భారతీయులందరూ నా….


ముగ్గురి ఆత్మహత్య
బొబ్బిలి, ఏప్రిల్ 17 : కమ్మవలసకు చెందిన గెడ్డ శ్రీరాములు (35) పక్కి గ్రామంలో తన అత్తవారింట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు బొబ్బిలి పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీరాములకు పక్కి గ్రామానికి చెందిన లక్ష్మితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి గతంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టగా ఇటీవల మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో భార్యను చూసేందుకు పక్కి వచ్చి, అత్తవారింటి వద్ద పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. బంధువులు వెంటనే బొబ్బిలి ప్ర భుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్త మృతితో లక్ష్మి బోరున విలపిస్తోంది.

ఆడపిల్ల పుట్టిందని.. గరుగుబిల్లి మండలం నాగూరి గ్రామానికి చెందిన పెనుబర్తి గౌరన్నదొర (30) మంగళవారం బొబ్బిలి మండలం గున్నతోటవలసలోని తన అత్తవారింట పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మృతుడు గౌరన్నదొరకు గున్నతోటవలసకు చెం దిన మహిళతో వివాహం జరిగింది. వీరికి 12 రోజుల క్రితం ఒక ఆడపిల్ల పుట్టడంతో కలత చెంది పురుగులు మందు తాగాడు. స్థానికులు వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్సచేశారు. పరిస్థితి విషమించడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

భర్త వేధింపులు తాళలేక .. బొబ్బిలిలోని నాయుడు కాలనీకి చెందిన నేరేళ్ల కోటేశ్వరి (30) భర్త వే ధింపులు తాళలేక బాత్‌రూమ్‌కు ఉపయోగించే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. పెదపెంకి గ్రామానికి చెందిన రమేష్‌కు తన కుమార్తెనిచ్చి రెండేళ్ల క్రిందట వివాహం జరపించామని మృతురాలి తండ్రి వీరాంజనేయులు తెలిపారు. వివాహ సమయంలో 2 లక్షల కట్నం, 5 తులాల బంగారం, ఇతర వస్తువులు ఇచ్చా మని చెప్పారు. మృతురాలి భర్త రమే ష్ బలిజిపేట మండలం నారాయణపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఆయన కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం తన కుమార్తెను వేధిస్తూ ఉండేవాడని, అప్పుడప్పూడు ఏదో ఒకటి ఇచ్చి తమ అల్లుడిని సంతృప్తి చేసేవారమన్నారు. ఇటీవల మోటర్ సైకిల్ లేదా డబ్బులుగానీ ఇవ్వాలని తన కూతురిని, తనను వేధించాడని , దీంతో డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందన్నారు. కానీ మళ్లీ తన కూతురిని వేధిస్తుండడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని, అల్లుడు రమేషే కారణమని వీరాంజనేయులు రోదిస్తూ విలేఖరులకు తెలిపారు.

2 Comments

  1. ప్రభుత్వ టీచర్ జీతం నెలకి ఇరవై వేలు. హైదరాబాద్‌లోని సహస్రా ఇన్ఫోటెక్ లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఇంజినీర్‌లకి ఇచ్చే జీతం కంటే ఎక్కువే. ఎంత జీతం సంపాదించినా కట్న పీపాసులు కట్నం మీద ఆశ వదులుకోరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s