్చావు..” అన్నాడు. ఇప్పుడు.. దొరికాడు.. ఇక చెప్పింది వింటాడు అని నమ్మకం కుదిరి అప్పుడు..మొదలెట్టాను..

చిన్నీ! మన ఇంట్లో.. స్టీరియో రికార్డర్..ఎప్పుడు.. కొన్నాం?.అడిగాను.నాన్న గారు..శబరిమలై ..వెళ్ళినప్పుడు..అన్నాడు.. (ఆ వస్తువుని.. నేను నా కొడుకు వెళ్లి కొనుక్కోచ్చాం. )ఎందుకు అప్పుడే కొన్నాం.. నాన్నగారు ఉన్నప్పుడు.. ఎందుకు కొనలేదు అంటే ఆయనకీ..ఇష్టం ఉండదు కనుక. ఆయనకీ ఇష్టం లేదని..మనం ఆయన కోసం మనం పాటలు వినాలి అనే ఇష్టం ని చంపుకున్నామా..?లేదు కదా? అలాగే ఇంకో..విషయం .ఎంతో.. ప్రేస్టేజేస్ వి.ఆర్.ఎస్.సి.లో..నీకు..సి.ఎస్.ఈ లో సీట్ వస్తే.. నాకు “సి”..అంటే ఇష్టం లేదంటే..ఆ బ్రాంచ్ లోనే జాయిన్ అవమని బలవంత పెట్టానా..? అప్పుడు లక్షలకి..లక్షలు పోసి కొందామన్న ఎవరికి రాని..సీట్ ని ..నువ్వు వద్దనుకుని నీకు ఆ సబ్జక్ట్ పై..ఇష్టం లేదని వేరే బ్రాంచ్ ఎన్నుకున్నప్పుడు.. నేను నిన్ను ఆ బ్రాంచే తీసుకోమని..బలవంత పెట్టానా..! లేదు కదా? అన్నాను.. అయితే..ఏమిటట..?అని మొండిగా వాదించడం మొదలెట్టాడు.. ఇక లాభం లేదు సీరియస్ గా క్లాస్స్ తీసుకున్నాను.

ప్రతి మనిషికి..ఇష్టా ఇష్టాలు..ఉంటాయి.వాటిని మన కోసం మార్చుకోమని అడగ కూడదు.. నన్నే కాదు..ఎవరిని కూడా.. రేపు నీకు పెళ్లి అయితే భార్య వస్తుంది..ఆమెని కూడా..ఇలా ఆజ్ఞాపించకూడదు.. నీకు నచ్చని ఇష్టం లేని విషయాన్నీఎందుకు ఇతరలుకి..నచ్చకూడ ధో అని నువ్వు చెప్పలేవు కదా!నీకు ఎలాటి ఇష్టాలయితే ఉంటాయో..ఇతరులకి..అలాగే ఇష్టాలు..అభిప్రాయాలు ఉంటాయి. నీకు నచ్చకపోతే మౌనంగా ఉండు. అంతే కానీ.. వాళ్ళని.హోల్డ్ చేయాలనుకోవడం చాలా తప్పు.. అలాగే ..బ్లాక్మైలింగ్..కూడా.నీకన్న నాకు చిరంజీవి అంటే.. ఇష్టం అని..అంటే నువ్వు జీర్ణం చేసుకోలేవు.నేను అలా అనలేను కూడా ..అన్నాను. మా అబ్బాయి సైలెంట్ గా..ఉండిపోయాడు. తర్వాత ఎప్పుడు..మా అబ్బాయి..అలా మాట్లాడలేదు..కూడా. తర్వాత కొన్నాళ్ళకి.. చిరంజీవి హిట్ సాంగ్స్ అన్నీ..డౌన్లోడ్ చేసి నాకు..మెమరి కార్డు లోకి..సేవ్ చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యేటప్పటికి తనకి.. ఏది మంచో ఏది చెడో..ఆలోచించే..జ్ఞానం అబ్బినందుకు నాకు..చాలా సంతోషం వేసింది. ఇప్పుడు..మా బంగారు కొండ నిజంగా..బంగారు కొండే!!

కమ్యూనిటి ల పిచ్చిలో అభిమాన హీరోల పిచ్చిలో..పడి రియలైజ్ కాలేని..పిల్లల్లో..ఒకప్పటి..నా కొడుకే కనపడతాడు నాకు.వాళ్లకి.. ఏది..సబబో..చెపుతూనే ఉంటాను నేను.
మత మౌడ్యం,కుల మౌడ్యం,దురభిమానం కళ్ళకు కమ్మిన మైకం లాటిదని..నా అభిప్రాయం. అది మనుషుల నుండి వారిని..విడదీస్తుంది.

link:

blog-post_09.html

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s