నా దేశ రాజకీయ నాయకుల్లారా..


నా దేశ రాజకీయ నాయకుల్లారా….
చైనా నాయకుల ఽఽఽఽ త్రాగండి..వాళ్ళ ఇళ్ళలో ఽఽఽఽఽ కడగండి…
ఎన్ని చెప్పండి…
ఈ దేశ నాయకులు…మతాన్ని కులాన్ని ప్రాంతీయ భావ జాలాల్నీ అడ్డు పెట్టుకుని…
ప్రజలను రెఛ్ఛ గొట్టి వాళ్ళను వెర్రి వెధవల్ని చేసి వాళ్ళల్లొ వాళ్ళు కుమ్ముకున్నేట్టు చేసి …
వాళ్ళ అయొమయాన్ని తమ పెట్టు బడిగా చేసుకుని…అందలాలెక్కి ఆ గొర్రెలనే ఏలుతూ తాము బొక్కినంత బొక్కి …
కుక్కలకి బొమికలు పారేసినట్టు కొన్ని సంక్షేమ పధకాల్ని విదిలించి తాము కులాసాగా..
జనాలను కుక్క బతుకులు బ్రతికేట్టు చేయడం లోనే తమ తెలివి తేటల్ని ఉపయోగిస్తున్నారనడం లో >>>
ఎన్ని రీజనింగులు చెప్పండి సందేహం లేదు…..

{నాలుగు రోజుల క్రితమ్ మీలానే నేనూ పేపర్లో /చాన్నెళ్ళొ చూసాక }
పై అభిప్రాయం కలగడంలో ఏమైనా తప్పు ఉందంటారా???


* మరో ఘనత సాధించిన చైనా
* 41.5 కిలోమీటర్ల వంతెన నిర్మించిన చైనా
* క్వింగ్ డావో హాంగ్ డావో మధ్య వారధి
* రూ. 6300 కోట్లతో నిర్మాణం
* క్వింగ్‌డావో, హాంగ్‌డావో మధ్య
* 2007లో ప్రారంభం

అద్భుతాలను ఆవిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సాగర వంతెనను నిర్మించింది. 41న్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. సముద్రంపై బ్రిడ్జ్ అంటేనే ఓ అద్భుతమైన అనుభూతి….అలాంటిది కిలోమీటర్ల కొద్దీ నిర్మాణమైతే ఇక చెప్పేదేముంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు సాగర వంతెనలు నిర్మించాయ్.

అయితే..ఈ విషయంలో అందరికంటే ఓ అడుగు ముందే ఉంది చైనా. సముద్రంపై ఇప్పటికే కొన్ని బ్రిడ్జ్‌లు నిర్మించిన చైనా ప్రభుత్వం లేటెస్ట్ గా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన నిర్మించింది. షాండాంగ్ ప్రావిన్స్ లోని క్వింగ్‌డావో, హాంగ్‌డావో మధ్య నిర్మించారీ అద్భుత వంతెనను. 41న్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 2007లో ప్రారంభించారు.

6300 కోట్లతో కట్టిన ఈ సాగర వారథి ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వచ్చే నెలలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది చైనా ప్రభుత్వం. ఈ బ్రిడ్జ్ కారణంగా క్వింగ్ డావో, హాంగ్ డావో మధ్య 20 నిమిషాల ప్రయాణం తగ్గనుంది. సముద్రంపై ఇప్పటివరకు నిర్మించిన వాటిల్లో అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ లో ఉన్న వంతెనే అత్యంత పొడవైనది. దాని పొడవు 38. 4 కిలోమీటర్లు కాగా..ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలు కొట్టింది చైనా.


ప్రకటనలు

12 Comments

 1. ఏక పార్టీ నియంతృత్వం వల్లనే చైనా అంత త్వరగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలుగుతోంది. మన దగ్గఱా ఏక పార్టీ నియంతృత్వం ఒకప్పుడు నిరంతరాయంగా మూడు దశాబ్దాల పాటు నడిచింది. కానీ పూర్తిగా విఫలమైంది. అంతే ఆ నియంతృత్వాన్ని వినియోగించుకునే పద్ధతిలో ఉందనుకుంటా అసలు కిటుకు.

  మనకిప్పుడు దేశవ్యాప్తంగా మంచి జఱిగే అవకాశం బహుశా లేదు. రాష్ట్రస్థాయిలో ఎన్టీయార్, లేదా వైయెస్సార్‌లాంటి నియంతృత్వ లక్షణాలు గల ఏకవ్యక్తి నిరంకుశత్వం – నేననేది ప్రాజ్ఞ నిరంకుశత్వం (enlightened despotism) కనీసం రెండు దశాబ్దాల పాటు ఎడతెగకుండా కొనసాగితే తప్ప మనం బాగుపడం. I think we are a classical example of how people become victims of an overdose of democracy and too much freedom of speech. ఈ దేశాన్ని బాగుచేయాలంటే ముందు మీడియాని 90 శాతం వఱకు మూసేయాలి. అన్ని జబ్బులకీ వాళ్ళే సగం కారణం.

  • ఒక దేశాన్ని నడిపించేది రాజకీయ నాయకులే…వాళ్ళ ఆలోచనలే దేశానికి దిశను చూపిస్తాయనడంలో సందేహం లేదు…మన నాయకుల ఆలోచనా విధానం ఈ దేశాన్ని అయొమయం లోకి జనాల బ్రతుకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేసాయి…
   కేవలం దబ్బు సంపాదనే ధ్యేయం గా రాజకీయాల్లోకి వస్తున్నారు…అదే చేస్తున్నారు కూడా…
   ప్రజాస్వామ్యం ఎవరికీ?
   ఆలోచించి …తమకు ఎవరు మేలు చేస్తారో వారిని గెలిపించుకునే వాళ్ళకు గానీ..
   బ్రాందీ సీసాలకీ బిర్యానీ పేకెట్లకీ పరిగెత్తే జనానికి ప్రజాస్వామ్యం పనికి రాదు…
   చుట్టు పక్కల దేశాల అభివృద్ది చూస్తే కడుపు మండి పోవడం కాయం…
   అడుగు తీసి అడుగు వేస్తే…అంతా అవినీతే…క్రింది నుంచి పై స్థాయి వరకూ అడ్డూ అదుపూ లేని అవినీతి..

 2. ఒక దేశాన్ని నడిపించేది రాజకీయ నాయకులే…వాళ్ళ ఆలోచనలే దేశానికి దిశను చూపిస్తాయనడంలో సందేహం లేదు…మన నాయకుల ఆలోచనా విధానం ఈ దేశాన్ని అయొమయం లోకి జనాల బ్రతుకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేసాయి…
  కేవలం దబ్బు సంపాదనే ధ్యేయం గా రాజకీయాల్లోకి వస్తున్నారు…అదే చేస్తున్నారు కూడా…
  ప్రజాస్వామ్యం ఎవరికీ?
  ఆలోచించి …తమకు ఎవరు మేలు చేస్తారో వారిని గెలిపించుకునే వాళ్ళకు గానీ..
  బ్రాందీ సీసాలకీ బిర్యానీ పేకెట్లకీ పరిగెత్తే జనానికి ప్రజాస్వామ్యం పనికి రాదు…
  చుట్టు పక్కల దేశాల అభివృద్ది చూస్తే కడుపు మండి పోవడం కాయం…
  అడుగు తీసి అడుగు వేస్తే…అంతా అవినీతే…క్రింది నుంచి పై స్థాయి వరకూ అడ్డూ అదుపూ లేని అవినీతి..

 3. @తాడేపల్లి..మనకిప్పుడు దేశవ్యాప్తంగా మంచి జఱిగే అవకాశం బహుశా లేదు. …
  మరి లేదు..సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయ్..
  క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ అవినీతి…స్వార్ధమ్…స్వప్రయోజనాలే ..పరమావధి అయిపోయింది..
  చుట్టూ ఉన్న ప్రపంచం లో ఏమ్ జరుగుతూందో చదూకున్నవాళ్ళకు కూడా తెలీదు…
  ఇక కుల గజ్జి..ప్రాంతీయ గజ్జీ..మత గజ్జీ..కుటుంబ రాజకీయాలు…అన్నీ ఉన్నాయ్…సర్వ నాశనం కాడానికి…
  ఈ దేశం లో ఒక్క రాజకీయ నాయకుడికైనా ఫ్యూచర్ విజన్ అనేది ఉందా…ఈ దేశాన్ని ఉన్నత స్థానానికి చేర్చే ప్రణాళిక ఒక్క పార్టీ వద్దనైనా ఉందా??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s