నాకు నచ్చిన కామెంట్స్…


జనార్దన్ పెన్
పెన్ పవర్..నుండి
http://janardhanpen.blogspot.in/2012/05/blog-post_6269.html#comment-form

యధార్ధవాదిMay 13, 2012 5:25 AM
అంటే జర్నలిస్టులకు జీతాలు పెరగడానికి కారకుడైన వ్యక్తి రాష్ట్రాన్ని,దేశాన్ని దోచుకున్నా, ఎన్ని మర్డర్లు మానభంగాలు చేయించినా, ఎన్ని చట్టాలను ఉల్లంఘించినా……రాష్ట్ర జనభాలలో పాయింట్ పర్సంట్ కూడా లేని జర్నలిస్టులు( ఇందులో మళ్లీ చాలామంది బతక నేర్చిన వాళ్లు మళ్లీ వేరే )సదరు మహాత్ముడిని ఏమీ అనవద్దన్న మాట. అంటే జగన్ వేల కోట్ల రూపాయలను దోచుకున్నా…జర్నలిస్టుల జీతాలు పెంచినందుకు అతడికి ఓ మహాత్మా ఓ మహర్షీ అంటు వదలివేయాలన్న మాట. బాగు బాగు…

satyaMay 13, 2012 12:07 AM
>> నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా సీ బీ ఐ మమ్మల్ని అంటే నన్ను అనికూడా అనుకోండీ కన్విన్స్ చెయ్యగలిగిన ఆధారాలు ఎం చూపలేదు.

Who the heck are you to get convinced? Do the investigation bureau has to reveal its day to day operations and case proceedings to the public so that criminals will make safe arrangements? The matter is in the court and so far, in these cases (Jagan, gali, emaar) whatever the actions they took are mostly approved by court.

ChinnaMay 13, 2012 4:17 AM
చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడు కూడా! పొలిటికల్ కారమ్ బోర్డు మీద స్ట్రైకరును ఎటుతిప్పికొడితే ఎటో ఉన్న రెడ్డో, దాని వెనుక బడ్డో ఎలా పాకెట్లో పడతాయో ఆయనకు భలేగా తెలుసు. పైగా బాబు పంచతంత్రంలోని దీర్ఘదర్శికి చదువు చెప్పగలిగినవాడు. ఇప్పటి తన పగవాడి డాడీలాగే నాయుడు కూడా చాలా ఏళ్లు రాజ్యమేలాడు. అనే్నళ్లూ ‘ఆ రెండు పత్రికలు’, ‘ఈ మూడు ముఠాలు’ అంటూ డైలాగులు కొడుతూ కూచోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలిసీతో ఏ క్షేత్రానికా క్షేత్రంలో పనికొచ్చే విత్తనాలను చల్లాడు. అవే ఇప్పుడు విరగపండి ఏ రంగానికారంగంలో అవసరానికి ఆదుకుంటున్నాయి.
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్‌పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
మీరు ఫలానా కేసులో ఎగస్పార్టీకి మేలు చేశారు. కాబట్టి ఈ కేసులోనూ మాకు కీడే చేస్తారు. మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు కేసు తీసుకోకండి – అంటూ ఆ బాలుడు అడ్డదిడ్డంగా వాదిస్తూ తీరికూర్చుని జడ్జిలకు ఒళ్లు మండిస్తూంటే – ఈ గోపాలుడు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరిన బాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s