మేరా భారత్ మహాన్

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

(ఫేస్ బుక్ నుండి సేకరణ)

ఈ ఫొటో ప్రచురణ చైనాని గొప్ప చేయడానికీ కాదు, ఇండియాని తక్కువ చేయడానికీ కాదు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వివిధ అవసరాల కోసం జనం కూడే ఇతర ప్రదేశాల్లో ఒకరిపై ఒకరు పడుతూ, ముందున్న వారిని నెట్టివేస్తూ తానే ముందుకు చేరాలన్న ఆత్రుతలో, తమ దాకా రాదేమో అన్న ఆందోళనతో ఉన్నపుడు, సాధారణంగా ఇటువంటి పరిస్ధితులు కనిపిస్తుంటాయి. అందరికి సరిపడా ఉంది, కనుక అందరికీ అందుతుంది అన్న భరోసా ఉంటే ఈ తోపులాటలు తప్పుతాయి. క్యూలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కావలసింది అందుతుంది అన్న నమ్మకం ఉంటే ముందున్నవాడిని వెనక్కి నెట్టేయాలన్న ఆలోచన రాదు. అలా కాక అవసరమైనవీ, అత్యవసరమైనవీ కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటేనో, అవి అవసరమైనవారు అనేక రెట్లు ఉంటేనో తమ దాకా రాదన్న ఆత్రుత, ఆందోళన ఉదయించడం సహజం. అంటే, ప్రజలకు సౌకర్యాల కల్పన పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉంచగల ప్రభుత్వాలు ఈ పరిస్ధితిని నివారించ గలవు. ప్రజలకు చెందవలసింది కూడా తామే నొక్కేస్తూ ఉన్న పాలకులు ఉన్న భారత దేశంలో ఈ పరిస్ధితి కాకుండా మరొక పరిస్ధితి ఎలా ఉంటుంది? ఈ చిత్రాన్ని ఆ కోణంలో నుండే చూడాలి.

అసలు టపాను చూడండి

ప్రకటనలు

2 Comments

  1. నిన్న రాయగడ-విజయవాడ పాసింజర్ ట్రైన్‌లోని రిజర్వేషన్ పెట్టెలో ఇద్దరు రిజర్వేషన్ లేని ప్రయాణికులు సీట్ కోసం కొట్టుకున్నారు. ఎక్స్‌ప్రెస్ బండి యొక్క ఎసి పెట్టెకి రిజర్వేషన్ దొరక్క పాసింజర్ బండికి టికెట్ రిజర్వ్ చేశాను. ప్రయాణిస్తున్నప్పుడు ఈ దృశ్యాలు కనిపించాయి. ట్రైన్ విజయనగరం స్టేషన్‌లో ఉన్నప్పుడు ప్రయాణికుల రద్దీ మధ్యలో ఒక వ్యక్తి దాన్ని అవకాశంగా తీసుకుని సెల్‌ఫోన్ కొట్టెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సెల్‌ఫోన్ కిందపడి పగిలింది. దాంతో ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. మన దేశంలో క్రమశిక్షణ ఇలా తగలాడింది.

  2. మీరు చెప్పింది నిజమే, మొదట్లో ఓ సారి మేము కూడా వైజాగ్ కి ఈజీ కదాని బొబ్బిలిలో రాయగడ -విజయవాడ పాసింజర్ ట్రైన్‌ ఎక్కాము…వైజాగ్ చేరే లోపు నాలుగైదు ఫైటింగ్ లు జరిగాయి…ఆడాళ్ళు కూడా యధావిధి గా సిగపట్లు పట్టుకున్నారు………….నా వైఫ్ ఎంత జడిచి పోయిందంటే నాలుగు నెలలు తిరక్కుండానే బాంక్ లోన్ లో కారు కొనుక్కుంది………అంత భయంకరమయిన యుద్ధాలు చూశాం ఆ ట్రైన్ లో సీట్లకోసం…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s