దొంగ వెధవలున్నారు జాగ్రత్త…


ఒక పే…ద్ద కారూ…చలిపుట్టేంత ac అందులో.. అందులోంచి దిగారు ఒక పేద్దాయన….
నాది నిశ్చలమయిన …చిట్ కంపెనీ అన్నాడు…మీది తెనాలే…నాది తెనాలే…లాంటి
ఫీలింగులూ పెట్టాడు… నాకు గురుతుల్యులు లాంటి ఇద్దరు పెద్ద వారిని కూడా నన్ను ఒప్పించడానికి
తీసుకు వచ్చాడు…తన చిట్ కంపెనీ లో చిట్ కట్టమనీ…
నేను మొదటి నుండీ ఈ చిట్ మోసాలూ గమనించేవాడిని….ఎక్కువ వడ్డీ కి ఆశపడి తొక్కలో
అద్రెస్స్ లేని బాంకుల్లో దాచుకుని చివరికి టివి ల్లో ఏడ్చుకుంటూ స్టేట్మెంట్లు ఇచ్చేవారిని చూసి చూసి ఉన్నవాడిని కావడం
తో వీలయిన అన్ని మార్గ్గాల్లో తప్పించుకోవాలని చూశా…
కానీ మన పేద్దాయన… నిశ్చలమయిన వాడు …పట్టు వదలని దరిద్రగొట్టు వేధవా…కావడం వల్లా..
సిరి త్వరగా అబ్బదు..కానీ చీడ తొందరగా అబ్బుద్ది అంటారు అలా …
ఓ పట్టాన…వదల కుండా నన్ను చిట్లో చేర్పించి ..బిల్ పంపడం మొదలు పెట్టి నన్ను ఎలాగోలా
ఇరికించాడు..
మూడున్నర లక్షలు పై గా కట్టాక చీటీ పాడేశా…వాడు బిశానా ఎత్తేస్తాడేమో అన్న అనుమానం తో…
చెప్పాగా నిశ్చలమయిన చిట్ అనీ…ఆ వెధవ చిట్ ఎత్తేయనూ లేదూ….

నా డబ్బులు ఇవ్వనూ లేదు…

మనకు కాళీ వుండదు..ఫోన్ ల మీదే అడగడం…
తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు…. మన సినీమాల్లో నగేశ్ లాగా గెంతడం మొదలు పెట్టాడు..
ఈ ….చిట్ కట్టమని కుక్కలా వెంట పడ్డ పెద్ద మనిషి …
నా లాంటి భాదితులు ఎవరయినా కలిస్తే
తనకు రావాల్సిన బకాయిలు రాలేదనీ అందు వల్ల కట్టిన వారికి ఇవ్వలేకున్నాననీ ..
మన కెమెడియన్ నాగేశ్ లాగా పళ్ళు ఇకలి స్తూ చెప్పేవాడు..ఆ వెధవ…
అంత వసూలు చేయ లేని వాడు చిట్ కంపెనీ పెట్టడం ఎందుకు మమ్మలను
బలవంతం గా రొంపి లోకి దించడం ఎందుకూ అంటా???

పొట్ట పోసుకోవా లంటే వూరి చివర మరేదో కంపెనీ పెట్టు కోవచ్చుగా…

అన్నట్టు ఈ తెనాలి రామ లింగడికి పెద్ద పెద్ద ఇల్లూ..ఆస్తులూ బాగానే వున్నయ్యి…
తను మాత్రం జాగ్రత్త పడ్డాడు…వూరి జనాన్నే ముంచాడు…

తన పిల్లల్ని విదేశాల్లో సెటిల్ చేశాడు ఇలా సంపాదించిన సొమ్ముల్తో…
మంచి మార్గదర్శకం చేసే చిట్ వాళ్ళు వుండగా ఇలాంటి వేదవల్ని
నమ్మ వద్దు అని చెప్పడం నా పోస్ట్ వుద్దేశ్యం..

ఇలాంటి వెదవలు మీ గుమ్మం ఎక్కితే చెప్పుతో కొట్ట యినా వదిలించు కొండి…
కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారే అలా..

వీళ్ళు ఏదో మార్గాన మీ ఇంట్లో చొరబడతారు..ఎండు కంటే వాళ్ళ సంపాదనకు ఇది రాచ బాట…
తస్మాత్ జాగ్రత్త
[బొర్ కొట్టకూడదని సంక్షిప్తం గా చెప్పా మాటర్ని…]

4 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s