గ రి ట తిప్పుకోవడమే ఆడవాళ్లకు బెటర్…


ఏమాత్రం డవుటు లేదు..హైద్రాబాద్ గానీండి…
డెల్లి కానీండి…
ఏదో రిసర్వేషన్ వల్ల వార్డ్ లకు ఎం.ఎల్.ఏ. సిగ్మంట్ లకూ
ఎన్నికవుతున్నారు గానీండి…వీళ్ళు నిర్ణయాలేమ్ తీస్కోగలరూ??
మెగుళ్లు ఏలవలసిందే..జయసుద రచ్చ చేయడం వల్ల గానీ..
లేకుంటే ఆంద్ర ప్రజలంతా హైద్రాబాదు ను ఈ వీర నారీమణి ఏలేస్తుందని అనుకున్నారు..
తీరా చూస్తే ఈవిడ కూడా మా ఆడొళ్లలా చిప్పలు కడిగే బాపతే …
కాకపోతే రోజూ పట్టు చీర కట్టుకుని కొంచం రోడ్ల మీద ప్రజా సేవ పేరిట కాసేపు షికారు చేస్తారు..
మేడమ్ గారు..
అధికారమంతా ఆయన్దే…చెప్పాగా ఈ ఆడొళ్లకు చేతనైతే మొగుళ్లు ఎందుకు
అధికారం చెలాయిస్తారూ??
చదివే వుంటారు ఈ రోజు పేపర్లో…

మేయరమ్మా ఇదేందమ్మా!

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: మహానగర పాలక సంస్థ వార్డు కమిటీ సభ్యుల ఎంపికలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు, మేయర్‌ భర్త చంద్రా రెడ్డికి మధ్య తీవ్ర వివాదం చెలరేగుతున్నది. తార్నాక డివిజన్‌లో తాను సూచించిన అయిదుగురు సభ్యులను ఎంపిక చేయ లేదంటూ సికింద్రా బాద్‌ ఎమ్మెల్యే జయసుధ తాడో పేడో తేల్చు కోనున్నట్లు బహిరంగంగా ప్రకటిం చడంతో కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనాలు చెలరేగు తున్నాయి. వార్డు సభ్యుల ఎంపికలో తనను అవమాన పరి చారని, దీంతో నేనైనా ఉండాలి? లేదా మేయర్‌ అయినా ఉండాలని ఆమే ప్రతిజ్ఞబూనారు.

ఈ విషయంపై ముఖ్య మంత్రికి, పార్టీ అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆమే తెలిపారు. వార్డు కమిటీ సభ్యుల ఎంపికలో బండ చంద్రారెడ్డి ఏ స్థాయిలో జోక్యం చేసుకున్నారంటూ ఆమే ఆరోపించారు. మేయర్‌ ఛాంబర్‌లో పార్టీ కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధుల ముందు జయసుధ, చంద్రారెడ్డి వాగ్వివాదానికి దిగారు. తాను సూచించిన వారిని ఎందుకు ఎంపికచేయలేదంటూ నిలదీశారు. సభ్యుల ఎంపికలో తనను తీవ్రంగా అవమానించారంటూ తాను రాజీనామా చేస్తానని జయసుధ హెచ్చరించడం, దానికి చంద్రారెడ్డి చేసుకో పో అని చెప్పడంతో గొడవ మరింత ఉద్రిక్తకు దారి తీసింది.

తార్నాక డివిజన్‌లో వార్డు సభ్యుల ఎంపికలో ఎమ్మెల్యే సూచించిన వారికి పదవులు దక్కలేదని కొంతమంది కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో జయసుధ బల్దియా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఎన్ని కల తంతూ పూర్తి కావడంతో నేరుగా మేయర్‌ ఛాంబర్‌ వద్దకు వెళ్లి, మేయర్‌ భర్తను నిలదీశారు. దీంతో మేయర్‌ భర్త చంద్రారెడ్డి కూడా ఘాటుగా స్పందించడంతో జయ సుధ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ చంద్రారెడ్డిపై తీవ్ర ఆరోప ణలు గుప్పించారు. వార్డు సభ్యుల ఎంపికలో చంద్రారెడ్డి అవినీతి, ఆక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది. వార్డు కమిటీ సభ్యుల ఎంపికలో చంద్రారెడ్డి జోక్యం చేసుకోవడాన్ని ఆమే ప్రశ్నిం చింది. నేనైనా ఉండాలి…లేకుంటా మేయర్‌ అయినా ఉండాలంటూ ఆమే ప్రతిజ్ఞచేసింది. ఎమ్మెల్యే జయసుధ బాంబు పేల్చడంతో అక్కడున్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఖంగు తున్నారు. తనకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు అధిష్టానవర్గానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

నేనూ ఫిర్యాదు చేస్తాః మేయర్‌
తార్నాక డివిజన్‌కు సంబంధించిన బీజేపీకి పనిచేసిన ఓ వ్యక్తిని వార్డు కమిటీ సభ్యులుగా నియమించాలంటూ ఎమ్మెల్యే జయసుధ కోరిందని మేయర్‌ కార్తీకరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చేసినా? కార్పొరేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తుల పేర్లను తొలగించామని మేయర్‌ తెలిపారు. ఈ విషయంపై తనను సంప్రదించకుండా తన భర్తను సంప్రదించడంతో ఆయన స్పందించడంలో తప్పులేదని సమర్థించుకున్నారు. తనపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే తాను కూడా ఫిర్యాదు చేస్తే తాను కూడా ఫిర్యాదు చేస్తానని మేయర్‌ వెల్లడించారు.

ప్రకటనలు

9 Comments

 1. రాజకీయనాయకురాళ్ళు సంధి దశలో వున్నారు. ఏ మార్పు కయినా ఇలాంటి దశ సహజం. నెమ్మదిగా నెమ్మదిగా ఆ దశ నుండి బయటపడుతున్నారు. కొంత కాలంలో పూర్తిగా బయట పడతారు లెండి. సాధికారత సాధించుకుంటారు.

 2. భారత దేశానికి స్వతంత్రం వచ్చే తరుణంలో చర్చిల్, “భారతీయులకు స్వాతంత్ర్యాన్నీ, స్వేచ్చనీ సద్వినియోగ పరచుకునే పరిపక్వత లేదు. యాభై యేళ్ళల్లో అంతఃకలహాలతో తన బరువుతో తనే చతికిలబడే యేనుగులా భారతదేశం కుప్ప కూలిపోక తప్పదు. భారతదేశాన్ని స్వతంత్ర్య దేశం గా ప్రకటించటంలో మనం తప్పు చేస్తున్నాం” అన్నారట. అది వింటే భారతీయుల మనసుల్లో ఎలాటి భావనలు రేగుతాయో, ఇలాటి “ఆడవాళ్ళకి ఎన్ని పదవులూ, స్వాతంత్ర్యాలూ ఇచ్చినా అందుకు వాళ్ళు అనర్హులు,” అనే వ్యాఖ్యలు చూసినా నాకు సరిగ్గా అలాటి భావనే కలుగుతుంది.
  ఈ పేపరు న్యూసేమో కానీ,పైన మీర్రాసిన కవిత/ వ్యాఖ్యానం
  మాత్రం చాలా చిరాగ్గా వుంది. అందులో నాకు “గరిట తిప్పుకోవటం”, “చిప్పలు కడుక్కోవటం” చాలా నీచమైన పనులనీ, అవి చేయటం మాత్రమే ఆడవాళ్ళు చేయగలిగే పనీ, అనే భావన అంతర్లీనంగా అనిపిస్తుంది. నిజంగా మీరు అలాగే అనుకుంటూ వుండి వుంటే మీరు మీ ఆలోచనలనీ, ప్రపంచాన్నీ కొంచెం శ్రద్ధగా గమనించటం మంచిది.
  “గరిటె తిప్పుకొంటూ”, “చిప్పలు కడుక్కుంటూ” కూడా చాలా మంది ఆడవాళ్ళు చాలా “నిర్ణయాత్మకమైన పదవులు” నిర్వహిస్తూ మీ ఊహక్కూడా అందనంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు.
  ఎంత గొప్ప నాయకులకైనా, ఎవరికైనా, ఇలా ఆడవాళ్ళు “గరిట తిప్పుకుంటూ” “చిప్పలు కడుక్కుంటూ” చేసిన వంట తినకా తప్పదు.
  కాబట్టి “గరిట తిప్పటం”, “చిప్పలు కడుక్కోవటం” ఏవో నీచమైన పనులు అనుకోకండి.
  శరత్ గారు చెప్పినట్టు ఇలాటి దాశలు వాళ్ళు అధిగమించక మానరు.
  శారద

 3. కొద్ది గా కూడా ఆలోచించకుండా రాసినట్లున్నారు కార్తీక రెడ్డి సరే జయసుధ స్త్రీ కాదా ఆవిడ తన సొంత శైలి లో పని చేయట్లేదా ? మీరేంటి కార్తీక రెడ్డి సంగతి కొత్త గా చెబుతున్నారు ఈ విషయం ఆవిడ ఎన్నిక ఐన దగ్గరనుండి అందరికి తెలిసిందే ఇంకా చెప్పాలంటే ఆవిడ మేయర్ ఐన మరుసటి రోజే వాళ్ళ భర్త ను షాడో మేయర్ వ్యవరించాటానికి ప్రబుత్వానికి అప్లికేషను పెట్టుకుంది కాకపొతే అందరు ఎంత గడ్డి పెట్టాలో అంత గడ్డి పెట్టరనుకోండి !

 4. kvsv gaaru,
  ఈ విషయంలో మీతో ఏకీభవించటలేదు. ఆడవాళ్ళు చిప్పలు కడిగి, గరిటె తిప్పితేనే కదా మనం శుభ్రమైన పాత్రలో కమ్మని భోజనం తినేది. సమస్య ఏమంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. వారు కూడా భర్తల మీద ఆధారపడకుండా సొంతంగా పరిపాలన చేస్తే బాగుంటుంది. వ్యవహారం దగ్గర అయినవాడు, కానివాడు అన్నమాట ఉండకూడదు. పాలనా దక్షత పెంచుకొంటే మంచిది.

 5. kvsv గారు ,

  ఇక్కడ ఆడా మగా అన్నవిషయానికి ప్రాముఖ్యత లేదు . ఎందుకంటే సాక్షాత్తు మన సిఎం అసమర్ధుడు అనుకుంటున్నారు ఆలా అని మగాళ్ళని విమర్శించాలెం కదా. మొగుడి అంద లేకుండా అడుగు కూడా వేయలేని అసమర్దురాలిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం ఒక తప్పు. అసమర్దులకి పట్టం కడుతున్నారు అంతేగాని ఆడా మగా అనే భేదాలకి తావు లేదు. అటు కిరణ్ బేడీలు ఉన్న్బారు ఇటు నీరో చక్రవర్తులు ఉన్నారు.

 6. స్పందించిన వారందరికీ కృతఘ్యతలు..నిజానికి న్యూస్ పేపర్ లో చదివాక బాదతోనే ఈ పోస్ట్ పెట్టా…ఆ మొగుడు గారు లేకుంటే మరింత మంచి performance ఆవిడి ఇవ్వ్గలరు..mayor గా ఆవిడ ఎలెక్ట్ అయినట్టు చదివాక చాలా సంతోషపడ్డా…బహుశా అప్పట్లో ఆమె mayor గా ఎవ్వరూ పెద్దగా higlight చేయాలా..అంటే ఒక పెద్ద మహానగరానికి స్త్రీ గా సేవలనివ్వ బోతున్నందుకు పెద్దగా అభినందనలు ఇవ్వలేదని పించింది..
  స్త్రీ లు ఎంత పెద్ద position సాదించినా ఈ చెమ్చా గాళ్ళు induviduality maintain చేయనివ్వరు…ఆ మంట నే నా పదాల్లో అలా చెప్పా..
  అంతే తప్ప నాకు వేరే గా నెగెటివ్ ఫీలింగ్స్ ఏమీ లేవు…
  చిప్పలు తోమడం గరిట తిప్పడం కూడా ఆ కోవ లోని మాటలే..
  ఏ పనయినా సరే నా దృష్టిలో work is god…
  మా టీం లో రోజుకు 20 గంటలు వర్క్ చేసే లేడీ డాక్టర్ లు వున్నారు..
  ఆడవారు మంచి పదవులు పొందుతున్నా ఇలా విమర్శలకు గురవుతున్నారు..ఆ భాధ… మంట తో వ్రాసినది..
  …కావాలనే..
  ఆడవాళ్ల పై నా అభిప్రాయం వెల్లడిస్తే మగాళ్లంతా నన్ను కరిచేస్తారు…
  అంతటి మంచి అభిప్రాయం వుంది నాకు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s