కొత్త సీసా ..పాత సారా..


పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీస్కో కూడదు..
చట్టం ఒకటుంది…దాని ప్రకారం కోర్టులో హాజరు పరచాలి…
సాక్స్యాలు వగైరా వగైరా బలంగా వున్నయ్యో లేవో చూస్కోవాలి..
నిందితులకి సరయిన శిక్ష పడేట్టు చేస్కోవాలి..
ఎన్కౌంటర్ లు అన్యాయం…పిండా కూడు వసీం దిబ్బా అని పిచ్చ వాగుడు వాగడం
రోజూ టివి ల్లో చూస్తాం గా…వాళ్ళందరూ ఉప్పు డబ్బాలు పట్టుకుని
ఈ నింధితుని దగ్గరకు పోవడం బెటరు..
పత్రికల్లో వచ్చిన వార్త చూడండి…త్వరలో చక్కగా విలాసవంత మైన జీవితాన్ని గడపబోతున్నాడు..
ఈ రాక్షసుడు…మళ్ళీ పాత కధ పునరావృత్తం కాబోతూంది…
[సూర్య దిన పత్రిక 19/05/2010]
వైష్ణవి హత్యతో సబంధంలేదన్న నిందితుడు

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : విజయవాడలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్యకేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ కేసులో ప్రధాన నిందితుడు మోర్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఛార్జిసీటు కాపీలు అందచేసేందుకు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు వెలుపల శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ వైష్ణవి కేసుతో పోలీసులు తనను అనవసరంగా ఇరికించారని పేర్కొన్నాడు. గతంలో తాను నేరాన్ని అంగీకరించినప్పటికీ, నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తీసుకురావడమే కారణమన్నాడు. ఇదే కేసులో రెండోక నిందితుడు వెంకట్రావ్‌ గౌడ్‌ మొదటి నుంచీ ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పడం విశేషం. కాగా మంగళవారం రెండో నిందితుడు కూడా ప్లేటు పిరాయించడం పోలీసులకు ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s