సొమ్ములు రావాన్దీ??


ప్రభుత్వమ్మీద కోర్టు కు పోతారాట ఎంత ప్రేమ వెనక బడ్డ విద్యార్డుల మీద..
డబ్బులు ఎప్పాసిగా దొ..దానికి అలవాటు పడ్డారుగా
ఇప్పుడు ఒక్కసారిగా ఆ సొమ్ములు రాకపోతే???

ఫీజుల రెయంబార్స్ మెంట్ పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కాలజీలు ఈ సంవత్స రమ్ ప్రభుత్వం
దగ్గర కొట్టేయ బోతున్న మొత్తం ఎంతో తెలుసా ?3500 కోట్ల రూపాయలు..
నిజమండీ ఇంత డబ్బు వెద జల్లు తుంది కాబట్టే ప్రతీ వాడు కాలేజీలు పెట్టి ఏడా పెడా సొమ్ములు చేసుకుంటున్నారు..
నాకు తెలిసిన ఒక అప్పుల అప్పారావు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఈ మద్యనే 200 ఎకరాలు కొన్నాడు..
ఐదారు కార్లు కొని దర్యాగా తిరుగుతున్నాడు..
తమకు చుక్కఎదురవబోతున్నదని కోర్టు కు పోబోతున్నారు..
ఇదంతా విద్యా సేవ కాదు..విద్యార్డుల మీద ప్రేమాకాడు..
డబ్బు సంపాదనకు షార్ట్ మతడ్స్ ..ఆరోగ్య శ్రీ కంటే పెద్ద కుంబ కోణం ఇది..
దయచేసి ఇలా ప్రజల ధనం పనికి మాలిన పదకాల ద్వారా కొంత మండి జోబుల్లోకి పోతుంది
ఇలాంటి పధకాల్ని సమర్దించకండి..
వీళ్ళ బ్లాక్ మేలింగ్ పసిగట్టిన ప్రభుత్వం అటునుంచి నరుక్కు రాడానికి ప్రయిత్నిస్తూంది
కానీ లాబీయింగ్ లు ప్రభుత్వాన్ని ఆ పని చేయనీవు…
వార్తలు క్రింద చదవండి…

హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యం

హైదరాబాదు : ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం సాంకేతిక విద్యాశాఖ మంత్రితో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కోర్టు వేసవి సెలవుల అనంతరం కేసును విచారించనుంది. ఈ నెల 25 వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే కళాశాలలు మూసివేస్తామని వాటి యజమానులు హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఇక ఐటీ దాడులు ?
(సూర్య ప్రధాన ప్రతినిధి)ఫీజుల రీయంబర్స్‌మెంట్‌, ట్యూషన్‌ఫీజులు చెల్లించకపోతే ఈనెల 26 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసివేస్తా మన్న ఇంజనీరింగ్‌ కాలేజీ అసోసియేషన్‌ హెచ్చరికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఇందులో వారి పాత్ర, ఆసక్తి ఏమిటి? అన్న అంశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజన్స్‌ విభాగం ద్వారా ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బకాయిల చెల్లింపులపై తనను హెచ్చరించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ వ్యవహారంలో వైఎస్‌ జీవించి ఉన్నంత వరకూ ఆయన సర్కారుకు దన్నుగా నిలిచిన ఒక ఉద్యమ నాయకుడు, ప్రభుత్వాన్ని కావాలని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఇంజ నీరింగ్‌ కాలేజీ నిర్వాహకులు చాలాకాలం నుంచి ఒక లాబీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నారనీ, మీడియాలో ఒక వర్గాన్ని ఏర్పాటుచేసుకుని ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్నారన్న సమాచారం వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఇంజ నీరింగ్‌ కాలేజీలపై ఆదాయం పన్ను శాఖతో దాడులు చేయించేందుకు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. బంద్‌పై ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల్లో విభేదాలు ఉన్నాయన్న విషయం కూడా నిఘా వర్గాల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.

ప్రభుత్వం నుంచి బకాయిలు ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదికయినా వస్తాయని, దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, బంద్‌ వరకూ తీసుకువెళితే.. తమ వద్ద ఉన్న లోపాలు ప్రభుత్వానికి ఒక అవకాశంగా మారి, కాలేజీల నిర్వహణలపై మరింత కఠినంగా వ్యవహరించే ప్రమాదం కూడా లేకపోలేదన్న ఆందోళన వారిలో ఉన్న విషయాన్ని నిఘా వర్గాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుని, కాలేజీ అసోసియేషన్‌లో మరో సంఘం ఏర్పాటుచేయించే దిశగా ఒక ప్రముఖుడు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

2 Comments

  1. మన రాష్ట్ర సంవత్సర బద్గెట్ ఎంతో చూడండి..లక్ష కోట్లు అన్నది బోగస్..అందులో మూడు వేల అయిదు వందల కోట్లు..కేవలం చిల్లర దోపిడీ గాళ్లకు ఒక పద్దులో దొబ్బేసే మొత్తంగా…ఊహించండి..పెద్దగా తెలివితేటలు అక్కర్లా ఇలా దొచేయడానికి..ఇలాంటివి ఎన్ని పదకాలున్నాయ్యో డబ్బు సంతర్పణకి…కేవలం ఈ రెయంబర్స్మెంట్ డబ్బులు వస్తాయన్న ఉద్దేశ్యం తో కాలేజీలు ఒక్కొక్కడూ సీరీస్ లా స్టార్ట్ చేస్తున్నారు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s