గుండె నొప్పేమో?


ఛాతీలో నొప్పి గుండెపోటు కాదు

Share
న్యూయార్క్ Mon, 15 Aug 2011, IST
పెన్సిల్వేనియా వైద్యుల పరిశోధనలో వెల్లడి
గుండెపోటు నిర్ధారణలో పొరపాట్లు దొర్లుతున్నాయి
ఛాతీలో నొప్పి అనగానే గుండె జబ్బు ఉందనో, గుండె పోటు వచ్చిందనో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య శాస్త్ర పరిశోధకులు. తాము నిర్వహించిన పరిశోధనల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు రాగలిగామని పెనిసిల్వేనియా విశ్వవిద్యాలయం ఆసుపత్రిలోని పరిశోధక వైద్య బృందం చెబుతోంది. సుమారు మూడు వేల మంది రోగుల మీద పరిశోధనలు నిర్వహించామని, ఇందులో కేవలం ఛాతీలో సుడులు తిప్పే రూపంలో వచ్చే నొప్పి అయినా కూడా గుండె పోటుగా భావించి గాభరా పడాల్సిన అవసరం లేదని తేలిందని పరిశోధకులు చెప్పారు. అయితే ఇలాంటి నొప్పి వచ్చిన వారికి నెల రోజుల లోపుగా గుండె పోటు వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయని హెచ్చరించారు. ఛాతీలో నొప్పి కలగ్గానే గుండె పోటు వచ్చిందేమోనని భయపడాల్సిన అవసరం లేదని పరిశోధన బృందంలోని ఒక వైద్యుడు యానా మేరీ చాంగ్‌ తెలిపారు. అధ్యయనం తాలూకు వివరాలను యానాల్స్‌ ఆఫ్‌ ఎమర్జన్సీ మెడిసిన్‌లో ప్రచురించారు.

ఈ పరిశోధనకుగాను సున్నా నుంచి 10 వరకు ఊహాజనిత స్కేలును ఆధారంగా తీసుకున్నారు. ఇందులో సున్నాను నొప్పి లేని స్థితికి, 10ని బాగా నొప్పి కలిగించే స్థితికి గుర్తుగా నిర్ణయించారు. యూపెన్‌ ఆసుపత్రి అత్యవసర విభాగంలో అధ్యయనానికి ఎంపిక చేసిన 3,300 మందిలో ఛాతీలో నొప్పి ఏ స్థాయిలో వస్తోందీ లెక్కించారు ఇలా వరుసగా 30 రోజుల పాటు హృదయ సంబంధిత సమస్యలను పరిశీలిస్తూ వచ్చారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తున్న రోగులందరికీ గుండెపోటు రాగల అవకాశాలు లేవని తేలింది. అయితే నొప్పి తక్కువగా వచ్చే రోగుల్లో కంటే, ఎక్కువగా వచ్చిన రోగుల్లో నెలలోగా గుండెపోటు రాగల అవకాశాలను వైద్యులు గుర్తించారు. అలాగే కేవలం గంటసేపు మాత్రమే వేధించే ఛాతీ నొప్పి కూడా గుండెపోటుకు సహజ సిద్ధమైన సంకేతం కాదని స్పష్టం చేశారు

వాస్తవానికి గుండెపోటు లక్షణాలు కేవలం ఒక్క గుండెకే పరిమితం కావు. ఛాతీలో ప్రారంభమైన నొప్పి క్రమేపి చేతిలోకి, దవడల్లోకి వెన్నెముకకు, పొత్తికడుపునకు విస్తరిస్తుందని వైద్యులు వివరించారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చే వారిలో గుండెపోటును గుర్తించడంలో సుమారు 30 శాతం పొరపాట్లు దొర్లుతున్న మాట యదార్ధమేనని ఈ అధ్యయనం చేసిన వైద్యులు గుర్తించారు. ఇంతకు ముందు ఉదహరించిన లక్షణాలు కనిపిస్తే తప్ప అది గుండెపోటుగా భయపడాల్సిన అవసరమే లేదని బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌ అత్యవసర సేవా విభాగం వైద్యుడు జేమ్స్‌ ఫెల్డ్‌మన్‌ అన్నారు. అలా అని ఛాతీ నొప్పిని ఇతర అవయవాల నొప్పుల్లా తేలికగా తీసిపారేయడమూ క్షేమకరం కాదని ఆయన హెచ్చరించారు.

[from praja sakthi news paper]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s