మనం మరీ అంత బకరాలమా???


మా టీవీ మ్యూజిక్ చానెల్ లొ రాత్రి పదీ పదిన్నర తర్వాత ఒక అమ్మడు ప్రత్యక్షమై ఒక లేక ఇద్దరు తారడుల అర ముక్క ముకాల్ని చూపించి..వీళ్ళెవ్వరో చెప్పుకోండి ఓ పాతిక వేలు ఇస్తా అంటూ గేమ్ మొదలు పెడుతూంది…
చూడ గానే చిన్న పిల్లలు కూడా గుర్తు పట్టే విధంగా ఉంటారు…ఆ తారళ్ళు..ఇన్కేం మీరు మొబైల్ తీసుకుని కాల్ చేసారా నిమషానికి పది రూపాయలు చొప్పున మీకు అరిగి పోద్ది..ఎంత సేపు హోల్డ్ లొ ఉంటె అన్ని నిమిషాలూ అన్ని పది రూపాయలు మీకు కాలిపోతాయన్నమాట…
తర్వాత ఫొన్ మోగడమ్ మన యాంకరమ్మ ఎత్తగానే సంభాషణ విచిత్రం గా ఉంటుంది.. ఎవరు మాట్లాడు తున్నారు అని మన పొట్టి గవును యాంకరమ్మ అనగానే అట్నుండి…రమేష్…లేదా..బాస్కర్..లేదా..వెన్కట్..అంటూ ఒక్క ముక్క జవాబు ..
తర్వాత ఏ వూరు అనగానే బెంగులూర్…లేదా నిజామాబాద్…ఏలూర్..అంటూనో ఒక పొడి పొడి జవాబు..ఈ తారడు ఎవరనగానే ఏ నాగయ్య అనో ఎస్వీ రంగారావు అనో …ఏ మాత్రమ్ కరెక్ట్ కాని సమాదానం…
అంతే మళ్ళీ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది..కరెక్ట్ గా సమాధానం చెప్పే మగాడు గంటా గంటన్నరకు గాని పాపం లైన్లోకి రాడు…అప్పటికీ … ప్రోగ్రాం ముగించాలి కాబట్టి నిజమయిన ప్రేక్షకుడి ఫొన్ లైన్లో కి వస్తూంది…కాని అప్పటికే బహుమతి మొత్తాన్ని మూడొంతులు కోసేస్తుంది మన యాంకరమ్మ..
జనాల్ని ఇంత వీర్రి వెధవల్ని చేసే ప్రొగ్రాం జాతీయ చాన్నెల్లో కూడా రాత్రి వేళల్లొ వస్తూంది…కావాలంటే రెండు పువ్వుల్ని రెండు చెవుల్లొ పెట్టుకుని రాత్రి పది తర్వాత టీవీ ముందు కూర్చోండి…ఎన్ని నీతులు చెప్తారండీ ఈ ఛానెల్ వాళ్ళు తెల్లవారితే..

ప్రకటనలు

3 Comments

  1. అబ్బ నేను కూడా చూసా సోది ప్రోగ్రాం .. చావా గొట్టి చెవులు మోస్స్తుంది ఆవిడ .. చాల చిరాగ్గా అనిపించింది ఒక్కసారి చూడగానే

  2. హహ నిజమె,,ఒకసారి నేను చూసా,,,ఆ రోజు తర్వాత ఇప్పటిదాకా తొమ్మిది గంటల తర్వాత ఆ ఛానెల్ అస్సలు పెట్టలేదు..అంత చికాకేసింది…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s