భాద్యతా రాహిత్యం..


సంక్షేమ పధకాలు సరిపోవు మర్రిన్ని అవసరం..ఎం చేద్దాం డబ్బు ఎక్కువ ముద్రిస్తే?అప్పుడు అందరికీ రెండు రూపాయల బియ్యం.. ఉచితంగా ఇంజనీరింగ్ విద్య అందించవచ్చు కదా?
60 లక్షలతో కట్టిన భవనానికి ఇరవై లక్షలు regularisation ఫీజు కింద కట్టమని మునిసిపాలిటీ వారు చెప్పారు..
ఒక పెద్దాయనకు..బాదుతున్న పన్నులకు ఇది ఉదాహరణ మాత్రం…
ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెడుతుందీ? ఇంజనీరింగ్ కాలేజీ లనో మరోట నో పెట్టే బిసినేస్స్ మాన్ ల జోబుల్లోకి..
ఎక్కడ నుండి తెస్తాం?ఈ సొమ్మన్తా?
అసలు రీజర్వేషన్ లు 50% మించ కూడా దన్నట్టుగా ఈ జాతిని నిర్వీర్య పరచే పధకాలకు కూడా ….
ఇంతకు మించి బడ్జెట్ లో కేటాయించ రాదని ఏ కోర్ట్ ఐనా రూలింగ్ ఇస్తే బావుణ్ణు..
ఈ పధకాల పుణ్యమా అని ..
పని ఎగ్గొట్టటం కూడా ఎక్కువైందని జనాలు గోల పెడుతున్నారు?
అన్నీ ఊరకే వస్తూంటే పనిచేసి అయిదూ పది సంపాదించాల్సిన అవసరం ఏమోచ్చిందట?
బి గ్రేడ్ మున్సిపాలిటీ లో నాలుగైదు ఇళ్లు న్న ఆసామీలు..
యాబై అరవై ఏకరాలున్న ఆసామీలకు ఆరోగ్య శ్రీ కార్డులు..
సరయిన అర్హులను గుర్తించ కుండా సొమ్ముల్ని ఎలా పంచి పెడతారు?
మన లాంటి దేశాల్లో సంక్షేమ పదకాలు అవసరమే…కానీ సొమ్మన్తా
ఆ పేరుతో సంతర్పణ జరుగుటూంటే?
పైగా భాద్యత కలిగిన మీడియా మంచీ చెడూ విశ్లేషణ మాని రెచ్చగొట్టుడు పద్దతికి దిగితే ఏమవుతుందో చూడండి..
ఆరోగ్యశ్రీ కానీన్దీ ఫీజుల రేయంబార్స్ మెంట్ కానీండి వేల కోట్ల రూపాయల సంతర్పణ జరుగుతూన్న పధకాలే..
ప్రజలకు జరుగుతున్న దోపిడీ ని ఎత్తి చూపాల్సింది పోయి..
పేపర్ వాళ్ళ భాద్యతారాహిత్యపు వార్తలు చూడండి….

సంక్షేమ పధకాలకు సమాధి!
(సూర్య ప్రధాన ప్రతినిధి): రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, బడుగు బల హీన వర్గాలకు ఫీజుల రీయంబర్స్‌మెంట్‌, ట్యూ షన్‌ ఫీజుల చెల్లింపు, స్కాలర్‌షిప్‌, ఉచిత విద్యుత్‌.. ఇవన్నీ ఇక కలగా మిగలనున్నాయి. ఇన్నాళ్లూ ఈ పథకాల వల్ల లబ్దిపొందుతున్న బడుగు బలహీన వర్గాలకు ఇకపై అవి ఎండ మావి కానున్నాయి. ఒక తీపిజ్ఞాపకంగా నిలిచి పోనున్నాయి. ఆర్థిక సంక్షోభం పేరుతో రోశయ్య ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలకు సమాధి కట్టేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లను ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధం చేయ డం బడుగు వర్గాల్లో బడబాగ్ని రగుల్చుతోంది. రెక్కాడితేగానీ డొక్కాడని బీసీ వర్గాలు చదువుల బాట వదిలి మళ్లీ కూలీల అవతారమెత్తేందుకు సర్కారు దారి చూపిస్తోంది.

వైఎస్‌ పథకాలతో మారిన పేదల బతుకులు
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకాల వల్ల కడు పేదరికంలో ఉన్న బడుగు బలహీన వర్గాల జీవి తాలు, ఆర్థిక స్థితిగతులలో అనూహ్య మార్పులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి వరకే చదివి, పై చదువులకెళ్లే ఆర్థిక స్తోమత లేక అగ్రకుల భూస్వాముల వద్ద పాలేర్లుగా పనిచేసి, వారివద్దే జీవితాలు తెల్లార్చుకుంనేందుకు దశాబ్దాలుగా అలవాటుపడ్డ బీసీ విద్యార్థులకు.. వైఎస్‌ ప్రారంభించిన ఫీజుల రీయంబర్స్‌మెంట్‌ పథకం వరదాయినిలా పరిణమించింది. ఫలితంగా.. గత ఐదేళ్లలో వేలాదిమంది నిరుపేద బీసీ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించారు.

లక్షల రూపాయలయ్యే ఇంజనీరింగ్‌ విద్య పైసా ఖర్చులేకుండానే వైఎస్‌ పుణ్యాన పూర్తయింది. ఒక పేద బీసీ విద్యార్థి ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాయి వరకూ చేరడం కలలో కూడా సాధ్యం కాదు. కానీ, వైఎస్‌ ఆ కలను సాకారం చేశారు. అదేవి ధంగా కిలోరెండు రూపాయల బియ్యం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు బడుగు వర్గాల జీవితాల్లో ఊహించని మార్పులు తెచ్చాయి. పేద బడుగువర్గాల వారికి కార్పొరేట్‌ వైద్యం చేయించడంతో వైఎస్‌ పేదల దేవుడయ్యారు. ఆ పథకంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, మొత్తంగా ఎక్కువమంది పేదలకు అది వరప్రసాదంలా పరిణమించింది. ఇప్పుడు అలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో ఎసరు పెట్టి, సర్కారు తన బాధ్యతల నుంచి తప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై బడుగు వర్గాల్లో అల్లకల్లోలం మొదలయింది.

2 Comments

  1. మన సమాజం లో మార్పు ఇప్పటిలో సాద్యం కాదు …
    జనాలలొ సర్దుకు”పొయేతత్వం” ఉన్నంతవరకు..ఇంతే జగము…
    ఇంకా మీడియా విషయానికి వస్తే బిజినెస్ మైండెడ్ అయిపొయింది..
    ఏం చేస్తాం “ధనమూలమిదం జగత్”

  2. నాకు తెల్సిన ఒక మున్సిపల్ వైస్ ఛైర్ మన్ గారి తల్లి గారికి వృద్దాప్యపు ఫించను మంజూరు చేయించుకున్నారు..ఎవరిగురించి ఈ పధకం? పేదవారికి చెందాల్సిన సొమ్ములు ఇవ్వి..ఒకే వీదిలో ఆరేడు ఇల్లున్న ఆసామీలకు వృద్దాప్యపు పింఛన్లా??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s