డబ్బు పంచుకుంటున్న దొంగలు..ప్రజాస్వామ్య బద్ధమ్ గా…
మరో 3500 కోట్ల రూపాయలు వొట్ల వేట లో ఈ రాష్ట్రం దారపోసింది…ఈ ఏడాదికి…,
ఓట్ బాంక్ రాజకీయాలతో వ్యూహాత్మకం గా ys బీసీ వొట్లకు గాలం వేశాడు..
అయితే ఆయన ఊహించనిది మరోటి జరిగింది…
సీట్లు మిగిలి పోయి విద్యార్ధులు జాయిన్ అవ్వక ఇంజినీరింగ్ కాలేజీ లు మూత పడే
పరిస్థితి నుండి…ఒనర్లు మరో కాలేజీ పెట్టేంత గా సొమ్ములు వచ్చాయి..
ఈ రీయెమ్బార్స్మెంట్ పుణ్యమా అని..
ఫీజులు కట్టక్కరలేదు.కానీ విద్యార్ధులతో ..కాలేజీలు నిండాయి..
ఫుల్లుగా ఫీజుల బిల్లులు కోట్లాది రూపాయలు వస్తూన్నాయ్…మరో కాలేజీ పెడితే
మరింత సొమ్ము..గవర్నమెంటే కడుతూంది..సో భారీ గా సొమ్ము కేటాయించాల్సిన పరిస్థితి..
ఇప్పుడు ప్రభుత్వం మీద పడింది..
ఇక ఈ విద్యార్ధుల చదువు స్టాండర్డ్ గురించి ఎంత తక్కువ మాట్లాడు కుంటె అంతా మంచిది..
పాస్ అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా వుందని ఒక హాస్తెల్ నిర్వాహకుడు చెప్పారు..
గవర్నమెంట్ ఫీజు కడుతుంది..వచ్చి చేరమని అడిగితే చేరామ్ గానీ… అంటున్నారు ఈ
పరీక్షలు పోయిన పిల్లలు..
మరిన్ని కాలేజీ లు పెట్టి మరింత సొమ్ము గుంజేద్దామ్..మాంచి ఛాన్స్ అని ప్రైవేట్ కాలేజీలూ…
సమర్దించక పోతే ఓట్ల వేట లో వెనక పది పోతామ్..అని రాజకీయ పార్టీ లు…

ఈ ప్రజా ధనమంతా దొంగల బారిన పట్ట పగలు..దోచుకో బడుతూంది..ప్రజాస్వామ్య బద్ధమ్ గా..

దొంగలు దొంగలు వూళ్లు పంచుకోవడం అంటే ఇదేనేమో??

దీక్ష విరమణ

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: స్కాలర్‌షిప్పులు, రీయంబర్స్‌మెంట్‌లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో ఆర్‌ కృష్ణయ్య, కిషన్‌ రెడ్డి దీక్ష విరమించారు. మంగళవారం రాత్రి మంత్రులు దానం నాగేందర్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రికి వెళ్లి వారిద్దరికీ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. బీసీల డిమాండ్లపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య ఐదు రోజులుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వీరి చేత దీక్ష విరమింపజేసిన అనంతరం మంత్రి దానం నాగేందర్‌ మాట్లాడుతూ అఖిలపక్షంతో జరిపిన సంప్రదింపుల్లో రోశయ్య సానుకూలంగా స్పందించారని చెప్పారు.

దీక్ష విరమింప చేసేందుకు ప్రభుత్వం తరుపున రాష్ర్ట ముఖ్యమంత్రి తననూ, మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను పంపించారని తెలిపారు.ట్యూషన్‌ ఫీజుల రీయంబర్స్‌మెంట్‌ కోసం తక్షణం రూ.1000 కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. హాస్టళ్ల అంశంలో కూడా బుధవారంజీఓ విడుదల చేస్తున్నామన్నారు. ట్యూషన్‌ ఫీజు రీ యంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు పోతాయన్న భయంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బడుగు బలహీనవర్గాల కోసం ప్రారంభించిన పథకాన్ని తమ ప్రభుత్వం కొససాగిస్తుందని స్పష్టం చేశారు. బీసీ సంక్షే మానికి సంబంధించి బోధనా ఫీజులు, ఉపకారవేతనాల అంశంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. కృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అనేకమంది ఆందోళన చెందుతు న్నారనీ ఇకపై అటువంటి సరిస్థితి రాదన్నారు.

బంద్‌ పిలుపును ఉపసంహరించుకున్న బీజేపీ
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీ నేత ఆర్‌ కృష్ణయ్య బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి కిషన్‌ రెడ్డి ఆమరణ దీక్షలను విరమింపచేసిన కారణంగా 2వ తేదీ రాష్ర్ట బంద్‌ ను ఉపసంహరించుకున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రభు త్వం సానుకూలంగా స్పందించటంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది.

అందరికీ వందనాలు.. ఆర్‌. కృష్ణయ్య
బీసీ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వంద నాలంటూ బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం రాత్రి దీక్ష విమరణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ ఉద్యమానికి ముఖ్యంగా తన ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు అందించిన వివిధ రాజకీయపార్టీల నేతల

2 Comments

  1. ఈ సొమ్మన్తా కాలేజీ యాజమాన్యాల జోబుల్లోకి పోతూంది గానీ బిసి ల కు జరిగే ఉపకారం చాలా తక్కువ…ఇంతకంటే ఒక బిసి సంక్షేమ నిధి ని ఈ సొమ్ముతో ఏర్పాటు చేసి వారిని నేరుగా ఆదుకోవడమే ఉత్తమమేమో??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s