#@$%^….అనగా??


నేను ఈ పదం మా నాన్న గారి దగ్గర తరచూ వినేవాడిని..
అర్ధం పూర్తిగా తెలియక పోయినా..వెధవన్నర వెధవ పనులు చేసే వాళ్ళకి ఈ పదం
సరీగ్గా సరిపోతుంద ని అనిపిస్తూ వుంటుంది..
నాకు ఎదురయ్యిన $#@**..గూర్చి చెప్తా…
[ఇది దొంగ వెధవలున్నారు జాగ్రత్త పోస్టుకు..continuation]
చిట్ పాడి డబ్బులు రాక ఆ చీటర్ ని కొన్ని నెలల పాటు బ్రతిమి లాడితే..
[ఇక్కడ చిట్ సంస్థ యజమాని ఇక మనకి కనపడదు..
విదేశాల్లో వున్న పిల్లల్తో నిశ్చలంగా ఫోన్ లో గడిపేస్తూ మరో చోట కొత్త
దుకాణం తెరిచి మరిన్ని గొర్రెల గూర్చి వేట సాగిస్తూ వుంటాడు..]నెల నెలా డబ్బు వసూల్ చేసే
ఏజెంట్ తమ సంస్థకు బాకీ పడ్డ వాడు అంటూ ఒక కాలేజీ ఓనర్ ను..అప్పగించి ఆ డబ్బు మాకు ట్రాన్సఫర్
అయ్యేట్టు పేపర్ ల మీద గీకించాడు..
[ఇప్పుడు కాలేజీ లకు ప్రిన్సిపల్..ఉపాద్యాయులూ అంటూ లేరు..ఒనర్లూ బ్రోకెర్లే మిగిలారు మన విద్యా వ్యవస్థ లో]

ఈ కాలేజీ ఓనర్ ..నాలుగు చిట్లు కట్టీ..మొదటే పాడేసుకునీ..తర్వాత ఆ డబ్బుతో
స్థలాలూ బిల్డింగ్లూ కట్టుకుని స్థిరాస్తులు కూడ బెట్టుకుని..ఆ తర్వాత నుంచీ చిట్ లకు డబ్బు ఎగ్గొట్టే
బాపత్తు పెద్ద మనిషి..
షరా మామూలుగా ఏడాదిన్నర పాటు అడిగించుకుని వాడూ మనీ ఎగ్గొట్టాడు..
[వీడు పిల్లలకి ఎం పాతాలు చెప్తాడో??]

కాలేజీ ఓనర్ మీద కోర్ట్ లో వేద్దామని నిర్ణయించామ్…
అదిరిపడ్డ ఆ ఓనర్ మా స్నేహ వర్గం లో ఒ ముఖ్యు స్నేహితుడిని పట్టాడు..
ఆ ముఖ్యు స్నేహితుడు ఆ ఓనర్ తన మిత్రుడనీ పరువు నిలబెట్టమనీ
మరింత సమయం ఇవ్వమనీ ప్రాదేయ పడ్డాడు..
నేను పెద్ద పుడింగి గాడిలా సరే ఎవరికయినా ఇబ్బంధులు వుంటాయ్…కొంత సమయం
తీసుకుని బాకీ తీర్చేయమన్నా…
రెండేళ్ళు గడిచింది…
ఇప్పుడు ఆ ముఖ్యుడ్ని నాయన టైమ్ అడిగావ్…రెండేళ్ళు గడిచింది
ఆ మనీ కాస్త అడ్జస్ట్ చేయించ వయ్యా అంటే?
నేనేక్కడ అడిగా??మీరే గా వసూలు చేయమని నన్నడిగారు అంటూ…అడ్డం గా బుకాయించాడు…
అప్పుడు అనుకున్నా ఈ పోస్ట్ పెట్టాలని…
అందరికంటే, కోర్ట్ కు వెళ్తామని తెలిసి…దయచేసి మరింత గడువు అడిగిన
ముఖ్య స్నేహితుడు..నేనేక్కడ గడువు అడిగా?అని బుకాయించి నప్పుడు..
@%$#అన్న పదం గుర్తు వచ్చింది..
ఈ కాలం లో మంచీ చెడూ లేవు..ఆ రోజుకి తన పబ్బం గడిస్తే చాలు..
అవసరమయితే కాళ్లు పట్టేయడం…లేకుంటే బుకాయించడం…
ఎవ్వరినీ నమ్మకండి..మీ నీడని కూడా…. ముఖ్యం గా డబ్బుకు సంబందించిన విషయాల్లో…

ప్రకటనలు

9 Comments

 1. మన వాళ్ళు వాడే తిట్లలో ఇంత హేయమైన తిట్టు మరొకటి లేదు. విపరీతమైన, అవమానకరమైన అశ్లీలార్ధం కలిగి ఉంటుంది. మీ ఆగ్రహం అర్ధం చేసుకో దగినదే. కానీ , వీలయితే, దయచేసి ఈ పదాన్ని మీ టపా నుండి తొలిగించ కూడదూ ?

 2. ఇలాంటిదే ఇంకో మాట ‘భాంచత్’–ఇక్కడ మాత స్థానాన్ని సోదరి ఆక్రమిస్తుంది!

  మహమ్మదీయుల నించి మన తెలుగు వాళ్ళు నేర్చుక్కున్న, ఓ నలభై యేళ్ళక్రితం విరివిగా వాడబడిన, మన సాహిత్యం లో కూడా విరివిగా చోటుచేసుకున్న, మహమ్మదీయులుకూడా ఇప్పుడు దాదాపు వాడడం మానేసిన మాటల్లో రెండు ఇవి!

  జోగారావుగారికి కూడా ఈ విషయం తెలిసే వుంటుంది–కానీ నాలాగ వ్రాయడానికి మొహమాటపడి వుంటారు!

  వ్యాఖ్యాతలందరికీ కూడా ధన్యవాదాలు.

 3. కృష్ణ శ్రీ గారూ, మీరు పేర్కొన్న రెండో పదం కూడ నేను చిన్నతనం నుండీ వింటున్నాను. ఒకప్పుడు తెలుగునాట అందరి నోళ్ళలోనూ విచ్చలవిడిగా నానిన ఈ దుర్మార్గపు పదాలు రెండూ మీరు చెప్పినట్టు అంతరించి పోవడం కాస్త ఊరటకలిగించే విషయమే.

  KVSV గారూ, అర్ధం చేసుకుని వాటిని తొలగించినందుకు ధన్యవాదాలు. మరో విషయం కృతఘ్నత అంటే చేసిన మేలు మరిచి పోవడం
  కృతఙ్ఞత అంటే చేసిన మేలు గుర్తుంచు కోవడం మీకు తెలీదని కాదు. టైపింగులో ఆ పదాన్ని వ్రాయడానికి ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తోంది

 4. మన వాళ్ళలో కొందరు పప్పులూ, బియ్యాలూ అనడం కద్దు. వీటిలో పప్పుల వరకూ ఫరవా లేదు కానీ రెండో పదం గురించి…
  తెలుగు వారికి సంబంధించినంత వరకూ ఆ రెండో పదంలో అశ్లీలార్ధం ఏమీ లేదు. కానీ ఒరియా వారికి మాత్రం ఆ పదం అభ్యంతరకరం అని విని ఉన్నాను. వాస్తవం తెలియదు.

 5. @పంతుల జోగారావు గారూ
  టైపింగ్ తప్పిదమే ..ఆ పదాల్ని తీసి వేయాలన్న తొందరలో జరిగినది…
  @కృష్ణశ్రీ గారూ..
  మీరు పేర్కొన్న పదాన్ని ఇక్కడ కూలీ నాలీ చేస్కునే వాళ్ళు చా… లా ఎక్కువగా వాడుతూ వుంటారు..
  ఈ పదాల్లో ఎక్కువ ఫోర్స్ వుండడం గమనించే వుంటారు..అవతిలి వాళ్ళను తిట్టేటప్పుడు చాచి పెట్టి కొట్టి నట్టు వుంటాయీ పదాలు.. అయితే ఇప్పటి వరకూ నాకూ ఈ పదాలకు అర్ధం తెలీదు..[మరీ కోపం వచ్చినపుడు మనసులోనే ఎదుట వాళ్ళను తిట్టుకొనే బాపతు నేను..] అందరికీ కృతఙ్ఞతలు..

 6. జోగారావుగారూ!

  మీరు వున్నది నిజమే.

  ఒరియా లో మగ, ఆడ కి సంబంధించిన ‘ఆ రెండు మాటల్నీ’ బండ, బియ్యా అంటారుట.

  (నా మిలిటరీ మితృలు చెప్పారు మా చిన్నప్పుడు ఓ కేంప్ లో)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s