నా లోకం నాదీ..


అమ్మా సురేఖా …రోజూ వింటున్నాం కదా అని అలా రెచ్చి పోతే ఎలాగమ్మా..
ఆ సాక్షీ వాడు ఒకడు మరో సపోర్ట్ లేక మీ యెనకాల పడుతున్నాడని మమ్మల్ని ఇలా …గేస్తే ఎలా తల్లీ..
రాజశేకరుడు మీకు జీవితం పెట్టాడని ఇక వాళ్ళు
ఏమి చేసినా.. దాన్ని.. ప్రతీదీ సమర్దించుకుంటూ
మమ్మల్ని ఇలా తినేస్తే ఎలా తల్లీ.. ప్రపంచం లో ఆ ఫామిలీ తప్పా..
మరోటి లేదన్నట్టు తమరు మాట్లాడే తీరుకు చస్తూన్నాం..
ఆ నూతి లోంచి బయటకు రా తల్లీ..

సురేఖమ్మ ప్రపంచాన్ని దిగువున చూడండి…సూర్యా పేపర్ నుండి…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప మాజీ ఎంపీ జగన్‌ మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమాధానం చెప్పాలని పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ కోరారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి జీవం పోసి, అధిష్టానం ప్రమేయం లేకుండా పరిపాలన సాగించడంతో తమ ప్రమేయం తగ్గిందనే భావనతో ఉన్న అధిష్టానం వైఎస్‌ కుటుంబాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్ర పన్నిందని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్‌ కేంద్రం ప్రమేయం లేకుండానే ప్రజలకు దగ్గర ….
తనకు వైఎస్సార్‌ తండ్రి లాంటివాడని ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయంగా ఎదిగానని చెప్పారు. జగనన్నకు తోడుగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధించాలంటే ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 2014 లో జరిగే ఎన్నికల్లో పార్టీ 26 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అధిష్టానం ప్రమేయం తగ్గుతుందనే భయంతో వైఎస్‌ కుటుంబంపై విమర్శలు చేస్తూ, సొంత కుటుంబ సభ్యులను విభజించి పాలించు అనే నినాదంతో ముందుకు సాగుతున్న అధిష్టానం భవిష్యత్తులో ఘోరంగా దెబ్బతింటుందని అన్నారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s