కిక్కు దిగుతుందా??


ప్రతీ సంవత్స రమ్ పెద్ద టాపిక్ మాకు మార్కెట్ లో బీర్లు దొరక్క బీర్బల్ లందరూ
ఇబ్బంది పడుతున్నారని…ఎండాకాలం లో బీరు బాబులు రెచ్చి పోయే వారు…
మాలాంటి వారందరం ఈ తాగుడు పిచ్చ చూసి నిట్టూర్చే వాళ్ళం..
షాపుల్లో కొచ్చిన స్టాక్ అంతా ఉదయమే అయిపోయేదట.ప్రస్తుత సంవత్సరమ్ మాత్రం..
బీరు తాగుడు తగ్గిందట..మిగిలిన అమ్మకాలు కూడా తగ్గితే..సమాజం చాలా సంతోష పడుతుంది..
కేవలం ఈ తాగుడు అలవాటు వల్ల కొన్ని వేల కాపురాలు కటిక ధారిధ్ర్యాన్ని అనుభవిస్తూన్నాయి..
నరక కూపం లోకి నెట్టి వే య బడతూన్నాయి…ఒక్కసారి గమనించండి…
సంక్షేమ మంటూ ఎన్ని వేల కోట్లు గుమ్మరించినా ఈ ప్రభుత్వం ..
మద్యం ఉన్నంతకాలం ప్రజల జీవితాలు కుక్క బతుకులే…
ఇలా మద్యం అమ్మకాలు మరింత దిగ జారాలని ఆ భగవంతుణ్ణి.కోరుకుందాం …
ఎందు కంటే ప్రభుత్వం ఎలాగూ వినదు కాబట్టి…

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : వేసవి ఎండలు మండిపోతున్న కొద్దీ పెరగాల్సిన మద్యం అమ్మ కాలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. మద్యంప్రియుల వల్ల వేసవి తాపానికి అనుగుణంగా పెరగాల్సిన బీరు అమ్మకాలు ఆ మేరకు ఆశాజనకంగా లేకపో వడం గమనార్హం. మద్యం విక్రయాలను పెంచుకు నేందుకు ఎకై్సజ్‌శాఖ ఇటీవల కాలంలో ‘ఐఎంఎల్‌ కొనుగోలు చేస్తేనే బీరు సరఫరా’ అనే నిబంధన విధించడం కూడా బీరు విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. వాస్త వానికి సాధారణ నెలల్లో ప్రతినెల కనీసం 22 లక్షల బీరు కేసుల అమ్మకాలుంటాయి.

అదే వేసవి కాలం మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సరాసరిగా నెలకు 30 లక్షల కేసులకు పైగా బీరు అమ్మకాలు నమోదవు తాయి. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో బీరు అమ్మకాలు ముపె్పై లక్షల కేసులకు చేరకపోవడంతో ఆబ్కారీ యంత్రాంగం సైతం ఆశ్చ ర్యాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఈసారి ఎండల తీవ్రత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఉండడం వల్ల మందు బాబులకు, యువత కు బీరు తాగేందుకు సన్నద్ధం కావడం లేదనది కొందరి అభిప్రాయం. దీనికి తోడు మద్యం వ్యాపా రులు సిండికేటుగా మారి ఎంఆర్‌పి ధరల కంటే ఎక్కువ ధరలకు బీరు అమ్మకాలు సాగించడం కూడా విక్రయాలు తగ్గడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఎంఆర్‌పి ధరల కు మించి మద్యం అమ్మకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని ఆబ్కారీ శాఖ అధికారులు అంగీకరి స్తున్నారు. మద్యం వ్యాపారులంతా సిండికేటుగా మారిన నేపధ్యంలో అలాంటి వాటిపై ఫిర్యాదులు వచ్చినా తాము చర్యలు తీసుకోలేకపోతున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s