ఎటు వైపు పోతున్నాం??


If good ethics always was good business, only stupid people would be unethical. The ugly truth is that sometimes ethical people lose and unethical people win. That’s why success is not a reliable measure of virtue
by MICHAEL JOSEPHSON

నా బ్లాగ్ చూసిన మా అబ్బాయ్,ఎందుకు డాడీ తలా తోకా లేకుండా కామేంట్ పెట్టే వాళ్ళను ఎంటర్టైన్ చేయడం…చూడు ఈ కామెంట్…ఇందులో అర్ధం పర్ధం ఉందా …పిచ్చి మాటలు తప్ప ..అన్నాడు
అవును…ఇక్కడ ఉన్న వారందరూ చదువుకున్న వాళ్ళే…అంతో ఇంతొ సమాజం మీదా, జరుగుతున్న పరిణామాల పట్లా అవగాహన ఉన్నవాళ్ళే…మంచి చెడూ గుర్తించ గలిగిన వాళ్ళే..అందరూ స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించాలనుకుంటామే గానీ..
ఉక్రోషంతో. ..హేళణ చేయడం..అసందర్బ వ్యాఖ్యలు,అడ్దగోలు వాదనలు.దూషణలకు దిగే గుంపు తయారవుతుందనుకోలేదు..అర్ధం పర్ధమ్ లేకుండా తలా తోకా లేకుండా కామేంట్ పెట్టే వాళ్ళను ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేక కొన్ని డిలీట్ చేయడం జరిగింది మొట్ట మొదటి సారిగా…
మేమేమీ జగన్ కి వ్యతిరేకమో మరోటో కాదు…వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ…
నలుగురితో పంచుకుంటున్నాం గానీ…
ఎవడు ఎంత తింటే మనకెమీ??
ఇంతకు ముందు ఇచ్చిన జవాబే మళ్ళీ చెబుతున్నా…

ఇక్కడ ఒక్క విషయం చెప్ప దల్చుకున్నాం…మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా..
అన్నాడొక మహోనుభావుడు..
దయచేసి…మంచిని మంచి గా చూద్దాం..తప్పుని తప్పుగా చూద్దాం..
అవినీతి ఎవరు చేసినా అవినీతే..బాబయినా..కిరణయినా…బీజేపీ అయినా ..రాజా అయినా..కనిమొళి అయినా…
ఇలా కులం పేరుతో విడిపోయి…తప్పుడు పనులు చేసే నాయకులను వెనకెసుకు వస్తే!!
ఇక ఈ దేశం లో అవినీతిని పూడ్చి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు…

జగన్ అవినీతి గురించి మాట్లాడితే, వాడు పచ్చ పార్టీనో లేక పోతె ఽఽ కులపోడో!!అని వాడి మీద ఒక స్టాంప్ వేసేసి,వాళ్ళను దుర్భాష లాడడం….వాళ్ల మాటలనో, కామెంట్లనో..ముందు చెప్పి నట్లు ,కోడిగుడ్డుకు కూడా ఈకలు పీకినట్టు పీకడమ్…
ఏమిటి జరుగుతుంది..ఎందుకిలా ప్రవర్తిస్తున్నాం…
పార్టీ ల ప్రతినిదులు సరే వాళ్ళ కడుపు కోసం..పదవుల కోసం…అనుకోవచ్చు…..
కానీ మనం కూడా ఇలా???
దయ చేసి వ్యక్తు ల కోసం తన్నుకో వద్దు..దేశమ్ కోసమ్ ఆరాట పడండి…

#comments

1 Comment

  1. సమాజం లో ప్రజలకు తమ సమాజం పట్ల ఇది తమది అని ఒక ఉమ్మడి భావం లేదు!!! మీ అవేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలిగే వారు లేకపోవడం పెద్ద వింతేమి కాదు. చూస్తూ ఉండడం తప్ప చెయ్యగలిగినది ఎమీ లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s