జేడీ వ్యవహోరం మొదటి నుండీ అనుమానమే!!! పార్ట్ 1జేడీ వ్యవహోరం మొదటి నుండీ అనుమానమే!!!
మహో నాయకుల పై కేసులు పెట్టి ,వారిని మానసికంగా హింసిస్తున్న జేడీ లక్ష్మీనారాయన ఒక పెద్ద సాడిస్టు…రాష్త్రమంతా తిరిగీ..ఎండనకా వాననకా శ్రమించీ, అధికారాన్ని సాదించి…నాలుగు గైదు వేల కోట్లు పోగెసుకుంటే,వాటిని అనుభవించనీయకుండా…జైల్లో పెట్టడం కుట్ర కాదా !!కాదని అనగలరా ఎవరైనా??
కాదంటే విడిచి పెట్టమనండి??
కేసులో ప్రజా ధనం దుర్వియోగమైనట్టు ఆదారాలు చూపించి ….సీబీఐ ను ఎంక్వయరీ చేయమనడం..కుట్ర కాదా??
అసలు జేడీ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకున్నట్టు??అయితే ఆయనకు సైట్ ఉన్నట్లే కదా??దీనితోనే మొత్తం తేటతెల్లమవుతూంది…జేడీ ఈ సైట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళ్తో కుమ్మాక్కై సంపాదించినవని…..అందుకే ఇప్పుడు జగన్ ను అరెస్ట్ చేసి కాంగ్రెస్ ఆడించినట్టు ఆడున్నారు…మరచి పోకండి, ప్రజలంతా గమనిస్తున్నారు…చదువుకుని ఆలోచించే వెధవాయిల్లా కాదు జనమ్…..చాలా మేధావులు..మీ భరతం పడతారు అవినీతి ని ఓడించి జగన్ను గెలిపిస్తారు!!! …
జేడీ ఇంట్లో కుక్క పిల్ల ఉన్నదా??అయితే అది ఇటలీ కి చెందినదే అయి ఉండవచ్చు…తామాడించినట్టు ఆడుతున్నందుకు…సోనియా ఇచ్చిన బహుమతి అది..
కుక్క పిల్ల లేదా??ఇది మరీ ఆలోచించాల్సిన విషయం!!ఇటలీ కుక్క పిల్ల ఇంట్లో ఉంటే తమ కున్న సంబందాలు ప్రజలకు తెలిసిపోతాయన్న భయం తో ఆయన కుక్క పిల్లను తీసుకోవడానికి నిరాకరించాడు!!
దీన్ని బట్టి కాంగ్రెస్ తో ఆయనకున్న సంబందాలు సుస్పష్టంగా బయట పడినట్టే! ఇంత కంటే మరేం కావాలి ఆయనకు కాంగ్రెస్ తో సంబందాలు ఉన్నయ్ అని నిరూపించదానికి???
ఆయన ఇంట్లో ఎంత మంది పని మనుషులున్నారు?అంతమందే ఎందుకుండాలి??లేదాఅంత మంది ఎందుకు ఉన్నారు?వాళ్ళంతా టీవీ చానెళ్ళ విలేఖరులే అని మా అనుమానం..వాళ్ల ద్వారా ఆయన రహస్యాలను లీక్ చేస్తున్నారు..
లేకుంటే ఆయనకు పని మనుషుల అవసరం ఏమేచ్చింది??
వచ్చిందే అనుకుందాం..ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఎందుకు పెట్టు కోవాలీ??నగరం లో వందలాది మంది పని మనుషులు ఉండగా?? వేరే వాళ్ళను పెట్టుకో వచ్చుగా??
(వేరే వాళ్ళనే పెట్టుకున్నారు అనుకోండి..ప్రశ్న ఇలా ఉంటుంది…వేరే వాళ్ళనే ఎందుకు పని లో ఎందుకు పెట్టుకున్నారు??ఇప్పుడు ఉన్న వాళ్ళను పెట్టుకోవచ్చుగా!!!)
సశేషం!!!!

ప్రకటనలు

16 Comments

 1. కొన్ని పత్రికలకే చెందిన క్రైమ్ రిపోర్టర్లకే ఫోన్లు చేస్తూ తాను తవ్వి పోసిన అవినీతిని గురించి రాత్రనక పగలనక విశదీకరించడానికి శ్రమిస్తున్న అధికారి గురించి ఎంత చెబితే సరిపోతుంది. మర్నాడు పొద్దున్నకోర్టులో హాజరవుతున్న మనిషిని ఆరాత్రే జైల్లో కూర్చోపెట్టి దేశాన్ని పెద్ద ఆపద నుంచి రక్షించిన వారిని మీరెంత పొగిడితే సరిపోతుంది?

 2. @ పంతులు గోపాలకృష్ణ ఎంత పొగిడినా సరిపోదు ఎందుకంటే తన ప్రాణాలకి తెగించిన మీ లాంటి వాళ్ళు పొంచి పోషించే నాయుకుల డబ్బు కట్టలకి ఆశ పడకుండా పని చేస్తున్నందుకు .
  ఇప్పుడు మీరు చెప్పండి పంచభూతాలు ని దోచుకుని ప్రజలకి బిచ్చేమేస్తున్న మీ నాయకులని ఎంత పొగడాలో.

 3. గొపల క్రిష్ణ గారికి నమస్తే.,మీరు ఏవీఎన్ విధ్యార్ది అని తెలిసి సంతోషం కలిగింది…
  అల్లూరి సీతారామరాజు లాంటి బిడ్డలు అక్కడ చదివారు.
  మీ వంటి వారు ఇలా స్పందిస్తారని ఊహించలేదు..నేను మొదటి నుండీ చెపుతున్నా, బాబు నో మరొకళ్లనో వెనకేసుకుని జగన్ ను దూషించడం కాదు…ఎవరు అవినీతికి పాల్పడినా చివరకు నష్టపోయేది ప్రజలే.ఈ దేశానికి,ప్రజలకు ఏమి తక్కువైందని హీనంగా బ్రతకవలసి వస్తూంది…నిజాయితీ గల పాలకులు లెకపోవడమే.బాబు పరిపాలన లో పచ్చచొక్కాల వాళ్ళు అడ్డూ అదుపూ లేకుండా ప్రజల సొమ్ము తిన్నరనే ఆరోపణలతోనే వాళ్లను గద్దె దింపారు ప్రజలు…ఇక్కడి విషయం వేరే అనుకోండి….ఇన్ని కళ్ళను కప్పి జేడీ లీక్ చేస్తాడని మనం అనుకోలేం..ఎప్పుడు దొరుకుతాడా అని భూతద్దం వేసుకుని జగన్ బాచ్ ..వాచ్ చేస్తున్నారని వాళ్ళకు తెలియదా??అల్లంటి అవకాసాన్ని ఒక తెలివైన ఆఫీసరు కల్పించడు…ఒక్కసారి చూడంది…ఆసుపత్రుల దగ్గర నుంచి కలక్టర్ వరకూ విలేఖరులు ఎలా సతాయిస్తూ ఉంటారో అధికారులను…
  పద్దతైన అధికారులు తమకు వచ్చిన కాల్స్ ను బిజీ గా ఉన్నపుడు వచ్చిన కాల్స్ కు తర్వాత జవాబిస్తామనీ…ఆ విధంగానె సమయం కలిగినప్పుడు ముందు కాల్ కు జవాబుగా స్పందిస్తారనీ పెద్ద పొజిషన్లో ముఖ్యంగా సబ్యత కలిగిన ఆఫీసర్లు ను చూసిన వారెవరైనా గ్రహించ వచ్చు…
  రాద్దాంతమ్ చేద్దామనుకునే వాళ్ళకు ఇవ్వన్నీ అనవసరం..
  ఒక సోషల్ వర్కరు ను పట్తుకుని ఓ చదువుకున్న ఆయన ఏమన్నాడో చూడండి…

  అమ్మా చంద్రబాల గారు !

  కేవలం ఒక తొక్కలో ప్రోగ్రామ్ కోసమే అయితే ఒక స్టింగర్ని సంప్రదిస్తే సరిపోతుంది – మించి పోతే జిల్లా రిపోర్టరుకు చెస్తే ఖతం. కాని దాని కవరేజి కోసం కేవలం మీడియా ఎం.డిలతోనే మాట్లాడాల్సిన పరిస్థితి/దుస్థితి ఎందుకు ఆవురించిందో చెప్పగలరా? ఇంకెంత మంది మీడియా ఎం.డిలతో మాట్లాడారో చెప్పగలరా?

  3.అమ్మా చంద్రబాల గారు !

  లక్ష్మినారాయణ సారు మీ క్లాస్ మెట్ అన్నారు , మీ ఫ్యేమిలి ఫ్రెండ్ అన్నారు. మరి మీతో మరెంతో మంది క్లాస్ మెట్స్ ఉంటారుకదా? వారిలో ఎంతమందికి ఇలా వందల కొలది కాల్స్ చేస్తుంటారు? అలానే సారు వారు మరెంత మంది క్లాస్ మెట్స్ కి ఇలా కాల్స్ చేస్తుంటారు?

  చూసే కొద్దీ ప్రతి విషయానికీ ,కోడిగుడ్డుకు కూడా ఈకలు పీక వచ్చు…ఆవిడ చానెల్ ముందుకు వచ్చి విషయం చెప్పాక కూడా…ఇంత హీనంగా దిగజారి పోతున్నారు..మన సమాజం లో…

  మరోటి చూడండి…అమ్మా చంద్రబాల గారు !
  మీ సంఘసేవకు జెడిగారు సాయం చేసేవారని చెప్పారు కదా? ఆ సాయాలు ఏవి? చేసిన వారెవరు? ఆ చేసినవారు లక్ష్మినారాయణ అనే వ్యక్తి సిఫార్సు చేస్తే సాయం చేసారా? లేక అతను అత్యున్నత దర్యాప్తు సంస్థ జె.డి అన్న కారణం చేత సాయం చేసారా? ఇది అధికార దుర్వినియోగం కాదా?

  లీడ్ అనే స్వచ్చంద సేవా సంస్థకు ..ఆమె పని చేస్తున్నారు….
  పై ప్రశ్న చూసారా??
  వీటన్నిటికీ కారణమేమిటి??
  ప్రభుత్వం లో జరిగిన అవినీతి వల్ల కొంత మంది వేల కోట్లరూపాయలు పోగేసుకున్నారన్న విషయమై జరుగుతున్న దర్యాప్తు పై …కడుపు మంటతో కొంత మంది మతిస్థిమితం కోల్పోయి చేస్తున్న వికారాలు …

  ఇక్కడ ఒక్క విషయం చెప్ప దల్చుకున్నాం…మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా..
  అన్నాడొక మహోనుభావుడు..
  దయచేసి…మంచిని మంచి గా చూద్దాం..తప్పుని తప్పుగా చూద్దాం..
  అవినీతి ఎవరు చేసినా అవినీతే..బాబయినా..కిరణయినా…బీజేపీ అయినా ..రాజా అయినా..కనిమొళి అయినా…
  ఇలా కులం పేరుతో విడిపోయి…తప్పుడు పనులు చేసే నాయకులను వెనకెసుకు వస్తే!!
  ఇక ఈ దేశం లో అవినీతిని పూడ్చి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు…
  జగన్ లాంటి ఒక యువ నాయకుడు తల్చు కుంటే ఈ దేశ తల రాతను మార్చ లేడా?కానీ ఆ యువ రక్తం చేయాల్సిన పనేనా అది??జీవోల తో సహో సాక్ష్యాదారాలు బయటకు వస్తే అవి భూతు పత్రికల కుట్ర!!!
  ఆయన్ను సమర్దించే వాళ్ళు కూడా…అందరూ తిన్నారు, ఈయనా తిన్నాడు తప్పేంటి అంటున్నారే… కానీ ఆయన నిజాయతీ పరుడని అనడం లేదు..
  తప్పుడు ప్రచారాలు,తప్పుడు మాటలు,తప్పుడు పనులూ.తప్పుడు సంపాధనా…ఇవి మన భరత జాతి లో విలీనమైపోయాయా?
  జగన్ అవినీతి గురించి మాట్లాడితే, వాడు పచ్చ పార్టీనో లేక పోతె ఽఽ కులపోడో!!అని వాడి మీద ఒక స్టాంప్ వేసేసి,వాళ్ళను దుర్భాష లాడడం….వాళ్ల మాటలనో, కామెంట్లనో..ముందు చెప్పి నట్లు ,కోడిగుడ్డుకు కూడా ఈకలు పీకినట్టు పీకడమ్…
  ఏమిటి జరుగుతుంది..ఎందుకిలా ప్రవర్తిస్తున్నాం…
  ్పార్టీ ల ప్రతినిదులు సరే వాళ్ళ కడుపు కోసం..పదవుల కోసం…అనుకోవచ్చు…..
  కానీ మనం కూడా ఇలా???
  దయ చేసి వ్యక్తు ల కోసం తన్నుకో వద్దు..దేశమ్ కోసమ్ ఆరాట పడండి…

 4. @Sharma
  జవాబివ్వకూడదనే అనుకున్నా….జగన్ జైలుకెళ్ళినంత మాత్రానా ఈ దేశమ్ లో అవినీతి తెర పడిపోయిందని ఎవరూ అనడం లేదు… జగనొక్కడే ఈ దేశంలో అవినీతి పరుడనీ అనడం లేదు!!కోడి గుడ్డు కి మాంచి ఈక పీకావ్… వెరీ గుడ్డూ!!!
  మీ ఆఖరి వాక్యం మాత్రం నూటికి నూరు పాళ్ళూ నిజం!!!
  hats off!

 5. తొందరపడి ఎవరూ ఒక conclusion కి రాకండి.
  ఈ కహానీలో ఇంకెన్ని ట్విస్టులున్నాయో?
  అసలే మన రాష్ట్ర రాజకీయాలు, మంచి యాక్షన్, క్రైం, మసాలా సినిమాలా సాగుతున్నాయి.

 6. Snkr గారు చాలా పొరపడ్డారు. నేను ఎవ్వరినీ సమర్థించ లేదు.జగన్ జైల్లో ఉన్నాడు.ఆయన విషయం విచారణ చేసి తగిన శిక్ష వేయాల్సినది కోర్టు. మనం ఉన్నది ఒక డెమోక్రసీలో. కోర్టుల తీర్పులనే శిరసావహించాలి.అంతవరకూ ఓపిక పట్టాలి.ఈ లోగా ఎవరైనా ఎటువంటి తీర్పులివ్వడం సరికాదు.నేను లక్ష్మీ నారాయణ గారిని శంకించడం లేదు. తాటిచెట్టుకింద పాలు తాగినా ప్రజలు అనుమానిస్తారని మీకు తెలుసుకదా? విచారణాదికారులు గాని న్యాయాదికారులు గాని నిష్పక్షపాతంగా ఉండటమే కాదు నిష్పక్షపాతంగా కనిపిస్తూ ఉండాలన్నది ( not only unbiased but looking unbiased ) అనేది ప్రాధమిక న్యాయసూత్రం. తనంత తానుగా ముద్దాయికి ప్రతికూలంగా పనిచేస్తున్నాయని తెలిసిన పత్రికల విలేఖరులతో పోన్ చేసి మాట్లాడడం ఏ విచారణాధికారికీ తగని పని. లక్ష్మీ నారాయణ గారి లాంటి అనుబవజ్ఞుడు తెలియక చేసిన పొరబాటు అనుకోవడానికి కూడా వీల్లేని విషయమిది.పోనీ తాను .వారితో అన్నిసార్లు ఏం మాట్లాడేరో అతడే వివరణ ఇస్తే బాగుండేది కదా? కోర్టు వారు కూడా జగన్ని అరెస్టు చేస్తారని మేం అనుకోవడం లేదని చెప్పిన తర్వాత, మరునాడు కోర్టులో హాజరవబోయే వ్యక్తిని 27 రాత్రి 8 గంటలకు అరెస్టు చేసి ఏమి సాధించారో జనానికి తెలియజేయ వచ్చుకదా? నాకు ఈ పోలిటిక్సులో ఎటువంటి interest గాని involvement గాని లేవు. అయితే న్యాయ విచారణ చాలా నిష్పక్షపాతంగా జరిగిందని ప్రజలకు అనిపించినప్పుడే ఆ విచారణకు దాని తదుపరి వచ్చే తీర్పుకూ విలువ ఉంటుంది.ఈ కేసు విషయంలో కారణాలు ఏమైనా కానీ నిష్పాక్షిక విచారణ జరుగుతోందని ప్రజలకు నమ్మకం కలగ లేదు.ఎవరెన్ని కబుర్లు చెప్పినా మొన్న ఎలక్షన్లలో ప్రజాగ్రహానికి ఇదే కారణం, వేరే కారణాలను చెప్పుకున్న వారు తమని తామే మోసగించుకుంటున్నారు. ఇది వారికే నష్టం. అవి నీతి ఎక్కడున్నా అంతమొందించాలని అందరం కోరుకుందాం కోర్టులు చేయాల్సిన పని మీడియా చేయడం. చాకలి వాని గాడిద కుక్క కథని గుర్తుకు తెస్తోంది .దీని వలన ఇప్పటికి మీడియాకు Short term gains ఏమైనా ఉండొచ్చు గాని మీడియా ఇప్పటికే తన respectabilityని కోల్పోయింది. మా చిన్నప్పుడు ఏ విషయమైనా పేపర్లో పడితే అది నిజమని జనం అదరూ నమ్మే వారు. ఇవాళ ఏ పేపరు నిజం రాసినా అది ఫలానా కులం వారి పేపరుకదా వేరేం రాస్తుందిలే అని పెదవి విరుస్తున్నారు.ఈరోజు జర్నలిస్టులంటే ఎవరికీ గౌరవం లేదు. అయితే కొద్దిమంది నిజాయితీ
  పరులైన జర్నలిస్టులు ఇందువలన బాధ పడవలసి రావడం నేటి Tragedy. నేను చెప్పేందుకింకేమీ లేదు.

 7. *ఇప్పటికి మీడియాకు Short term gains ఏమైనా ఉండొచ్చు గాని మీడియా ఇప్పటికే తన respectabilityని కోల్పోయింది. మా చిన్నప్పుడు ఏ విషయమైనా పేపర్లో పడితే అది నిజమని జనం అదరూ నమ్మే వారు.ఇవాళ ఏ పేపరు నిజం రాసినా అది ఫలానా కులం వారి పేపరుకదా వేరేం రాస్తుందిలే అని పెదవి విరుస్తున్నారు*

  అప్పట్లో మీడీయా(ఆంధ్రపత్రిక) బ్రాహ్మణుల చేతిలో ఉండేది. వాళ్లకు కొన్ని ఆశయాలు ఉండేవి. దానికొరకు నడిపేవారు, ఇతర పత్రికలుగూడా స్టాండర్డ్స్ మైంటైన్ చేయవలసి వచ్చేది. ఇక వాళ్లు నష్టాలోస్తే ముసుకొన్నారు గాని, వారి పేపర్ బ్రాండ్ ఉపయోగించుకొని, రాజకీయ నాయకులతో లాలుచి పడి, నీ గురించి మంచిగా రాస్తాం, మాకంత డబ్బులు పడై అని బేరసారాలకు దిగి, కొత్తగా వచ్చే న్యుస్ పేపర్లను తొక్క లేదు.

 8. అప్పట్లో మీడీయా(ఆంధ్రపత్రిక) బ్రాహ్మణుల చేతిలో ఉండేది…
  ఇప్పటికే అందరి చేతుల్లో దెబ్బలు తిని ఉన్నారు..పాపం వాళ్ళను ఒదిలేయండీ!! 🙂

 9. Gopala Krishna Rao Pantula gaariki
  @వారితో అన్నిసార్లు ఏం మాట్లాడేరో అతడే వివరణ ఇస్తే బాగుండేది కదా..
  .తప్పక బయటకి వస్తాయని విశ్వసిస్తున్నాం…..

  @మరునాడు కోర్టులో హాజరవబోయే వ్యక్తిని 27 రాత్రి 8 గంటలకు అరెస్టు చేసి ఏమి సాధించారో జనానికి తెలియజేయ వచ్చుకదా
  ఎవరేమైనా అననివ్వండీ…ఎంత దుర్వినీయోగమనదన్న పేరు బడ్డా కూడా ….తిరుగు లేని దర్యాప్తు సంస్థ గా మన్నన పొందిండి…మంచి ఆఫీసర్లు ఉన్నారు….
  అరెస్ట్కు వాళ్ళకున్న కారణాలు వాళ్ళకు ఉండి ఉండోచ్చు…
  బైల్ విషయమై జడ్జి గారి తీర్పు చదివే ఉంటారు…సమయం దొరికి నప్పుడు లింక్ ఇస్తా క్షుణ్ణంగా మరో సారి..చూడండి….
  జడ్జీలు టేపులు చూసినట్టు కూడ అందులో ఉన్నాట్టు గుర్తు…
  @ ఇవాళ ఏ పేపరు నిజం రాసినా అది ఫలానా కులం వారి పేపరుకదా వేరేం రాస్తుందిలే అని పెదవి విరుస్తున్నారు…..
  ఒక్క ముక్కలో చెప్పారు…అధికారులు కూడా కులాల వారీ కొమ్ము కాస్తున్నారు…
  మీ వంటి పెద్ద వారు స్పందించినందుకు …మాకు సంతోషం…మీకు పాదాభివందనాలు…

  • / రాత్రి 8 గంటలకు అరెస్టు చేసి ఏమి సాధించారో జనానికి తెలియజేయ వచ్చుకదా/
   ఎప్పుడు చేసుండాలో మేత గారు CBIని ఆదేశించివుండచ్చు కదా? దోచుకున్నప్పుడు ఇలాంటి ముహుర్తాలు, రాహుకాలం, రాత్రి, పగలు అని పాటించారా? ఎక్కడినుంచి పెట్టుబడులొచ్చాయో CBIకి చెప్పి ముందే సహకరించివుండవచ్చు కదా? అదే చేసుంటే కస్టడీ తప్పేది కదా? 😀

 10. జగన్‌ను కస్టడీకి అప్పగిస్తూ 2న హైకోర్టు తీర్పు..(june 2 nd judgement)

  http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jun/10/main/10main1&more=2012/jun/10/main/main&date=6/10/2012

  మనమందరూ లోతుగా చూడాల్సిన కొన్ని వ్యాక్యలు లేదా తీర్పు లోని కొన్ని అంశాలు…..అలోచించండి … జడ్జిమెంట్ కు ముదు ఎంత స్టడీ చేయకపోతే ఈ వ్యాఖ్యలు వెలువడతాయి….konni vyaakhyalu krinda choodandi:

  సీబీఐ సమర్పించిన సీడీలను పరిశీలించిన తర్వాత… మూడు రోజుల విచారణలో జగన్ ఏ మాత్రం సహకరించలేదనే వాదన సరైనదే అనిపించింది” అని తెలిపారు. ‘ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం దాల్చే హక్కు నిందితునికి ఉన్నట్లే… వాస్తవాలను వెలికి తీయడానికి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే హక్కు సీబీఐకి ఉంది’ అని స్పష్టం చేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s