అమ్మాయిలూ జాగ్రత..


ఎంతో తెలివైన అమ్మాయిలు కూడా పదో తరగతి పెయిల్ అయ్యి బేవార్సు గా
రోడ్ల మీద తిరిగే అబ్బాయిల బుట్టలో లవ్ పేరుతో పడి..
జీవిత మంతా నరకం అనుభవించిన వాళ్ళు వున్నారు.ప్రస్తుతం పరవాలేదనుకోండీ
జనాలు తెలివి మీరారు..అయినా కూడా..అమ్మాయిలూ జాగ్రత్త…

[ఆంధ్ర భూమి దిన పత్రిక నుంచి]
అమ్మాయలూ.. ఆలోచించండి
-ఆర్కే
May 19th, 2010

‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్న మాట అక్షరాలా నిజం. ఎందుకంటే వయసు వేడిలోనో, ప్రేమమత్తులోనో పడి సరైన భాగస్వామిని ఎంచుకోకుంటే జీవితాంతం బాధ తప్పదు కనుక. ఈ విషయంలో మగాళ్ల కంటే ఆడవాళ్లే కాస్త జాగ్రత్త పడాలి కూడా. మన సమాజంలో ఆడదానికి ఒకే భర్త, ఒకే సంసారం. మగాడి మాత్రం ఒకటికి మించి రెండు సంసారాలు సాగించినా సమాజం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంది. అందువల్ల మహిళలు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మనసు చెప్పినట్టుకాక బుద్ధికి పని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు అనుభవజ్ఞులు.
మారిన కాలంలో ఈ ఆలోచన ఎంతైనా అవసరం. పెద్ద చదువులు, ఉద్యోగాలు, సొంత సంపాదనతో తమ కాళ్లపై నిలబడుతోన్న ఆధునిక మహిళ, వివాహం విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు. ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు’ -ఇలాంటి వాళ్లను చూస్తూ ఏ ఆధారం లేని అతివలు సైతం పెళ్లి విషయంలో తొందరపాటుకు పోయి ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందం’గా బాధపడుతున్నారు.
నాలుగు తియ్యని మాటలు చెప్పో, రెస్టారెంట్లకు, సినిమా హాళ్లకు బైక్‌మీద ఎక్కించుకుని తిప్పే సరికో స్నేహం కాస్తా ప్రేమగా మారిపోయి మగవాడి వలలో పడిపోతున్న అమ్మాయిలు చాలా మందే కనిపిస్తున్నారు. గుణగణాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకోకుండా గుడ్డిగా మనువాడి, తరువాత లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. అటు కన్నవారిని దూరం చేసుకుని, ఇటు కట్టుకున్న వాడు కాదుపొమ్మంటే ఇలాంటి వాళ్ల పరిస్థితి ‘రెంటికి చెడ్డ రేవడి’గా మారుతోంది. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలైతే జీవితం గడిచి పోడానికి దారి ఉంది కనుక కొంతకాలం తర్వాత మనసుకు తగిలిన గాయాలు మానిపోయి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. సాధారణ మధ్య తరగతి మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక ఆత్మహత్యలే శరణ్యం.
అందుకే -జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో తల్లిదండ్రుల మాటకు విలువివ్వడం మంచిదంటారు పెద్దలు. కన్న బిడ్డల బాగోగుల గురించి ఎక్కువ ఆలోచించేది వారేకనుక. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడో, ప్రేమించో ఉంటే ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పడం అమ్మాయిల బాధ్యత కూడా. తమ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి మంచివాడా కాదా. అతని కుటుంబం నేపథ్యం ఎలాంటిది ఇత్యాది విషయాలు తెలుసుకుంటారు. అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయి సుఖపడుతుందా లేదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వారు చెప్పే నిర్ణయం అనుకూలంగా లేకున్నా, కొద్దిరోజులు బాధగా ఉన్నా, తరువాత వాస్తవం గ్రహించి కొత్త జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అందగాడా, ధనవంతుడా అన్నవి ఆలోచించేకంటే, గుణానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మొదటి రెండూ పెద్దగా లేకున్నా రాజీ పడొచ్చుగానీ, గుణం లేకుంటే ఆమె జీవితమంతా చీకటే. కన్నీటి సంద్రమే. అందుకని మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మాత్రం అమ్మాయిలు పెద్దల మాటకు గౌరవం ఇవ్వడం ఎంతైనా శ్రేయస్కరం.

ప్రకటనలు

5 Comments

  1. బాగా రాశారు. అబ్బాయిలకుండ వలసిన ఈ గుణం యొక్క ముఖ్య లక్షణాలను కూడా కొంచెం విశదీకరిస్తే బాగుండేది. అలానే పెద్ద వాళ్ళు చూడవలసినది అమ్మాయిల యొక్క మానసిక, శారీరక, భావోద్వేగ లక్షణాలకి అబ్బాయి యొక్క ఆయా లక్షణాలు సరిఫొతాయా అని. కానీ ఇది మన సమాజం లో పూర్తి గా సాధ్యం కాదు. పెళ్ళి కి ముందే ప్రేమ లో ఉన్న జంటలను ఇద్దరినీ గమనించటం ద్వారా పెద్ద వాళ్ళు ఇది కొంచెం కని పెట్టగలరు. జాతకాలు చూడటం, డబ్బు ఉందో లేదో చూడటం వరకూ ఒకే కానీ ముందు ముందు పై చెప్పిన కంపాటిబిలిటీ నే ప్రధానం అవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s