ఇక మన జీవన మార్గం ఇదే…. రా….


బాగా చదవండి…మాంచి ఉద్యోగాలు సంపాదించండి,,,,అంటే జీ ఓ లు జారీ చేసే లెవెల్ కి వెళ్ళండి….మీ ఇష్టారాజ్యంగా దొరికి నంత అడ్డమైన మార్గాల్లోన్నూ బొక్కేయండి…అలా ఇలా కాదు… కోట్లు ..కోట్లు ..కోటాను కోట్లు …సంపాదించండి….బాగా వెనకేసుకుని…వీలయినంత విచ్చలవిడిగా బ్రతికేయండి…ఓ సుముహుర్తాన దొరికిపోయి జైల్లో పడ్డారనుకోండి… ఇక జైల్లో చిప్పకూడు అని బయపడుతున్నారా..???
మీ వెంట్రుకలు పీకేదేమీ లేదు..జైల్లో మీకు ప్రత్యేక ఖైదీ హోదా మీ లాయర్లు తెచ్చిపెడతారు….ఆ తర్వాత…చాలా హేపీ…చదవండీ……

ఆంధ్ర జ్యోతి డైలీ నుండి…..


జాలిగా.. జాలీగా!
ఆనందం, ఆధ్యాత్మికం, ఆహ్లాదం
వీవీఐపీ ఖైదీల కొత్త ఫిలాసఫీ
బ్యారక్‌లకు సొంతంగా మరమ్మతులు
శివాలయంలో సాయి విగ్రహ ప్రతిష్ఠ
ఖైదీలకు లడ్డూ, పులిహోర ప్రసాదం పంపిణీ
ఆలయ ఆవరణలో తోటకు అందాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 : “గతం గతః పోయిన కాలం తిరిగి రాదు. ఇక భవిష్యత్తంటారా… అదెలాగూ మన చేతిలో లేదు. వర్తమానాన్ని కొంత ఆనందంగా, మరికొంత ఆధ్యాత్మికంగా, ఇంకొంత ఆహ్లాదంగా గడుపుదాం! జైలులో ఉన్నంత మాత్రాన జా లిగా ఉండటమెందుకు… ‘జాలీ’గానే గడుపుదాం!” ఇది చంచల్‌గూడ కారాగారంలోని వీవీఐపీల సరికొత్త ఫిలాసఫీ! ‘ఎవరో వస్తారని… ఏదో చేస్తారని’ కూడా వీరు ఎదు రు చూడటంలేదు. తమంతట తామే తలో చేయి వేసి… జైలు జీవితంలోనూ కొత్త రుచులు చూస్తున్నారు.

‘మన మూ… మన జైలు’ అనేలా పరిసరాలను బాగు చేసుకుంటున్నారు. ఎమ్మార్ కుంభకోణం, ఓఎంసీ అక్రమాలు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో పలువురు వీవీఐపీలు చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరికి ‘సూర్య’ పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశ రావు కూడా జత కలిశారు. జైలు ఆవరణలో ఇప్పటికే శివాలయం ఉంది. అక్కడే.. షిర్డీ సాయి విగ్రహమూ ఉంటే బాగుంటుందని వీఐపీ ఖైదీలకు అనిపించినట్లుంది. అంతే.. నాలుగు రో జుల క్రితం సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగిపోయింది. విగ్రహాన్ని కోనేరు ప్రసాద్ బహూకరించినట్లు తెలిసింది. దీన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారమే బయటపెట్టింది.

విగ్రహ ప్రతిష్ఠాపన అన్నాక ప్రసాద వితరణ కూడా ఉండాలి క దా! ‘ప్రసాదం పంపిణీ’ బాధ్యతను నూకారపు స్వీకరించినట్లు తెలిసింది. ఒక డబ్బాలో లడ్డు, పులిహోరా, దద్దోజ నం పెట్టి… 650 మంది ఖైదీలకు పంచినట్లు సమాచా రం. వీటిని బయటచేయించి మరీ జైలుకు తరలించినట్లు తెలిసింది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కోనేరు ప్రసా ద్, నూకారపు, రాజగోపాల్ స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ‘గాలి’ మాత్రం తన బ్యారక్‌కే పరిమితమైనట్లు తెలిసింది.

సుమారు 4 అడుగుల ఎత్తున్న పాలరాతి విగ్రహాన్ని ఓ ఆటోలో జైలుకు తరలించినట్లు చెబుతున్నారు. విగ్రహం ఖరీదుతోపాటు ప్రసాదాలు, గార్డెనిం గ్‌కు ‘పెద్దలు’ రూ.4 లక్షల వరకు ఖర్చుపెట్టినట్లు తెలిసింది. ఇంత జరిగినా విగ్రహ ప్రతిష్ఠ జరగలేదని ఒకసారి, ఓ అజ్ఞాత భక్తుడు విగ్రహం బహూకరించాడని మరోసా రి జైలు అధికారులు చెబుతున్నారు. శివ – సాయి ఆల య ప్రాంగణంలో చూడ ముచ్చటైన తోటను కూడా అభివృద్ధి చేసినట్లు తెలిసింది. నూకారపు సూర్యప్రకాశరావు తన నివాసంలో తోటపనిచేసే వారినే జైలుకు రప్పించి 15 రోజులపాటు దాన్ని తీర్చిదిద్దించినట్లు చెబుతున్నారు.

వారికి వారే…
ప్రత్యేక తరగతి ఖైదీలకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పిస్తారు. అయితే… ఎంతైనా జైలు కదా, ఆ వసతులను అధికారులు సమకూర్చడం కష్టమే. పై అధికారు ల నుంచి అనుమతి పొంది, టెండర్లు పిలిచో/నామినేషన్ పద్ధతిపైనో పనులు చేయించే సరికి పుణ్యకాలం గడిచిపోవడం ఖాయం. దీంతో స్పెషల్ కేటగిరీ ఖైదీలు తమ వసతులు తామే కల్పించుకుంటున్నారు. బ్యారక్‌ను తమ ఖర్చుతోనే బాగు చేయించుకున్నారు. దోమల నుంచి రక్షణకు మెష్ పెట్టించారు. టాయ్‌లెట్లలో వెస్టర్న్ స్టైల్ కమోడ్‌లు పెట్టించుకున్నారు. పనిలోపనిగా జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కూడా మరమ్మతు చేయించేందుకు గాలి జనార్దన రెడ్డి, సాయి రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది.

వరుస ములాఖత్‌లు…
శిక్ష పడ్డ ఖైదీకి వారంలో ఒక రోజు, రిమాండ్ ఖైదీకి వారంలో రెండు రోజులు మాత్రమే ములాఖత్‌లకు అనుమతించాల్సి ఉంది. కానీ, వీఐపీ ఖైదీల విషయంలో అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. నూకారపును మంగళవారం ఆయన భార్య, కుమార్తె పరామర్శించారు. వీరు జైలుకు తమ వాహన డ్రైవర్‌తో భోజనాన్ని లోనికి తీసుకెళ్లినట్టు తెలిసింది. సోమవారమే నూకారపును ఆయన భార్య కలిసి వెళ్లారు. మంగళవారం మరోమారు రావడం గమనార్హం. ఇక… సాయిరెడ్డిని మంగళవారం కూడా జగన్ మీడియా ప్రతినిధులు, ఆయన కుటుంబసభ్యులు పరామర్శించారు. కోనేరుతోనూ ఆయన బంధువులు ములాఖత్ అయ్యారు

5 Comments

  1. జైల్లో ఉంటే మాత్రం ఏం పోయింది…చక్కగా రాజా బాబుల్లా వెలిగిపోతుంటేను….ప్రత్యేక ఖైదీ హోదాలు…దాంతో పాటే కొరుకున్నవి అన్నీ దొరుకుతుంటే జైల్ కి పోడానికి ఎవడూ బయపడక్కర్లా…కాబట్టి ఇక మన వ్యవస్థ లో ఎవడూ తప్పులు చేయడానికి బయపడక్కరలేదు….అరెస్ట్ అయ్యి జైల్ కి వెళ్ళీనా అన్ని భోగాలూ జైల్లో అనుభవించొచ్చు….అమ్మో తప్పు చేస్తే జైల్ పాలవుతామని బయపడక్కర్లేదు….అందులోనూ మన న్యాయమూర్తులు గొప్ప మానవతా వాదులు మరీ…. సమాజాన్ని….సంకనాకించిన వెధవలకి ప్రత్యేక హోదాలు జైల్లో మంజూరు చేయడమంటే మహా గొప్ప….వాళ్ళు చేసిన ఆర్ధిక నేరాలు దాని వల్ల ఈ దేశానికి ఎంత నష్టమన్నది వాళ్ళ కళ్ళకు కనబడదు….అందుకని ఇలా ప్రజల డబ్బు దొబ్బేసిన జనాలందరికీ ….ప్రత్యేక ఖైదీ హోదాలు మంజూరు చేసి వాల్ల రాజ భోగాలు జైల్లోనూ కంటిన్యూ చేస్తారు…..ఇక జనాల డబ్బు దొబ్బేయడానికి మనకి భయమెందుకూ, పదండి ఎవడికి దొరికినంత వాడు బొక్కేద్దాం…

  2. @అన్నా హజారే…బాగుంది…మిస్ అయ్యాం….
    నాకో అనుమానం ఉండి పోయింది …ప్రపంచం లోని అన్నిదేశాల్లోని అన్ని ప్రభుత్వాలూ ఇంతేనా?ఎవడొచ్చినా దొచుకుపోదామన్న ధ్యాస తప్పా, కనీసమయిన అభివృద్ది చేద్దాం అన్న ఆలోచన ఉండదా…బేసిగ్గా మనిషి పూర్తిగా స్వార్ధపరుడైపోయాడా ఈ భూమ్మీద??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s