బలిపీఠంపై భారత్..!


from andhra jyothi daily…

బలిపీఠంపై భారత్..!
ఆర్థిక సంక్షోభం ముంగిట దేశం
అన్ని సూచీలు పాతాళానికే
కళ్లెంలేని ద్రవ్యోల్బణం
కరుగుతున్న ఫారెక్స్ నిల్వలు
కొంప ముంచుతున్న అవినీతి
ఊబిలో కూరుకుపోతున్న దేశం
పరువు తీస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు
జాగ్రత్త! పారాహుషార్!
సర్వత్రా హెచ్చరిక సందేశాలు!
ముప్పును సూచిస్తున్న సందర్భాలు!
ఆగస్టు సంక్షోభం అనివార్యమనే సంకేతాలు!
మాంద్యం మనలను మింగేస్తుందా? మళ్లీ బంగారం
కుదువపెట్టాల్సిన దుస్థితి తలెత్తుతుందా? బ్యాంకుల
నుంచి అప్పులు తీసుకుని కొన్న వాహనాలు, ఇళ్లు
తనఖాకు వెళ్లిపోతాయా? ఉద్యోగాలు
ఊడిపోతాయా? ఎన్నెన్నో సందేహాలు!!

హైదరాబాద్, జూన్ 3: మెరుపులు మాయమైనయ్! ఇప్పుడన్నీ మూల్గులే! అమెరికా డాలర్‌ను అధిగమిస్తాం, చైనా యువాన్‌ను చీరేస్తాం అన్న వీరంగాలు ఇప్పుడెక్కడా వినిపించడం లేదు. దేశ ఆర్థిక మంత్రి ప్రణబ్‌దా మొదలుకుని అద్దె గదిలో బతికే అమాయకుడి వరకు, అందరిదీ ఒకే అనుమానం… ‘ఈ మాత్రం ఇలా బతికితే అదే పదివేలు. కానీ బతకగలమా?’ అని! మాంద్యంలోనూ తట్టుకుని నిలబడ్డామన్న ధైర్యం నీరుగారిపోతోంది. నేడు భారత ఆర్థిక రంగానికి అన్నీ ప్రతికూల సంకేతాలే.

మిశ్రమ ఆర్థిక విధానాన్ని వదిలిపెట్టి… అమెరికా వెంట పరుగులు తీసిన ఫలితం ఇప్పుడు ప్రభావం చూపుతోంది. ఆర్థిక ప్రగతికి ప్రమాణాలైన అతి ముఖ్యమైన ఐదు సూచీలు (రూపాయి విలువ, వృద్ధి రేటు, షేర్ మార్కెట్, ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి) ఇప్పుడు మరింత భయపెడుతున్నాయి. పిల్లుల్లా మారిన ఆగ్నేయాసియా పులుల మాదిరిగానే, ఇప్పుడు దిగ్గజ భారతం బకరా అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్, రంగరాజన్, మాంటెక్‌సింగ్, దువ్వూరి, చిదంబరం వంటి తలపండిన ఆర్థిక వేత్తలూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.

‘కఠిన నిర్ణయాలే’ పరిష్కారం అంటూ మరింతగా జనం నడ్డి విరిచేందుకు సిద్ధపడుతున్నారు. బెంబేలెత్తిస్తున్న ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ప్రత్యేక చర్చ జరపనుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనే.. ‘అహా భారత్.. ఓహో భారత్… భారత్ అద్భుతం’ అంటూ విదేశీ పత్రికలు, ప్రసార సాధనాల్లో హోరెత్తిన కథనాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. బదులుగా భారత్‌లోని అవినీతి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆర్థిక విశేషాల పత్రిక ఫోర్బ్స్ మొదలుకుని, అమెరికాలోని హెరిటేజ్ ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం వరకు అందరూ.. భారత్‌లోని అవినీతిని ప్రధాన అంశంగా ప్రస్తావిస్తున్నాయి. అవినీతి విషయంలో భారత్ స్థానం మరింత దిగజారినట్టు ఫోర్బ్స్ పత్రిక బయటపెట్టింది. ఇక్కడ అధికార గణం, నేరగాళ్లు, రాజకీయ నాయకుల బంధం పటిష్ఠంగా పెనవేసుకుపోయినట్టు అంతర్జాతీయ నిపుణులు నిగ్గుతేల్చారు. భారత్‌లో ఏటా 45 వేల కోట్ల డాలర్ల (దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల) మేర లావాదేవీలు అక్రమ పద్ధతుల్లోనే జరుగుతుంటాయని హెరిటేజ్ ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం తేల్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s