ఇంకేం మాట్లాడగలం..


‘‘ఇచ్చిన మాట మీద నిలబడ్డందుకు, విలువలు, విశ్వసనీయత వైపు నిలిచినందుకు నా మీద ఈరోజు , ఆరోపణలతో అభాండాలు వేస్తున్నారు.. దొంగ కేసులు పెడుతున్నారు.. నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి లేకుండా చేసేందుకు క్రూర రాజకీయాలు చేస్తున్నారు.. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే బదులు.. కాల్చి చంపేయకూడదా…’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదనగా ప్రశ్నించారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ కుమ్మక్కై క్రూరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. . అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే…

ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట..!
రాష్ర్ట చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక క్రూరమైన రాజకీయం జరుగుతోంది. ఆ రాజకీయం ఏమిటంటే..! రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉండాలట! ఒకటి తెలుగుదేశం, మరొకటి కాంగ్రెస్. ఓటు వేయడానికి ప్రజలకు మూడో పార్టీ కనపడకూడదట. ఆ పరిస్థితులు తీసుకురావడానికి చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు కూడా కుమ్మక్కై నానా అవస్థలు పెడుతున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. అవినీతి ఆరోపణలతో అభాండాలు వేస్తున్నారు. ఇవ్వాళ ఒక్కమాట అడుగుతున్నా.. దివగంత నేత రాజశేఖరరెడ్డిగారు బతికి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. సాక్షాత్తూ సోనియాగాంధీ దగ్గర్నుంచి మన్మోహన్‌సింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నేత దేశంలోనే ఎక్కడా లేరని కొనియాడ లేదా?

విలువలతో కూడిన రాజకీయాలు చేయండి..
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత… నేను మాట మీద నిలబడ్డానని, ఆ నేత చనిపోయిన ప్రదేశంలో నిలబడి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఒక మాట ఇచ్చానని, ఆ మాటను గాలికి వదిలేయమని మీరు చెపితే వదిలేయలేకపోయానని, విలువల కోసం, విశ్వసనీయత కోసం నిలబడాడ్డనని, ఒకే ఒక్క కారణంతో నా కుటుంబాన్ని, నన్ను, అందరిని కూడా సర్వనాశనం చేసేందుకు ఇన్నిన్ని పన్నాగాలు పన్నే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాలు చేస్తే అవి విలువలతో కూడిన రాజకీయాలై ఉండాలి. మీరు ప్రజల్లోకి రండి.. వచ్చి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకొనే కార్యక్రమాలు చేయండి. ప్రజల మన్ననలు పొందే రాజకీయాలు చేయండి. కానీ ఈ మాదిరిగా ఒక పార్టీ ఉండకూడదని, ఒక మనిషి ఉండ కూడదని నీచమైన రాజకీయాలు చేసే బదులు ఆ మనిషిని కాల్చి చంపేయ్యకూడదా.. అని ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలనూ, చంద్రబాబు నాయుడును అడుగుతున్నా!

ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు
ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆయన తరపున ఎవరూ మాట్లాడలేరని, ఇక ఆ వ్యక్తి రారని ఆయనపై అభాండాలు వేస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. మీ నీచ రాజకీయాలను ఎవరూ చూడటం లేదని అనుకోకండి. పైనుంచి దేవుడు అనే వాడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికల వచ్చినా దివంగత నేత వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి హృదయం ఒక్కటౌతుంది. చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌కు రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రాని రోజులు వస్తాయి. ఇలాంటి కష్ట సమయంలో ఎవ్వరూ లేరని అనుకోబోకండి. ఆ దివంగత నేత నీకు ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చి పోయాడు అని గురజాల పట్టణం అంతా నడిరోడ్డు మీదకు వచ్చి నాపై ఆప్యాయత చూపిస్తోంది. ఇంతటి ఆత్మీయతను పంచి పెడుతున్న మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను.

చంద్రబాబూ.. నువ్వా అవినీతిపై మాట్లాడేది?
ఈరోజు చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నువ్వా..! అవినీతి గురించి మాట్లాడేది. ఈ చంద్రబాబుకు ఇవాళ ఒక సవాల్ విసురుతున్నా.. నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, ఆ కోర్టుల దాకా పోకుండా నీపై సీబీఐ విచారణ వేసుకో, నీ కుటుంబ సభ్యుల మీద వేసుకో, నీ ఆస్తుల మీద వేసుకో, సచ్చీలుడిగా బయటికి రా.. వచ్చినప్పుడు నీతో పాటు మేం అందరం హర్షిస్తాం….

ఇదండీ దేశ భక్తుడి గోడు…

చదువు గిదువూ ఒద్దు చక్క గా జగన్లా సంపాదించుకోవచ్చు అనేట్లు చేసావ్…కాల్చి చంపాలిగానీ చట్టాలు ఒప్పుకోవుగా….నువ్వు తప్పా అందరూ దొంగలే కదా?సీబీఐ..కోర్టులూ…అందరూ దొంగలే..నువ్వే దేశ భక్తుడివి కదా….

5 Comments

 1. ఒక్కప్పుడు పంపాని గారు చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకొని, సోషలిస్ట్ వ్యవస్తలో రాజకీయా నాయకులను ఉపయోగించుకొని వ్యాపారం లో కోట్లు సంపాదించి, వ్యాపారవెత్తగా ఎదిగి పోయాడు. ఆ రోజులలో పంపాని చేసేది చట్టప్రకారం తప్పని కరణ్ శౌరి లాంటి వారు ఎదురు తిరిగి బండారం బయట పెడుతూ వ్యాసాలు రాసేవారు. పంపాని గారి కంపేని షేర్లు కొని లాభపడిన మధ్యతరగతి ప్రజలు చూసి చూడనట్లు పోయేవారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు గగన్ గారు అమలు చేస్తున్నారు. తండ్రి పదవినే పెట్టుబడిగా పేట్టి కోట్లలో వ్యాపారం నడపటం ప్రారంభించారు. పేద, దిగువ మధ్యతరగతి వారికి కావలసినంత మందు,డబ్బులు ఇస్తూంటే మీటీంగ్ లకి వస్తారు. పంపానిగారి ని మద్యతరగతి ఎలా ఆదరించిందో అలాగే గగన్ గారిని పేద, దిగువ మధ్య తరగతి వారు మీటీంగ్ లకు హాజరౌవుతూ ఆదరిస్తున్నారు. నిజానికి ప్రజల నాడిని యువనేత అందరికన్నా ఎక్కువగా చదివి, అర్థం చేసుకొవటమే కాక, తెగువతో దూసుకు పోతున్నాడు. ఇంకొకరు అయి ఉంటే ఆత్మ రక్షణ లో పడేవారు. నేను ఇంత తిన్నాని అందరికి తెలిసినతరువాత ఏ విధంగా ప్రచారం చేయగలను అని.

 2. ఇక అందరూ ఇదే ఫార్ములా ఫాలో అయితే ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? ఇక అందరూ ఇదే ఫార్ములా ఫాలో అయితే ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? బడ్జెట్ అంతా బకరాలకి సబ్సిడీ లు ఇస్తూ పోతే అబివృద్ది కార్యక్రమాలు ఎప్పటికి?ఇప్పటికే గ్రామీణ రోడ్ల పరిస్తితి అద్వానంగా వుందే?కనీసం మంచి రోడ్లకి కూడా నోచుకోలేక పోతున్నామ్..

 3. *అందరూ ఇదే ఫార్ములా ఫాలో అయితే ఈ దేశ భవిష్యత్తు ఏమిటి?*
  చాలా మంచి ప్రశ్నలు వేశారు. చూడబోతే ఉత్తమ పౌరులుగా ఉన్నట్లున్నారు. నా ఉద్దేశం అమ్మా, నాన్న మాటలు విని, బుద్దిగా చదువుకొని, ఏ దురలవాట్లు లేకుండా జీవించేవారి కేటగిరి.
  ఇక అసలు విషయానికి వస్తే, అందరూ ఇదే ఫార్ములా ఎలా ఫాలో అవుతారను కొంట్టున్నారు? కొందరు మాత్రమే ఆఫార్ములాను ఫాలో అయ్యారు. అదికాక ఈ ఫార్ముల అనుకొన్నదాని కన్నా ఎక్కువగా, త్వరగా లీకై, అంతకన్నా త్వరగా వీకై పోయింది. ఇప్పుడు ఎంతో మందికి ఈ ఫార్ముల తెలుసు, వారు ఈ ఫార్ముల అమలు జరుపుతున్నపుడు అండకులు కలిగియటమో లేక తమకు వాట అడగటమో చేస్తారు. కాబట్టి అనుకొన్నంత లాభాలు రావు. ఈ ఫార్ములను విజయవంతంగా అమలు జరపాలి అంటే, ముందరగా అన్నిటికి సిద్దపడిన బినామిలు కావాలి. బినామిలుగా మారటానికి చదువు సంధ్యా, ఉద్యోగం సద్యోగం లేని వారు కావటం కాదు వారి అర్హత. కొంత తెలివితేటలు,మాంచి తెగింపు ఉండాలి. ఇవి రెండు ఉంటే ఫార్ములాలు కోకొల్లలు. బినామిలు ఒక్కరుగా ఇటువంటి పనులు చేయాలంటే ఎంతటివారికైనా బెరుకు ఉంట్టుంది. కనుక వారిని మోటివ్ చేయటానికి కొంచెం చుట్టరికం, వర్గ పిచ్చి, ఎదుటివర్గం వారిని పైకి పోనీయకుడదనే భావం, వీటన్నిటికన్నా ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారో వారు, వీరిని రక్షిస్తారు అనే భరోసా మొద|| వుంటే ముందుకు వస్తారు. అవినీతి పరుల మీద శిక్షలు పడాలంటే, ఈ దేశానికి సుబ్రమణ్య స్వామే ఆఖరి ఆశ. ఇవ్వన్ని కుదరాలి అంటే అదొక పెద్ద భగీరథ ప్రయత్నం, ఎన్నో సం|| లకు ఆ కాంబినేషన్ కుదురుతుంది. అప్పుడు ఎకనామి బూం పిరియడ్ లో ఉంటే, ఈ ప్రయత్నం బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. అది ఇప్పుడు మీరు చూసారు.

  *ఇప్పటికే గ్రామీణ రోడ్ల పరిస్తితి అద్వానంగా వుందే?కనీసం మంచి రోడ్లకి కూడా నోచుకోలేక పోతున్నామ్..*

  గ్రామీణ రోడ్ల ? పట్టాణాలలో భలేగా ఉన్నట్లు చెప్తున్నారు. మొన్నా ఆమాధ్య మావురికి పోతే గత సం|| కన్నా చెత్తగా ఉన్నాయి రోడ్లు కాని ఎవరు అడుగుతారు? రోడ్లు వేయటానికి డబ్బులు ఉన్నా వేయటంలేదు. మా వూరి యం.యల్.ఏ. 65సం|| ల వయసులో, మనవడు పుట్టిన సందర్భంగా, కీపుతో సరసాలు ఆడుతుంటే దానిని ఒక పేపర్ వాడు ప్రచూరించాడు. దానిని వారు హుందాగా తీసుకొని, రాజులాగా ఫీలై ఆనందించారు. అయినా సమాజం మారాలి అంటే ఈ రోజు యానం లో జరిగిన సంఘటనలు కొన్ని జరిగితే మారవచ్చేమో. అవినీతి పరుల మీద శిక్షలు పడాలంటే, ఈ దేశానికి సుబ్రమణ్య స్వామే ఆఖరి ఆశ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s