ఎం.పీ. గారి వీరంగం


ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చిన ఎంపి ఇంత చెత్త గా ప్రవర్తిస్తే ప్రజలు
ఇక లా & అర్దెర్ కి ఇంకేం గౌరవిస్తారూ??
రాజకీయ లబ్ధికోసం ఓట్ల కోసం విరగదీసే ప్రకటనలు ఇచ్చినపుడు
దాని తాలూకు మంచి చెడూ కూడా భరించడానికి సిద్దం గా వుండాలి కదా?
పోలీస్ లు కేస్ పెట్టారని తెలీగానే హూందా గా వెళ్ళి లొంగి పోవడం అనేది
చట్టాన్ని గౌరవించే వాళ్ళు చేయాల్సిన పని…
అది మానేసి పెంట పెంట చేసి..తిరిగి పోలీస్ ల మీద కరవడానికి పోవడం..
ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తూంది?ఒక ఎంపి చట్టం పట్ల ఇలా ప్రవర్తిస్తే..
ఇక సామాన్య మూర్ఖ మానవులు చట్టాన్ని కోర్టులనూ ఏం గౌరవిస్తారూ
అనీ??ఇప్పటికే సినిమాల పుణ్యమా అని జనానికి మంచీ చెడు అన్న
వివక్ష మార్చి పోయారు..
ఇక ఒక ఎంపి ఈ విధమ్ గా ప్రవర్తిస్తే?
పైగా దాన్ని కూడా తనకు అనుకూలం గా మార్చుకోవాలని చూడ్డం??
పెద్ద డ్రామా నడపడం??
దానికి ఈ తోక గాళ్ళు పెద్ద హడావుడి చేయడం..
ఈ రాజకీయుల పై మరింత అసహ్యం వేయడం లేదూ??

ఈ వార్త చూడండీ…

బాబోయ్ యముళ్లు!
చెప్పడానికే సిగ్గేస్తోంది.. చీర చించేశారు
సీఎం, హోం మంత్రి సమాధానమివ్వాలి
ప్రధానికీ, స్పీకర్‌కూ ఫిర్యాదు చేస్తా
పోలీసులపై విజయశాంతి ఆగ్రహం
హైడ్రామా నడుమ అరెస్టు, విడుదల

హైదరాబాద్, జూలై 3 : టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి చుట్టూ మరో రోజంతా హైడ్రామా! అవే నినాదాలు, ఉద్రిక్తతలు! నడిరోడ్డుపై అరెస్టు! చీరలాగి చించేశారని ఆరోపణ! శుక్రవారం విజయశాంతిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన పోలీసులు శనివారం అనుకున్నది సాధించారు. మెదక్ జిల్లా దుబ్బాకకు బయలుదేరిన ఆమెను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో పోలీసులు అడ్డుకున్నారు. విజయశాంతిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు.

పోలీసులు వారిని పక్కకు తప్పించి… విజయశాంతిని అరెస్టు చేసి నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అరెస్టు చేసే సమయంలో ఏసీపీ చంద్రమౌళి అసభ్యంగా ప్రవర్తించినట్లు మేజిస్ట్రేట్‌కు విజయశాంతి ఫిర్యాదు చేశారు. కారులోంచి పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఈ క్రమంలో తన దుస్తులు చిరిగాయని చెప్పారు. జడ్జి ఆమె ఫిర్యాదును సుమోటోగా స్వీకరించినట్లు తెలిసింది.

‘నాకు బెయిల్ వద్దు. జైలుకే పోతాను’ అని రాములమ్మ స్పష్టం చేయడంతో న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు ఆమెను చంచల్‌గూడకు తరలించారు. తనపై కేసు ఉపసంహరించుకునేదాకా మంచినీళ్లు కూడా ముట్టనని, బెయిల్ తీసుకోనని ఆమె భీష్మించుకు కూర్చున్నారు. చివరికి… కేసీఆర్ కుమార్తె కవిత మధ్యవర్తిత్వంతో మెత్తబడ్డారు. బెయిలు తీసుకుని జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నుంచి విడుదల దాకా భారీ స్థాయిలో హైడ్రామా నడిచింది.

ఉదయం నుంచే హడావుడి
విజయశాంతిని అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలియడంతో శనివారం ఉదయమే పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నేతలు ఆమె నివాసానికి వచ్చారు. అక్కడే ఆమె విలేఖరులతో మాట్లాడారు. చేనేత కార్మికుల పాదయాత్ర, హరీశ్‌రావు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దుబ్బాక వెళ్తున్నానని ప్రకటించారు.

“అరెస్టులకు భయపడడంలేదు. శుక్రవారం పోలీసులు వ్యవహరించిన తీరే బాధాకరంగా ఉంది. సెర్చ్ వారెంట్ లేకుండా నా బెడ్‌రూమ్‌లోకి వచ్చారు. అల్మరాలు వెతికారు. నీళ్ల ట్యాంక్‌లోనూ కర్రలు తిప్పి శోధించారు. నేను వారి కళ్లకు ఎలా కనిపిస్తున్నాను?” అని ఆగ్రహించారు. అరెస్టు అయి, బెయిలుపై విడుదలైన తర్వాత ఆమె నేరుగా టీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే విలేఖరులతో మాట్లాడారు. “ఇప్పుడే యముళ్ల నుంచి బయటపడ్డాను. మాట్లాడే ఓపిక లేదు’ అంటూనే పోలీసులపై మండిపడ్డారు.

“నేను లేనప్పుడు ఇంటికి వచ్చి, వెతికి పోయారు. ఆ తర్వాత నేను వెళ్లి ఇంట్లోనే ఉన్నాను.. అరెస్టు చేసుకోండి అని చెప్పాను. పోలీసులు వస్తున్నాం.. వస్తున్నాం అంటూ రాలేదు. ఉదయం కూడా రాలేదు. సిద్దిపేటకు బయలుదేరాక రోడ్డుమీద అడ్డుకున్నారు. కారు డోర్లు పగలకొట్టి డ్రైవర్ని లాగారు. ఎంపీననీ, మహిళననీ చూడలేదు. చెప్పుకోడానికే సిగ్గనిపిస్తోంది. చీర చించేశారు. మహిళా పోలీసులు వెనుక నుంచి నలిపేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది అప్రజాస్వామికమని, అరాచకమని ధ్వజమెత్తారు. తీరా కోర్టు వద్దకు వెళ్లాక… కోర్టు ఆవరణలోనే అరెస్టు చేసినట్లుగా సంతకం పెట్టాలని పోలీసులు ఒత్తిడి చేశారన్నారు. దానికి తాను ఒప్పుకోలేదని, 15 నిమిషాల పాటు వాగ్వాదం జరిగిందని చెప్పారు. జడ్జికి వాస్తవం వివరించానన్నారు. “జైలు అనుభవం ఇదే మొదటిసారి. అందరూ అనుకున్నట్లుగా జైల్లో ఏమీ లగ్జరీగా ఉండదు. 50 మంది మహిళల మధ్యలో నన్ను ఉంచారు. అక్కడ కూడా జై తెలంగాణ అనిపించాను.

నా అరెస్టుపై ముఖ్యమంత్రి రోశయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పాలి” అని విజయశాంతి డిమాండ్ చేశారు. ఉదయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చే వరకు తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదన్నారు. తన అరెస్టు శాంతిభద్రతల సమస్యకు దారి తీయవచ్చనే సమాచారం అందిందని, బెయిలు తీసుకోవాల్సిందిగా కేసీఆర్ చెప్పారని విజయశాంతి తెలిపారు.

తన వల్ల పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ బెయిల్ తీసుకున్నానన్నారు. ఎంపీని అనే మర్యాద కూడా లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు గురించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, స్పీకర్‌కు లేఖ రాస్తానని విజయశాంతి వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళతానన్నా

[ఎంపీ నన్న స్పృహ నీకుందా..శాంతమ్మా??దీన్నోక ఇష్యూ చేయాలని పాపులర్ అవుదామన్న
దురద తప్ప.. ప్రజాస్వామ్యకంగా నువ్వు ప్రవర్తించావా?నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళి వాళ్ళ పై నిప్పులు చెరిగితే??
ఎలా ]

ప్రకటనలు

18 Comments

 1. మీ బొంద…. వాళ్ళ ఇంటిలో వాళ్ళేమైనా మాట్లాడతారు ,,, వాళ్ళేమైనా బహిరంగ సభలో మాట్లాడారా ?…. అది తప్పేలా అవుతుంది… కాపు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని డీ శ్రీనివాస్ అనటం తప్పు కాదా ? మరి అతనిపై చర్య ఏది ? నీ లాంటి వాళ్ళు వ్రాయటం సరైన పని కాదు … మొదట నేర్చుకో …. నువ్వు తాత వి కాదు బచ్చా వి ….

 2. మెంటల్ తెలబాను ..ఆవిడ అన్నది ఇంట్లొను, పాయిఖానాలొను కాదు బుజ్జి పత్రికా విలేఖరుల ముందు. నిన్న కె సి ఆర్ ఈ ఎపిసొడ్ వల్ల 3% ఓట్లు పెరుగుతాయి అంటే ఏమిటొ అనుకున్నా నీ లాంటి మట్టి సుద్ద గాళ్ళుంటారని నా కళ్ళు తెరిపించావు.

  • ఒక్కటే ప్రశ్న … ఆమె అన్నది పత్రికా సమావేశం లో నా ? .. నాకు తెలుసు ఆమె అన్నది పార్టీ సమావేశం లో అని.. అది నీకూ తెలుసు … పత్రికా విలేకరుల కోసం ఆమె ఈ విధమైన ప్రకటన ఏమైనా ఇచ్చిందా ? … మీకు అనుకూలం గా మలచుకుంటూ రాసి ..ఆంధ్రా వారి దొంగ బుద్ది ప్రదర్సించావు …

   • tokkatolu: మనిషి స్థాయి ని నరకటం అనేది ఇక్కడ కామన్ … మస్తు కోసినవ్ పో అంటరు..అంటే నిజం గా కోసినట్ట్లా ?…. ముందు ఇక్కడి వ్యావహారికాన్ని తెలుసుకుని మాట్లాడు … ఏమీ తెలియకుండా వచ్చి ఏలు పెట్టకు …

   • అమ్మా అడ్డం గా వచ్చినవాళ్లను నరకేయ్యాలి అంటే మస్తు కోసినావ్ పో అనా అర్ధం ఏమి చెప్పినావ్ నువ్వు పెట్టమాకా ఎక్కడో ఎక్కడెక్కడో యేళ్ళు జాగ్రత్త. మీ మాటలు కు మీరే నా నా అర్ధాలు చెప్పుకునే వాళ్ళు వేరే వాళ్ళ బుద్ది మీద పది ఏడవటం ఎందుకు. అసలు ఇక్కడ ఆంధ్ర వాళ్ళ బుద్ది గురించి మాట్లాడే అవసరం నీకేం వచ్చింది .

   • ఇంక చాలు … సామెత కి చెప్పిన దానికి ఉదాహరణకి చెప్పిన దానికి పోలిక పెడుతున్నవ్.. అందితే జుట్టు …లేక పోతే కాళ్ళు ..

   • దొంగ బుద్ది అని సాటి తెలుగు వారి పట్ల జరిగిన దోపిడీ విధానాన్ని గురించి నేను మాట్లాడితే … నువ్వు ఎందుకు భుజాలు తడుము కుంటున్నావు ?….

   • “ఆంధ్రా వారి దొంగ బుద్ది ప్రదర్సించావు” – ఇందుకు ఈ extra cuttings కి – ఇదా నువ్వు మాట్లాడేది నీకేమి అవసరం ఆంధ్రా వాళ్ళ బుద్ది గురించి మాట్లడనీకి .

   • .. ఆంధ్రా దోపిడీ దారుల దొంగ బుద్ది గురించి రాసింది.. ఎక్కడో శ్రీకాకుళం లో చేపలు పట్టుకునే వాళ్ళకీ తెలంగాణా కి ఏం సంబంధం .. ? వాళ్ళూ ఆంధ్రా వాళ్ళే ….. పరిస్థితులను బట్టి అర్థం చేస్కో … ఐతే ఇక నుంచి కొంచెం క్లారిటీ ఇస్తూ వ్రాస్తాలే ….

 3. సరే ..నేననేది పోలీస్ లతోనూ కోర్టు వారెంట్లూ వచ్చినపుడయినా మనం హూందా గా నడుచుకోవాలిగా…పెద్దవాళ్లే ఇలా ప్రవర్తిస్తే సామాన్యులు ఎలా మర్యాద గా ప్రవర్తించడం నేర్చు కుంటారూ??అనీ…ఎంత సేపూ ప్రతీ సంఘటనుండీ రాజకీయ లబ్ది పొందాలన్న యావ తప్పితే ప్రజలకు మరే సందేశాన్ని ఇస్తాయి ఈ సంఘటనలు?

 4. మీడియా వాళ్ళకు పని లేదు ఇరవైనాలుగు ఏడు రోజుల సమాచారం ఇవ్వాలి ఏమి ఉంటుంది కొత్త సమాచారం అందుకే అనవసర మైన వాటికి అతిగా స్పందిస్తున్నారు. లేకపోతె ఈ తెలంగాణా వాళ్ళు ఉరికే నెత్తి కొట్టుకోక పొతే కొంచం నిదానంగా ఆలోచిస్తే బాగుండును. ఉన్న తలకాయ నెప్పులు చాలకన ఇంక తెలంగాణా వాదం ఒకటి మళ్లీ మొదలు పెట్టారు. బాబు మీ తెలంగాణా మీరే తీసుకోండి కాని ఉత్తి పుణ్యానికి మీ తోటి వాళ్ళమైన మమ్మల్ని ఆడి పోసుకోకండి. వెధవ ఏడుపు మీరును.ఎవల్లో ఏదో కొట్టేసినట్లు ఏడుస్తారు ఎందుకు దమ్ముంటే నాయకులై నడిపించండి ఉత్తుత్తి వాదనలు వద్దు తీర వలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి ఏదో దేశభక్తులం అనుకోకండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s