సీబీఐ మాన్యువల్లో ఏముందో చదవండి….అది అత్యున్నత దర్యాప్తు సంస్థ…సందేహమే లేదు..సమర్దులైన అధికారులు పుష్కలంగా ఉన్నారు..
దౌర్భాగ్యం కొద్దీ అధికారం లో ఉండే పిశాచ గణాల వల్లా…కుల గజ్జి గాళ్ళ వల్లా…దొంగే.. దొంగా దొంగా అని అరచే పద్ధతి అవలంబించే వెధవ నా రాజకీయ నాయకుల వల్లా స్వామి భక్తి పరాయుణు ల వల్లా …మచ్చ పడుతున్నది…బురదా..జల్ల బడుతున్నది…
సీబీఐ…
ఏది నిజమో ఏది అబద్దమో తెలియనీయకుండా…
ప్రజల్ని అయొమయం లోకి నెట్టేసి రాజకీయ లబ్ది పొందాలనుకునే నీచాతి నీచమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఆరంభమయ్యాక…
అన్నిటినీ బ్రష్టు పట్టించి …అబద్దానికి గొంతు పెద్దదని నిరూపణ అయ్యిపోయిన రోజులివ్వి….
సీబీఐ మాన్యువలు అంటూ …వేల కోట్లు నొక్కేసిన దొంగలు ….నీతులూ…సూక్తులూ…చెబుతుంటే నోళ్ళు వెళ్ళ బెట్టి వినే రోజులు దాపురించాయి…
అధికారులు…ఐయ్యేఎస్ లూ…మంత్రులూ…అందరినీ అవినీతి గోతిలో తోసేసి….
తన బిడ్డకు న్యాయం చేయమంటూ..ప్రధాన మంత్రినే కలసి …
ఆయన చేతిలో పెద్ద పూవు పెట్టి లోకాన్నంతా వెర్రి వాజమ్మలను చేసి…అయ్యో..తల్లీ నీకెంత శోకమ్ వచ్చింది తల్లీ అని మనమంతా…మ్చ్..మ్చ్..అని ..కళ్ళు చెమరుస్తూ…
సీబీఐ ని నరికి పోగులు పెట్టాలని పించే దిక్కుమాలిన రోజులు….
సీబీఐ మాన్యువల్లో ఏముందో చదవండి….

కేసు పురోగతి తెలుసుకోవడం ప్రజల హక్కు!
మీడియాతో సీబీఐ సమాచారం పంచుకోవచ్చు
దర్యాప్తు సంస్థ మాన్యువల్ చెబుతున్నదిదే!!
హైదరాబాద్, జూలై 7 : సీబీఐ.. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ. విమర్శల మాటెలా ఉన్నా.. ఎన్నో సంచలనాత్మక కేసులను ఓ కొలిక్కి తెచ్చిన ఘ నత దాని సొంతం. దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన వివరాలను, పురోగతిని, తాజా పరిణామాలను మీడియా ద్వా రా ప్రజలకు తెలియజేయడం దాని విధుల్లో ఒకటి. ప్రజా ప్రాముఖ్యం ఉన్న కేసుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని సీబీఐ మాన్యువల్ సైతం విస్పష్టంగా పేర్కొంటోంది! దర్యాప్తు వివరాలను మీడియాకు తెలపడంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను మాన్యువల్‌లో నిర్దుష్టంగా పే ర్కొన్నారు. సమాచారాన్ని ప్రజలకు తెల పాల్సిన ఆవశ్యకతను చెబుతూనే, తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ పొందుపరిచారు.

“సీబీఐ అనేది బహిరంగ సంస్థ కాదు. అలాగని రహస్య నిఘా సంస్థా కాదు. ప్రభుత్వానికి, కోర్టులకు, పార్లమెంటుకు, సీవీసీకి, ప్రజలకు, మీడియాకు జవాబుదారీగా ఉండాలి. తన దగ్గరున్న సమాచారాన్ని పంచుకోవడం ద్వారా అది ప్రెస్/మీడియాతో సం బంధాలు కొనసాగిస్తుంది. కాకపోతే.. కేసుల విచారణ, దర్యా ప్తులో రాజీ పడకుండా ఉండటం ముఖ్యం. అంటే మీడియాకు ఇచ్చే సమాచారంపై ముందుగా క్షుణ్నమైన పరిశీలన అవసరం. ప్రజాస్వామ్యంలో మీడియాకు నిర్దిష్టమైన పాత్ర ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజా ప్రాముఖ్యమున్న కేసులు, వాటి పురోగతిని తెలుసుకునే హక్కు ప్రజల కు ఉంది.

అదే సమయంలో అపరిప క్వ సమాచారం లేదా రహస్య దర్యా ప్తు, పరిశీలన కొనసాగుతున్న అంశాల పై పబ్లిసిటీ ఇవ్వడం సరికాదు. అలాం టి సమాచారాన్ని పరిహరించాలి” అని మాన్యువల్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే దర్యాప్తునకు ఆటంకం కలగని రీతిలో మీడియాకు సమాచారం ఇవ్వడం తప్పు కాదని స్పష్టమవుతోంది. పైగా ప్రెస్‌నోట్ రూపంలో మీడియాకు సమాచారం ఇవ్వాల్సి న సందర్భాలనూ నిర్దిష్టంగా పేర్కొన్నారు.

అవి.. 1) సోదాలు విజయవంతమైనప్పుడు, వల పన్ని పట్టుకున్నప్పుడు, కేసులు రిజిస్టర్ చేసినప్పుడు, ప్రాథమిక దర్యాప్తు నివేదిక పొందుపరచినప్పుడు, వాంటెడ్ క్రిమినల్స్‌ను అరెస్టు చేసినప్పుడు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు. 2) కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పుడు. 3) కోర్టులు దోష నిర్ధారణ చేసినప్పుడు, ముఖ్యంగా పెద్ద శిక్షలు పడినప్పుడు, భారీ జరిమానాలు విధించినప్పుడు. 4) ఉద్యోగుల డిస్మిస్ లేదా సర్వీసు నుంచి తొలగింపు వంటి శిక్షలు పడినప్పుడు. 5) డిపార్ట్‌మెంటల్ చర్య కోసం కేసును పంపినప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కేసులోని వివిధ కీలక దశలన్నింటిలోనూ, దర్యాప్తునకు ఆటంకం కాని సమాచారాన్ని మీడియాకు చెప్పవచ్చని స్పష్టమవుతోందన్న మాట!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s