సూరీడు సీబీఐ కి హ్యాండిచ్చాడు!


జగన్ కు బైల్ ఇవ్వకుండా,రాకుండా..దొరక్కుండా… పట్టాభి లాంటి నిప్పు లాంటి జడ్జీని కేసుల్లో ఇరికించి జడ్జీ లను భయ బ్రాంతులను చేసారనీ..
నా లాంటి సూడో ఇన్టలెక్చ్యువల్కి కూడా అర్ధ మయ్యేలా
నీతివంతమైన మీడియాల్లో చదివాం…ఎల్లో మీడియా ఎలాగూ వ్రాయదు లెండీ…
అయితే గియితే తేలుతున్న విషయాలు ఏమిటీ??

సూరీడు హ్యాండిచ్చాడు!
సీబీఐ ఎదుట మేళ్ల గుట్టు రట్టు
తర్వాత ఎదురు తిరిగిన వైఎస్ నీడ
హైదరాబాద్, జూలై 7 : జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐముందు నోరు విప్పిన వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగు అనుచరుడు సూరీడు.. తర్వాత వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి? వైఎస్‌ను ఏయే పారిశ్రామికవేత్తలు.. ఎప్పుడెప్పుడు.. కలుసుకున్నారు? ఎవరెవరు ‘మేళ్లు’ పొందారు? తదితర వివరాలను సీబీఐ ఎదుట పూసగుచ్చిన సూరీడు ఆ తర్వాత ఎదురు తిరగడానికి కారణం ఏమిటి? సీబీఐకి చెప్పిన విషయాలనే మేజిస్ట్రేట్ ఎదుట కూడా చెబుతానని హామీ ఇచ్చినా.. ఆ తర్వాత ఎందుకు స్పందించలేదు? పలుసార్లు సమన్లు జారీ అయినా వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న అంశాలివి.

‘సాక్షులను ప్రభావితం చేస్తారు. బెయిల్ ఇవ్వొద్దు’ అని వాదించే సీబీఐ.. జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తన వాదనకు బలమైన ఈ ఆధారాన్ని కోర్టుకు సమర్పించింది. తెరవెనుక ఏం జరిగి ఉంటుందో.. సూరీడు లాంటి సాక్షులు వెనక్కి తగ్గడానికి కారణాలేంటో న్యాయస్థానమే పరిశీలించాలని కోరింది. సీబీఐ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడమే కాదు.. బెయిల్ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కూడా. తన ఉత్తర్వుల్లో సూరీడు ఉదంతాన్ని హైకోర్టు స్పష్టంగా పేర్కొనడంతో తెర వెనుక కథ బయటపడింది.

బెయిల్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు పేర్కొన్న అంశాలివే!
నిందితునికి బెయిల్ ఇచ్చేముందు సాక్షులను అతను ప్రభావితం చేయగలడా అన్న అంశాన్ని పరిశీలించాలి. దర్యాప్తులో భాగంగా, సాక్షిగా సూరీడు వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. దర్యాప్తు సంస్థ ఎదుట ఏయే విషయాలను చెప్పానో వాటన్నింటినీ మేజిస్ట్రేట్ ముందు చెబుతానని సీబీఐకి సూరీడు వాగ్దానం చేశాడు. దీంతో, తన ఎదుట హాజరు కావాలంటూ ఏప్రిల్ 27న కోర్టు నుంచి సూరీడుకు సమన్లు జారీ అయ్యా యి. కానీ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు సూరీడు నిరాకరించాడు.

దీంతో, విచారణ మే 17, 19వ తేదీలకు వాయిదా పడినా.. కోర్టు జారీ చేసిన సమన్లను సీబీఐ సూరీడుకి అందించలేకపోయింది. సమన్లను తీసుకోవడానికి సూరీడు నిరాకరించాడని, తాను కోర్టులో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేనని చెప్పాడన్న విషయాన్ని కోర్టుకు సీబీఐ తెలియజేసింది. మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టుచేయగా, అందుకు రెండు రోజుల ముందే సూరీడుకు సంబంధించిన సమన్లు మరోసారి సీబీఐకి అందాయి. వాటిని తీసుకోవడానికి సూరీడు నిరాకరించడంతో ఈ సమన్లను సీబీఐ అధికారులు మే 30వ తేదీన కోర్టుకు తిప్పి పంపారు. ఈ కేసులో సూరీడు కీలక సాక్షి. సీబీఐ కార్యాలయానికి వచ్చి చెప్పిన విషయాలన్నిటినీ మేజిస్ట్రేట్ ఎదుట చెబుతానని అతడు హామీ ఇచ్చాడు. తర్వాత మాట మార్చాడు.

సాక్షులను ప్రభావితం చేస్తారనే అంశానికి సంబంధించి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా తీసుకోవాలని సీబీఐ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇతర సాక్షులను కూడా ఇలాగే ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. అందుకే, జగన్‌కు బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నాం. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయవచ్చని, హవాలా మార్గంలో కోట్లాది రూపాయల సొమ్ము జగన్‌కు సంబంధించిన కంపెనీల్లోకి వచ్చిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదన్న వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది.

(సాక్ష్యులను ఏ రేంజి లో ఈ బాచ్ బెదిరిస్తున్నారో??ఇక్కడ రౌడీ పనులు చేసి డిల్లీ లో నాటకా లేమిటో…హత విధీ!!)

ప్రకటనలు

3 Comments

 1. note: సీబీఐ కార్యాలయానికి వచ్చి చెప్పిన విషయాలన్నిటినీ మేజిస్ట్రేట్ ఎదుట చెబుతానని అతడు హామీ ఇచ్చాడు. తర్వాత మాట మార్చాడు.

  సాక్షులను ప్రభావితం చేస్తారనే అంశానికి సంబంధించి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా తీసుకోవాలని సీబీఐ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
  ఇతర సాక్షులను కూడా ఇలాగే ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది.
  అందుకే, జగన్‌కు బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నాం.
  కేసు తీవ్రత దృష్ట్యా
  నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయవచ్చని,
  హవాలా మార్గంలో కోట్లాది రూపాయల సొమ్ము జగన్‌కు సంబంధించిన కంపెనీల్లోకి వచ్చిందన్న
  ఆరోపణలపై
  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదన్న వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది.

 2. @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు…
  థాంక్సండీ….వ్యక్తిగతంగా వ్యక్తులు ఎవరిపైనా ఎటువంటి శతృత్వమూ.అసూయా ఈ బ్లాగర్ కు లేవు…కేవలమ్ అవినీతి ఈ దేశాన్ని అధోపాతాళానికి నెట్టేస్తూందన్న బాధతోనే వారి అవినీతి పనులనూ వాటిని సమర్ధించే వాళ్ళనూ తీవ్రంగా ఖండిస్తున్నాం…
  చూస్తున్నారుగా అవినీతిని కప్పి పుచ్చుకోడానికి సంక్షేమ పధకాలతో జనాల్ని మభ్య పెట్టి..దేవుళ్ళుగా వెలిగి పోతున్నారు..
  వీరి అవినీతికి ఐయ్యేఎస్స్ లు.మంత్రులూ,పారిశ్రామిక వేత్తలూ…చిన్నాచితకా కాదు నిమ్మగడ్డ ప్రసాద్ వంటి సక్సస్ ఫుల్ వ్యక్తులు కటకటాల వెనక నిలబడ్డారు….వాటే పిటీ…
  వేల కోట్ల దోపిడీ తప్పు కాదు ఆ మహొ తల్లికి…కానీ వాళ్ళ పై జరిగే విచారణ మాత్రం కుట్రట!!!వేదింపట…అంటే దోచేసుకున్నా… ఈ దేశ ప్రజలూ…కోర్టులూ దర్యాప్తు సంస్థలూ నోరుమూసుకుని కూర్చోవాలి….
  ముక్యంగా ప్రజలు గమనించాల్సిన విషయం……వేల కోట్ల రూపాయలను అక్రమ మార్గాల ద్వారా సంపాదించి, దొరికిపోతున్నామన్న భయం తో ఆ కుటుంబమ్ మొత్తం ఒక్కటై నిలచి తమ ఆస్తులను ఎలాగైనా నిలబెట్టుకోడానికి పడుతున్న తాపత్రయం..ఆస్తులను పోగొట్టుకుంటామేమో అన్న భయంతో ఆ కుటుంబమ్ మొత్తం ఆడా మగా అందరూ రోడ్ల పైకి వచ్చి…పోరాడుతున్నారు…
  మరి మన ప్రజలు ఏమి చేస్తున్నారు…అయిదొందలు ఫించను వచ్చిందన్న సంతొషమ్తో…ఓట్లు గుద్ది వస్తున్నాం ఆ కుటుంబానికి…
  మన కేస్ట్ వాడు గాబట్టి గుడ్డిగా సమర్ధిస్తున్నాం…..పచ్చ పార్టీ వాడు తినలేదా అని బుకాయిస్తున్నాం…..

  మేరా భారత్ మహాన్!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s