ఇంతేనా ఈ జీవితం?


ఉదయం ఆరుకో ఏడుకో హడావిడిగా లేవడం. మళ్ళీ ఏ అర్ధ రాత్రో రెండుకో మూడింటికో చేరుకోవడం..మళ్ళీ ఉదయమే
హడావిడిగా లేవడం..అదీ ఒకోసారి ఎమర్జెన్సీ కాల్తో..
పిల్లలు ఎక్కడో దూరంగా హాస్టల్లో.. ఇంట్లో ఆవిడ పనులు చేసుకుంటూ..
ఒక బ్లాగ్ లేదు..పేపర్ లేదు..మేము అందరిలా గడుపుతున్నాం అన్న బిల్డప్ ఇవ్వడానికి
ఆదరాబాదరగా ఒక సెకండ్ షో కి వెళ్ళడం అక్కడనుండి కూడ
మద్యలో పన్లోకి పారిపోవడం…నా లాంటి వాళ్ళని చాలా మందిని
చూశాక నాకో సందేహం పట్టుకుంది…ఇది సరయిన జీవనమేనా??
ఇలా ఇల్లూ వాకిలీ పిల్లా పిచ్చుకల్ని వదలి 24 గంటాలూ
పని చేసుకుంటూ బిజీ గా వున్నామ్ అని గొప్పలు పోతున్నామా??
లేకపోతే ప్రపంచమంతా ఇలానే వున్నారా?
మరి వుదయం నించి అర్ధరాత్రి వరకూ పని చేసుకుంటూ బ్రతికేదానికి మనిషి పుట్టుక అవసరమా??
దీన్ని గాడిద చాకిరీ అనరా?అయితే ఇది మనిషి జన్మా?లేక?
మళ్ళీ అదే అనుమానం ..మనిషి జీవించే విదానం ఇదేనా?
లేక గాడిదలా చాకిరీ చేస్తూన్నామా??గాడిద చాకిరీ చేస్తూ తృప్తి పడుతున్నామా??
[ఏ గాడిదనూ అవమానించడం నా వుద్దేశ్యం కాదు..]

6 Comments

 1. థాంక్స్ ఆండీ భానూ గారూ…ఒప్పుకున్నారు…ఒకాయనయితే..అబ్బే మేము ఏ సినిమా మిస్ అవ్వం అంటాడు..మొక్కుబడిగా నెలకో సినీమాకు పోతూ…అదీ చీకట్లో అందరి కాళ్లూ తొక్కుకుంటూ సినీమా మొదలయిన ముప్పావు ఘంటకు వెళ్ళి..ఒ ఘంటన్నర నిద్ర పోయీ..చివరాకరకు ఇంట్లో నిద్ర పూర్తి చేసి…మేమూ జీవిస్తున్నాం సుమీ…అంటాడు…చెప్పండి ఇది మొక్కుబడి తంతు కాదా??

 2. sarathswor ts always better to take some time off

  హమ్మమ్మా…ఎంత మాట కాళీగా వుంటే ఎలా?అసలు పని లేక పోయినా అర్ధరాత్రి వరకూ
  వున్న పనిని సాగ దీస్కునే ప్రముఖులున్నారు.. బిజీగా కనబడాలి..వ్యాపారాల్లో అదో..సూత్రం..
  మనం బిజీగా వున్నట్టు కనబడితేనే కదా వందిమాగదులు భజన చేసేది..పనిలో పనిగా అమ్మాయి.కులు ట్రాప్లో
  పడేది..

 3. మీరు మనిషి అనిపించుకున్నారు. మనసు ఉపయోగించే వాడే మనిషి లేకపోతే గాడిదే మరి. గాడిద కూడా చాలా మంచిది ఎంతో సాధువు పగలంతా (గాడిద)చాకిరి చేసి ఆవో గేదో వదిలేసిన గడ్డి కొంచం తిని బతుకుతుంది. కాని గాడిద చాకిరి అనే మాట ఎందుకొచ్చింది మరి? ఈ నాడు మనుషులు డబ్బు సంపాదన వెనుక పిన్నా పెద్దా కుటుంబం అంతా కలిసి సంపాదించినా సరిపోవట్లేదు మరి దీనిని గాడిద చాకిరి అనే అనాలి మరి కొంత మంది వర్క్ ఇస్ వర్షిప్ అంటారు గొప్పగా కాని గాడిద వర్క్ ఇస్ వర్షిప్ అయితే వర్షిప్ గాడిద అవ్వాలి కదా? బుద్ధిలేకుండా చేసే పనిని గాడిద చాకిరి అంటారు. అందరికి ఇది తెలిసిన విషయమే. మరి తెలియ వలసినది ఏమిటంటారు? బుద్ధి మంతులకే బుద్ధి మంతుడు పరమేశ్వరుడు మనిషికి ఇచ్చిన మొదటి వరం బుద్ధి. ఎలా ఇచ్చారు తప్పకుండా మన మధ్యకు వచ్చి ఇచ్చి ఉండాలి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః అన్నారు కదా బ్రహ్మ గురువు కన్నా విషు గురువు కన్నా కూడా మహేశ్వరుడే గురువైనప్పుడు మన మధ్యలోకి వచ్చి గురువు పాత్ర చేసినప్పుడు అప్పుడు అప్పుడు ఈ బుద్ధిలేని గాడిద చాకిరి మాని ఆయన శ్రేష్ట మతం(అభిప్రాయం) అనుసరించి మంచి పనులు విశ్వ కళ్యాణ కారి పనులు చేస్తాము అంతా వరకు ఆ సద్గురువు ఆ యుగాపురుశుడిని తెలుసుకునేంత వరకు మనం చేసేది గాడిద చాకిరివే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s