నష్టపోయేది ప్రజలే…


{ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టి… జనాల్లో నెగిటివ్
ఆలోచనలు పెట్టడానికి పేపరోళ్ళు చేస్తూన్న బోగస్ సర్వేలు…}

ఎవడు చెప్పాడు వీళ్లకీ?సంక్షేమ పదకాలు రద్దు చేస్తే..
జనం నిరసన వ్యక్తం చేస్తున్నారా?
కాంగ్రెస్స్ వాళ్ళని తిరగనీరా?మంత్రుల్ని నియోజక వర్గాల్లోకి రానీరా??
వీడు సర్వే చేశాడా??ఏమనీ?మమ్మల్ని ఎందుకు అడగలేదూ?సర్వేలో చేర్చ లేదూ??
ఇదో రకం బ్లాక్ మైలింగ్…ప్రభుత్వాన్ని…పేపర్ని అడ్డు పెట్టుకుని
తమ డెస్క్ దగ్గర కూర్చొని రాసే రాతలు ఇవ్వన్నీ..రాష్ట్రానికి పెద్ద బొక్క పది పోతూండని తెల్సు..
కానీ రోశయ్యని ఇరకాటం లో పెట్టేయాలి..
పనికమాలిన పధకాలు కావు ఇవ్వన్నీ..కానీ గాడి తప్పేసాయి…
జనాబా కంటే మించిపోయాయట తెల్ల కార్డులు…హా హా హా హా
ఇదొక్కటీ చాలదా సొమ్మన్తా ఎటు పోతుందో?
ప్రతీ ఏడూ మార్కెట్ లోకి వస్తూన్న ఎంజినియర్లు ఒక లక్షా పాతిక వేలు…హ హా హా..
ఇంటర్ పాస్ అయితే ఎంజినియర్ …ఎలాగా??
గవర్నమెంటే ఫీజులు కడుతుంది కాబట్టీ…లేకుంటే..మంచి profession..ఎంచుకునే వారేమో?
ఆ తర్వాతా??ఇంకేముందీ మేకలు కాయడమే ..నిజమండీ ఎంజినియర్ డిగ్రీలు ఓ మూల పారేసి
హోటల్లలో క్యాషియర్లుగానూ..సెల్ షాప్ ల్లో సేల్స్ మన్ లుగా చేరిపోతున్నారు..ఈ ఎంజినియర్లు …
బాగు పడుతున్నదంతా ఈ కాలేజీ లు పెట్టి కోట్లు దండుకుంటున్న యాజమాన్యాలే…
రోజూ తాగడానికి మందు కూడా మూడు పూట్లా ఫ్రీ గా ఇవ్వమంటారు సరే..
మరి మీ బుర్ర దొబ్బిందా పే ప ర్రో ళ్ళా రా?
ఈ పధకాల వల్ల బి.సి. లకు వొరిగేదేమీ లేదు..పాత పదకాల్నలా వుంచి…
కొత్త పధకాల్ని వై.ఎస్.దగ్గరకు పంపిస్తే సరీ…..స్టేట్ ఎకానమీ అదే దారిలోపడుద్ది…
ఇదిగో పాపరోడి దురద క్రింద చదవండి…

సంక్షేమ పథకాలు తొలగిస్తే.. తిరుగుబాటు
(సూర్య ప్రధాన ప్రతినిధి)దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలకు సమాధి కట్టేందుకు చాప కింద నీరులా జరుగుతున్న ప్రయత్నాలపై జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వం తీరుపై పిడికిలి బిగిస్తున్నాయి. వారి ఆగ్రహావేశాల తీరు తిరుగు బాటును తలపిస్తున్నాయి. తమ జీవితాలకు భరో సానిస్తున్న ఈ పథకాలను తొలగిస్తే సహించేది లేదంటూ స్వయంగా మం త్రుల నియోజకవర్గాల్లోని ప్రజలు, కాం గ్రెస్‌ నేతలు బాహాటంగా చెప్పడం విశేషం.మంత్రుల నియోజకవర్గాల్లోని ప్రజల ఆగ్రహా వేశాలు పరిశీలిస్తే.. దాని ప్రభావం కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రంగానే ఉండేలా కనిపిస్తోంది. దీనిపై ‘సూర్య’ గత రెండు రోజులనుంచి మంత్రుల నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో జనం వ్యతిరేకత, పార్టీ నేతల ఆందోళన ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమయింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున 1100 నుంచి 1600 మంది అభిప్రాయాలను ‘సూర్య’ ప్రతినిధులు సేకరించారు. మంత్రి లేని ఆదిలాబాద్‌ జిల్లాను మాత్రం మినహాయించడం జరిగింది. వీరిలో 700 నుంచి 1300 మంది వరకూ బీసీ, ఎస్సీలు ఉండగా, మిగిలిన వారిలో ఇబీసీలు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అందులో మహిళలు 900 మంది ఉన్నారు.

మెజారిటీ మాట అదే
సంక్షేమ పథకాలు కొనసాగించాలా? వద్దా అన్న ప్రశ్నకు కొనసాగించాల్సిందేనని ప్రతినియోజకవర్గం లోనూ సగటున 1390 మంది స్పష్టం చేశారు. పథకాలు పునః పరిశీలించవలసిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు అవునని 40 మంది బదులిచ్చారు. పథకాల అమలులో అనర్హులకూ చోటు లభిస్తుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు 170 మంది అవునని సమాధానమిచ్చారు.అదేవిధంగా ఈ పథకాలవల్ల తమ జీవితాల్లో మార్పు లు వచ్చాయని 65శాతం మంది ప్రజలు అభిప్రాయ పడగా, ఇంకా తమకు ఆ పథకాలు అందలేదని 27 శాతం మంది చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పిన వారికే అవి అందాయని 8శాతం మంది వెల్లడించారు. పథకాలు నిలిపివేస్తే మంత్రులను ఊళ్లలోకి రానీయని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేసేది లేదని 72 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. పథకాలు భారమైనప్పటికీ, మిగిలిన రంగాల్లో అవినీతిని తగ్గిస్తే ఇవి అమలు చేయవచ్చని 18 శాతం మంది సూచించారు. భారమేనని 10 శాతం మంది ….
[ఇలా సాగింది సొంత పైత్యం…ఆదేనండీ సొంత ఏజండా లుంటాయిగా..}

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s