మహొ తెలివైన ఐఏఎస్ లు


మన ఐఏఎస్ లు మహొ తెలివైన వారు సుమండీ..
కింద పడ్డా తనదే పైచేయన్నాట్ట వెనకటికి ఎవడో అలా ఉంది వీళ్ళ ఏడుపు సీబీఐ మీద..
తమను సీబీఐ విచారించడం మరింత మంటగా ఉన్నట్టు ఉంది వీళ్ళకు…..
వీళ్ళ ఆర్గ్యుమెంట్ లను చూస్తుంటే …ఇంత మంది జనాలూ ఛీ కొడుతున్నా తమ దోరణి మార్చుకోలేదన్నమాట….
అయ్యా ఐఏఎస్ లు వితండ వాదనలూ రూల్స్ మాట్లాడ్డమ్ కట్టి పెట్టి జనాలు మీ గురించి ఏమనుకుంటున్నారో ఓ పరి ఆలకించండయ్యా….
ఇంతకూ అందరూ మహోనుభావులే గానీ చెరువులో చేపలు ఏమైనట్టూ??

ప్రకటనలు

3 Comments

  1. ఈ IAS లకి తాము మిగతాప్రభుత్వోద్యోగులకంటేతాము భిన్నమైన వాళ్ళమనీ, తమకు కొన్ని ప్రత్యేక అర్హతలున్నాయనీ వాళ్ళకి ఒకటికంటే ఎక్కువ మెదళ్ళున్నట్టు తెగ ఫీలయిపోతుంటారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళు తమకేడర్ ని పెంచుకుందికి, మిగతా కేడర్లకి చెయ్యని అన్యాయం లేదు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాధినేతలు ఎలాగయితే తాము ఎలక్షన్లలోతప్ప మిగతాసమయం లో ప్రజలకూ, రాజ్యాంగానికీ జవాబుదారీలుకామనుకుని ఇచ్చవచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటారో, వీళ్ళుకూడా ఉద్యోగంలో చేరినప్పుడుతప్ప ఇంకెప్పుడూ వీళ్ళకి వ్యవస్థ గుర్తుకు రాదు. (నేను నిజాయితీగా, గుర్తింపుతోటీ, ప్రమోషన్లతోటీ ప్రమేయం లేకుండా తమ ధర్మాన్ని గీతలో చెప్పినట్టు నిర్వర్తించుకునిపోయే వేళ్ళమీద లెక్కించదగిన అధికారులని మినహాయించి మాటాడుతున్నాను. వీళ్ళగురించి How To Motivate Bureaucracy అని ఒక పుస్తకం లో శ్రీ సత్యబాబు అనే సీనియర్ IAS ఆఫీసరు చర్చించారు.) వీళ్ళకి ఉన్న పెద్ద అవకాశం మంత్రులతో సన్నిహితంగా మెలగగలగడం. ఒక్క మన రాష్ట్రంలోనే, ఇంత పెద్దెత్తున కుంభకోణాలు ఒకదానివెంట ఒకటి బయటపడుతుంటే, ఇంతకంటే ఎక్కువ వనరులపై అధికారాన్నీ, వినియోగం పై విచక్షణాధికారాన్నీ కలిగిన కేంద్రప్రభుత్వIASలు పాతతరాల్లో లేరని చెప్పగలమా? ప్రజాస్వామ్యవ్యవస్థకంటే బలంగా పాతుకుపోయిందీ IAS, IPSలకీ, అవినీతి మంత్రులకీ మధ్య Symbiotic relationship. అదే విచారించవలసిన విషయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s