నా గొర్రె ప్రజలు..


నలుగురు ఆటో లో ప్రయాణిస్తారు..ఆక్సిడ౦ట్ అవుతూంది…ఇద్దరు చస్తారు..ఇద్దరికి కాళ్లూ
చేతులూ విరుగుతాయి..బస్..రైళ్లూ..విమానాలూ..ఇవ్వన్నీ ఎవరూ కావాలని ఆక్సిడెంట్ చేయరు..
అన్నింటిలోనూ భద్రతకు సంబందించిన అనేకమయిన జాగ్రత్తలు తీసుకోబడతాయి..

కానీ ఆసుపత్రుల్లో అదీ అనారోగ్యం తో ప్రాణానికి అనేక రకాలుగా ముప్పు
అంటే జబ్బువల్ల గానీ మందుల వల్లగానీ చేసే సర్జరి వల్లగానీ
లేదా మత్తు ఇచ్చేడప్పుడు గానీ అన్నీ విధాలుగా ఎంతో రిస్క్ వున్న సమయంలో
ఒక రోగి చని పోతే ఎందుకు జనం ఇంతగా హింసకు దిగుతున్నారు?
కారణం ఒకటే కనబడుతూంది..
డాక్టర్లను తన్నినా నర్సులను తన్నినా అడిగే నాధుడు వుండడు
అదే నాలుగో తరగతి తోటీలు మోహమ్మీద వుమ్మేసిన కూడా ఈ రోగులూ
వారి బందువులూ నోరుమూసుకుని ఊరుకుంటారు..ఎందువల్ల??
వాళ్ళతో పెట్టుకుంటే పాయిఖానాలు కడిగించేస్తారు కాబట్టి..

బస్స్ డ్రయివరునో ఆటో డ్రయివరునో ట్రైన్ ఆక్సిడెంట్ అయినప్పుడు రైల్ వే
అధికారులనో ఎందుకు ఇంత గట్టిగా వాయించరూ..వాళ్ళతో పెట్టుకుంటే తొక్క తీస్తారు గాబట్టి..

ఏ డాక్టరూ కావాలని ప్రాణాలు తీయడు..కేవలం రిస్క్ explain చేయకపోవడం వల్ల
రోగి భందువులు అయోమయానికి గురి కావడం వల్ల ..వీధికి నాలుగు ఆస్పత్రులు
రావడం తో అవైలబిలిటీ ఎక్కువై డాక్టర్ల నిజాయితీ తక్కువై …ముక్యమ్ గా ఒక డాక్టర్ ని తన్నినా
మిగతా వాళ్ళు వాళ్ళ వ్యాపారం చక్కా చేసుకుంటారే గానీ ..[ఎమర్జెన్సీసర్విస్లు ఆపకూడదన్న సాకుతో ]
ప్రజలకు ఏ విదమయిన సర్విస్ దొరక్క పోవడం అంటూ వుండదు గాబట్టీ..
మానవత్వం తో వుండాల్సిన డాక్టర్లు తన్నులు తీనొచ్చుగానీ…విధులను బహిష్కరించకూడదు గాబట్టీ..
ఇలా కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్టు..
డాక్టర్లు ఈ దేశపు గొర్రె జనాల చేతుల్లో దెబ్బలు తింటూనే వుంటారు..

ఒక్కటి మాత్రం నిజం
ఏ డాక్టరూ రోగి చనిపోవడాన్ని జీర్ణించుకోలేడు…యధా శక్తీ చివరివరకూ
బ్రతికించడానికి ప్రయత్నిస్తాడు..
ఏ డాక్టరూ తన దగ్గరకు వచ్చిన రోగిని చంపడు…
ఈ దేశపు గొర్రెలు ఎప్పటికయినా ఈ విషయాన్ని గ్రహిస్తాయని ఆశిద్దాం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s