ఒక లీటరుకు…వంద కిలోమీటర్లు..వావ్…


ఈ క్రింది వార్త చూడండి.. సూర్య దిన పత్రిక [ఆదివారం] నుండి…

ఈ కారు మైలేజీ లీటర్‌కు వంద కిలోమీటర్లు ..

రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో సొంతవాహనాలను అమ్ము కునే పరిస్థితులు దాపురిస్తున్న ఈ రోజుల్లో.. ఇప్పుడున్నదానికంటే.. రెండు, మూడు రెట్ల మైలేజీని ఇచ్చే కారుంటే.. ఎలావుంటుంది? వాహనచోదకులు మరో రెండు కార్లు కొనేయరూ! కారేంటి..! లీటరు డీజిల్‌కు 100 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం ఏంటీ..!! అసాధ్యం అనుకుంటున్నారా.. అస్సలు లీ టరుకు 100 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగల కారును మనం కలలో కూడా ఊహించుకోగలమా! అని కొట్టి పారేయకండి. ఎందుంకంటే అచ్చం అ లాంటి కారునే జర్మనీకు చెందిన ఆటో మొబైల్‌ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ తయారు చేసి రికార్డు సృష్టించింది.

కొన్ని మాసా ల క్రితం ఖతార్‌లో జరిగిన ఓ మోటార్‌ షోలో ఈ హైబ్రిడ్‌ కారును ప్రదర్శనకు కూడా ఉంచింది.
ఖతార్‌లో నిర్వహించిన ఆటో షోలో ప్ర పంచం నలుమూలల నుంచి కార్ల కంపెనీలు తరలి వచ్చి తమ తమ లేటెస్ట్‌ డిజైన్లను ప్రదర్శనకు ఉంచాయి. కాగా.. వీటన్నింటి లోకి వోక్స్‌వ్యాగన్‌ సంస్థ ప్రదర్శించిన లీటరు కు వంద కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఎక్స్‌. ఎల్‌1 కారు ప్రధాన ఆకర్షణగా నిలిచి చూప రుల మది దోచుకోవడంతో పాటు విమర్శకు ల ప్రశంసలను సైతం అందుకుంది. త్వరలోనే ఈ కారును మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఈ కారు ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

ఇవీ ఎక్స్‌.ఎల్‌1 విశేషాలు: వోక్స్‌వ్యాగన్‌ 12 ఏళ్ల పరిశోధన ఫలితమే ఈ ఎక్స్‌.ఎల్‌1 కారు. ఈ కారు తయారీకు 2002లో శ్రీకారం చుట్టారు. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది డీజిల్‌/బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 99 మైళ్లు. ఈ కారు తక్కువ బరువు ఉండే విధంగా దీనిని కార్బన్‌ ఫైబర్‌తో రూపొందిం చారు. దీని హార్స్‌పవర్‌ 47 హెచ్‌పి, ఇంజన్‌ సామర్థ్యం 800 సీసీ, దీనిని 2-సిలిండర్‌ టర్బో డీజిల్‌ డిడిఐ ఇంజన్‌ తో పాటు 27 హెచ్‌పి సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఇంజన్‌తో రూపొందిం చారు. ఇది బ్యాటరీ మరియు డీజిల్‌పై నడుస్తుంది. ఒక్క బ్యాటరీ పవర్‌తోనే ఇది 22 మైళ్ల దూరం ప్రయాణించగలదు.

వెంటనే కారు మార్చేద్దామా??

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s