మీకు వ్యసనం-ఇంటర్ నెట్???


ఇంట్లో మూడు సెల్ ఫోన్లకీ నెట్ కనక్షన్ ఉంది..
ఎక్కువగా బయటే ఉంటాం కాబట్టీ..-8-10 గంటల కరెంట్ కోత వల్ల డెస్క్ టాప్ వాడడ కుదరదు కాబట్టీ…
మరోటి భోజనం చేస్తున్నపుడు కూడా సెల్ లో నెట్ చూసుకోవచ్చు ..
ఇంకో విషయం ఒక లాప్ టాప్ ఉంది…దానికి…ఐడియా నెట్ సెట్టెర్ కాబోలు కనక్షన్ ..వైర్ లెస్స్ ఉంది…
ఇరవై నాలుగు గంటలూ నెట్ ఉండాలన్న మాట….addiction???
ఇప్పుడు చూడండి ఆంద్రజ్యోతి లో నిన్న ప్రచురితమైన న్యూస్ ఆర్టికల్…

కనెక్షన్ ఎడిక్షన్.. ఎనిమిదో వ్యసనం
పెరిగిపోతున్న డిజిటల్ కల్చర్
మితిమీరుతున్న నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం
మానసిక సమస్యల పెనుముప్పు
హైదరాబాద్, జూలై 18 : రాహుల్.. మొబైల్ ఫోన్ ‘రింగ్’తో నిద్ర లేచాడు. ఫోన్ చూసుకుంటే.. ప్రియా నుంచి ఎంఎంఎస్ వచ్చింది! నెట్‌బుక్ ఓపెన్ చేసి ఇన్‌బాక్స్‌లోకి లాగిన్ అయ్యాడు. ప్రియా పంపిన ఎంఎంఎస్ చూసుకుని, డౌన్‌లోడ్ చేసుకున్నాడు. దాన్ని కాశ్యప్‌కి ఫార్వర్డ్ చేశాడు. ఇంకేమైనా కొత్త మెసేజ్‌లు వచ్చాయేమో చెక్ చేసుకున్నాడు. మిస్‌డ్‌కాల్స్ చూసుకున్నాడు. పబ్‌లో నిన్నటి పార్టీ ఫొటోలను ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ చేశాడు. ట్విట్టర్ అకౌంట్‌లోకి లాగిన్ అయి స్టేటస్ అప్‌డేట్ పెట్టాడు.

..పైన చెప్పిన వాక్యంలో దాదాపు 20 ఇంగ్లిష్ పదాలు, అన్నీ కొత్తతరం టెక్నాలజీకి సంబంధించినవే. ఆ పదాల అర్థం అర్థం కానివారెవరైనా ఉంటే ఈ లోకంలో వారికన్నా అదృష్టవంతులెవరూ ఉండరు. దురదృష్టకరమేంటంటే.. రాహుల్ కేవలం ఒక వ్యక్తి కాదు. ఇంటర్‌నెట్‌గత జీవులైన నేటి యువతరానికి అచ్చమైన ప్రతినిధి. మనలో చాలా మంది మరీ ఇంతలా కాకపోయినా కనీసం టెక్నాలజీ మాయాజాలంలో చిక్కుకున్నవారమే.

స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ, నెట్‌బుక్, స్మార్ట్ టీవీ.. అదీ ఇదీ అని లేదు.. టెక్నాలజీ మన నట్టింట్లోకి పూర్తిగా చొచ్చుకొచ్చేసింది. “సమాజానికి అనుక్షణం కనెక్ట్ అయి ఉండాలి” అనుకోవడం వ్యసనంగా మారి విశ్వరూపం చూపిస్తోంది. వ్యసనాలు ఏడు అంటారుగానీ.. ఇది ఎనిమిదో వ్యసనం.. అనుక్షణం ఇతరులతో కనెక్ట్ అయి ఉండాలనుకోవడం.. దీనిపేరే కనెక్షన్ ఎడిక్షన్! ఈ ఇటీవలికాలంలో పరాకాష్టకు చేరకున్న ఈ అష్టమ వ్యసనం.. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్, రియాక్టివ్ సైకోసిస్ లాంటి మానసిక వ్యాధులకు ప్రధాన కారణమవుతోంది.

ఐఫోన్‌తో మొదలు..
ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించిన స్మార్ట్‌ఫోన్ సంస్కృతి ఐఫోన్‌తో ప్రారంభమైందనుకుంటే.. ఆ విప్లవం మొదలై కేవలం ఐదేళ్లే! ఇంత తక్కువ సమయంలోనే స్మార్ట్‌ఫోన్ల, ఫోన్‌లో నెట్ వినియోగం విస్తృతంగా వ్యాపించింది. టచ్ స్క్రీన్ వల్ల మెసేజింగ్ సులభతరం కావడంతో చాటింగ్ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి వ్యక్తి నెలలో సగటున 400 ఎస్సెమ్మెస్‌లు అందుకోవడం గానీ, పంపడంగానీ సాధారణమైపోయింది. 2007లో ఈ సంఖ్య కేవలం వంద మాత్రమే. టీనేజర్లనే తీసుకుంటే.. నెలకు సగటున 3,700మెసేజ్‌లను పంపించుకుంటున్నారు.

ఎలక్ట్రానిక్ కొకైన్
‘సెమెల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ న్యూరో సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ డైరెక్టర్ పీటర్ వైబ్రో.. కంప్యూటర్‌ను ఎలక్ట్రానిక్ కొకైన్‌గా అభివర్ణిస్తారు. అలాగే.. మానవ మస్తిష్కంపై ఇంటర్‌నెట్ ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తూ నికొలాస్ కార్ అనే రచయిత ‘షాలోస్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఇంటర్‌నెట్ మనలో ఆధారపడేతత్వాన్ని, ఒత్తిడిని పెంచుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యక్తుల్లో మానసిక సమస్యలపై విడుదల చేసే ‘డయాగ్నస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మ్యాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్’ తదుపరి సంచికలో.. ఇంటర్‌నెట్ ఎడిక్షన్ డిజార్డర్‌ను కూడా చేర్చబోతున్నారు.

మరోవైపు.. చైనా, తైవాన్, కొరియా దేశాలు నెట్ ఎడిక్షన్‌ను జాతీయ ఆరోగ్య సంక్షోభంగా భావించి యుద్ధప్రాతిపదికన దానికి చికిత్స చేసే చర్యలను చేపట్టడం గమనార్హం. నెట్ ఎడిక్షన్ నేరాలకూ దారితీయడం ఆందోళనకరం. ఉదాహరణకు, చైనాలో ఒక జంట.. ఆన్‌లైన్‌లో పిల్లాణ్ని పెంచే గేమ్‌లో నిమగ్నమై కన్నకొడుకును పట్టించుకోకపోవడంతో ఆ పిల్లాడు ఆకలికి అంగలార్చి చనిపోయాడు! టెక్ వ్యసనం పర్యవసానంగా జరుగుతున్న సరికొత్త నేరాలివి.

అన్‌ప్లగ్‌డ్.. కాదు!
యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ పరిశోధకులు ‘అన్‌ప్లగ్‌డ్’ పేరిట ఒక ప్రయోగం చేశారు. 200 మంది విద్యార్థులను ఎంచుకుని ఒక రోజు మొత్తం వారు నెట్‌ని, స్మార్ట్ ఫోన్లను వినియోగించకుండా చేశారు. ఆ సమయంలో వారి భావాలను ఒక డైరీలో నమోదు చేయమని కోరగా మెజారిటీ విద్యార్థులు తాము టెక్నాలజీకి ఎంతగా బానిసయ్యిందీ అప్పుడే గుర్తించినట్టు రాసుకున్నారు. ఐఫోన్ ఎడిక్షన్, ఫేస్‌బుక్ ఎడిక్షన్, ఇంకా… బ్లాగులు, ట్విట్టర్ వాడకం.. కూడా ఒకరకమైన వ్యసనం కిందికే వస్తుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రౌజింగ్‌కు బానిసలు కావడం వల్ల అదే లోకంగా మారి నిజజీవితంలో స్నేహితులు దూరమవుతారు. తద్వారా ఒంటరితనం ఆవరిస్తుంది. అది క్రమేపీ అనేక మానసిక సమస్యలకు దారితీస్తుంది. అందుకే.. రెండువైపులా పదును ఉన్న టెక్నాలజీని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మేలని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కోరి తెచ్చుకునే కష్టాలు
ఆత్మహత్యలు చేసుకోవడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్ వంటివన్నీ టెక్ ఎడిక్షన్ పరాకాష్ఠకు చేరాక సంభవించే పరిణామాలు. ఆ స్థాయికి తీసుకెళ్లడానికి ముందస్తుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో మచ్చుకు కొన్ని… రింగ్జైటీ: మనకి ఫోన్ రాకపోయినా.. రింగ్ అయినట్టుగా అనిపించి పదేపదే చూసుకునే అలవాటు. రింగ్ + యాంగ్జైటీ కలిపి రింగ్జైటీ అయిందన్నమాట.

బ్లాక్‌బెర్రైటిస్: స్మార్టు ఫోన్లలో వర్చువల్ కీబోర్డులు లేదా క్వెర్టీ కీబోర్డులు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని అదేపనిగా వాడటం వల్ల కొన్నేళ్ల తర్వాత మీ బొటనవేళ్లు మీకు సహకరించవు. దీన్నే బ్లాక్ బెర్రైటిస్ లేదా బ్లాక్‌బెర్రీ థంబ్ అంటారు.

టచ్‌స్క్రీన్ ఇల్యూజన్ సిండ్రోమ్: టచ్ స్క్రీన్ ఫోన్లు బాగా అలవాటైపోయిన తర్వాత చేతులు తెగ దురద పెడుతుంటాయి. టీవీ, డెస్క్‌టాప్ కంప్యూటర్.. ఇలా టచ్ స్క్రీన్ సదుపాయం లేనివాటిని కూడా అలాగే ఆపరేట్ చేయాలని చూస్తారు.

అన్‌కంట్రోలబుల్ స్టేటస్ చెకింగ్ డిజార్డర్: మెయిల్స్ ఏమైనా వచ్చాయేమో ఇన్ బాక్స్ చెక్ చేసుకోవాలని పదేపదే అనిపిస్తుంది. బ్లాగులోనో, ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఒక పోస్టు పెట్టినప్పుడు.. దానికి ఎవరైనా స్పందించారా లేదా మాటిమాటికీ చూసుకోవాలనిపిస్తుంది.

నోమో ఫోబియా: ఫోన్ పోతుందేమోనన్న భయం. అలా పోతే.. మిత్రుల కాంటాక్ట్ నెంబర్లు కోల్పోతామేమోనన్న దిగులు. నోన్యూమెసేజ్ డి ప్రెషన్: మిస్‌డ్‌కాల్స్ కోసమో, కొత్త మేసేజ్‌ల కోసమో మాటిమాటికీ చెక్ చేసుకోవడం.. అవి రాకపోతే తీవ్ర నిరాశా నిస్పృహలకు (నో న్యూ మెసేజ్ డిప్రెషన్) గురైపోవడం.

కంప్యూటరోగాలు!
టెక్ ఎడిక్షన్ వల్ల ఎలాంటి కొత్తకొత్త జబ్బులొస్తాయో నెటిజన్లు సరదాగా చర్చిస్తుంటారు. అందులో కొన్ని.. డాట్ ‘కోమా’, మెగాబైటిస్, కీ’స్ట్రోక్’, కంట్రోల్ ఆల్ట్ డిసీజ్, అబ్సెసివ్ కాంపిటీటివ్ డిజార్డర్, క్వార్కిలెప్సీ, ‘డెల్’స్ పాల్సీ..ఇలా చెప్పుకొంటూ పోతే ఈ చిట్టా చాంతాడంత.

-సెంట్రల్ డెస్క్

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s